మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీని చూసుకోవడం ఎలా?
పీఎఫ్ సబ్‌స్క్రైబర్స్‌కు వడ్డీ సొమ్ము కూడా జమ అవుతుంది. గత ఏడాది అంటే 2018-19కి గాను 6 కోట్లకు పైగా ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల ఖాతాల్లోని సొమ్ముపై 8.65 శాతం వార్షిక వడ్డీ సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్, ఆన్ లైన్ వంటి మార్గాల ద్వారా మీరు మీ వడ్డీ జమ అయిందా లేదా తెలుసుకునే వెసులుబాటు ఉంది.

ఎస్సెమ్మెస్
మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నంబరుకు సందేశం పంపించాలి.

మిస్డ్ కాల్
రిజిస్టర్డ్ యూజర్స్ మిస్డ్ కాల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ మీ మొబైల్ నెంబర్‌కు బ్యాలెన్స్ వివరాల్ని ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తుంది.

ఈపీఎఫ్ఓ వెబ్ సైట్
- మొదట వెబ్ సైట్‌కు వెళ్లాలి.
- Our Services సెక్షన్‌లోని For Employees పైన క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- Member Passbook పైన క్లిక్ చేయండి.
- అక్కడ UAN, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
- పాస్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ కాంట్రిబ్యూషన్, అలాగే మీ యాజమాన్యం కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది.
- అప్పటి వరకు ఎంత సొమ్ము జమ అయిందో తెలుసుకోవచ్చు.

ఉమంగ్ యాప్ ద్వారా..
ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లాగే ఉమంగ్ యాప్ ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. యూఏఎన్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి వివరాలు తెలుసుకోవచ్చు.
- మీ స్మార్ట్ ఫోన్‌లో ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమంగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- ఉమంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓను ఎంచుకోవాలి.
-ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- మీ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వ్యూ పాస్ బుక్ పైన క్లిక్ చేయాలి.
- UAN నెంబర్ ఎంటర్ చేశాక OTP వస్తుంది.
- ఆ తర్వాత లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కంపెనీ మెంబర్ ఐడీని ఎంచుకోవాలి.


Click it and Unblock the Notifications