బీఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 500 బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ను తీసుకువస్తోంది. ఈ ప్లాన్‌లో హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ప్రైవేటు ఆఫరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థ సూపర్ స్టార్ 500 అనే అద్భుత ప్లాన్‌ను తీసుకు వస్తోంది. రిలయన్స్ జియా గిగా ఫైబర్ గత ఏడాది నుంచి ట్రయల్ నిర్వహించి, ఈ ఏడాది సెప్టెంబర్ 5న లాంచ్ చేసింది. దీనికి పోటీగా ఎయిర్ టెల్ కూడా పలు ఆఫర్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించేలా బ్రాడ్‌బ్రాండ్ ప్రణాళికపై దృష్టి సారించింది.

బీఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 500 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 500 ప్లాన్... అండమాన్ నికోబర్ సహా అన్ని సర్కిల్స్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది బీఎస్ఎన్ఎల్‌కు ప్లస్. ఇది మంత్లీ రెంటల్ చార్జ్ ప్లాన్. సబ్‌స్క్రైబర్లు నెలకు రూ.949 చెల్లించాలి.

డీఎస్ఎల్, భారత్ ఫైబర్ ప్లాన్స్
ఈ ప్లాన్‌ను డీఎస్ఎల్, భారత్ ఫైబర్ అనే రెండు కేటగిరీలుగా విభజించారు. వీటితో పాటు కాంప్లిమెంటరీ ఆఫర్ కింద హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. డీఎస్ఎల్ ప్లాన్ సబ్‌స్క్రైబర్స్ 10Mbps వేగంతో, భారత్ ఫైబర్ సబ్‌స్క్రైబర్స్ 50Mbps వేగంతో 500GB డేటాను పొందవచ్చు.

ప్లాన్ ధర నెలకు రూ.949
డేటా పూర్తిగా వినియోగించిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 2Mbpsకు తగ్గుతుంది. ఈ ప్లాన్ ధర నెలకు రూ.949. దీంతో పాటు రూ.1000 విలువ కలిగిన హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. లైవ్ స్పోర్ట్స్, ఇంగ్లీష్ మూవీస్, టీవీ షోస్ తదితర వాటికి యాక్సెస్ ఉంటుంది.

24 x7 ఉచిత కాల్స్
అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం అదనం. ల్యాండ్ లైన్ కనెక్షన్ ద్వారా లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితం. ఏ నెట్ వర్క్‌కు అయినా కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఈ ఉచిత కాల్స్‌కు కూడా ఎలాంటి టైమ్ లిమిట్ లేదు. 24 x7 మీరు ఎప్పుడైనా కాల్స్ చేసుకోవచ్చు.

రూ.749తో కూడా 300 ప్లాన్
నెలకు 500GB మీకు ఎక్కువగా అనిపిస్తే సూపర్ స్టార్ 300 ప్లాన్ కూడా ఉంది. ఇది కూడా దాదాపు అలాంటి ప్రయోజనాలు అందిస్తుంది. డేటా మాత్రం తగ్గిస్తుంది. భారత్ ఫైబర్‌కు 50Mbps, డీఎల్ఎస్‌కు 10 Mbps డేటా అందిస్తుంది. హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. 300 GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌కు నెలకు రూ.749.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications