For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ATM ట్రాన్సాక్షన్స్ ఉచితం, షరతులు ఇవే!

|

బ్యాంకులు కస్టమర్లకు ప్రతి నెల కొన్ని ఉచిత ట్రాన్సాక్షన్స్ ఇస్తుంటాయి. నిర్ణీత పరిమితి దాటిన తర్వాత బ్యాంకులు ఆ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ కస్టమర్లు, బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రతినిధుల నుంచి ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని సవరించాలని డిమాండ్‌లు వినిపించాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏటీఎం ట్రాన్సాక్షన్స్, ఛార్జీలకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి నుంచి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ సంఖ్యను హేతుబద్దీకరించేందుకు, ఏటీఎం ఛార్జీల స్వరూపాన్ని, ఛార్జీలను పరిశీలించేందుకు ఆర్బీఐ జూన్ నెలలో కమిటీని ఏర్పాటు చేసిందని ఆర్బీఐ వార్షిక నివేదికలో తెలిపింది.

ఈ కార్లపై రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు భారీ డిస్కౌంట్!ఈ కార్లపై రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు భారీ డిస్కౌంట్!

ఆర్బీఐ స్పష్టత

ఆర్బీఐ స్పష్టత

ఈ క్రమంలో ఆర్బీఐ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి స్పష్టతను ఇచ్చింది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులు, డిస్ట్రిక్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లందరికీ ఆర్బీఐ మార్గదర్శకాలు వర్తిస్తాయి. ఆర్బీఐ ఆగస్ట్ 14వ తేదీన ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇది ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ కాదు...

ఇది ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ కాదు...

సాంకేతిక కారణాలరీత్యా లేదంటే ఏటీఎంలో డబ్బులు లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ రద్దయితే వాటిని ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల కిందకు లెక్కలోకి తీసుకోవద్దు.

టెక్నికల్ సమస్య...

టెక్నికల్ సమస్య...

హార్డ్ వేర్, సాఫ్టువేర్, కమ్యూనికేషన్స్ సమస్య కారణంగా ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయితే దాని కూడా బ్యాంకులు ఫ్రీ ఏటీఎం లావాదేవీ కింద పరిగణలోకి తీసుకోవద్దు.

పిన్ తప్పుగా ఎంటర్ చేస్తే...

పిన్ తప్పుగా ఎంటర్ చేస్తే...

పిన్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే దానిని ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ కింద లెక్కలోకి తీసుకోవద్దు. అంటే అలాంటి లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించబడవు.

నాన్ క్యాష్ విత్ డ్రా ట్రాన్సాక్షన్లు...

నాన్ క్యాష్ విత్ డ్రా ట్రాన్సాక్షన్లు...

బ్యాలెన్స్ విచారణ, చెక్ బుక్ రిక్వెస్ట్, పన్ను చెల్లింపు, ఫండ్ ట్రాన్సుఫర్ వంటి నాన్ క్యాష్ విత్‌డ్రా ట్రాన్సాక్షన్లు కూడా ఉచిత ఏటీఎం లావాదేవీల కిందకు రావు.

English summary

ఈ ATM ట్రాన్సాక్షన్స్ ఉచితం, షరతులు ఇవే! | Banks can't charge you for these transactions, Check details inside

Banks offer certain number of free transactions every month to their customers, beyond that threshold banks impose charges.
Story first published: Wednesday, September 18, 2019, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X