న్యూఢిల్లీ: ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును తగ్గించిన ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా రికరింగ్ డిపాజిట్ రేట్లలోను కస్టమర్లకు షాకిచ్చింది. వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం ఆగస్ట్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అంటే FDతో పాటు రికరింగ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి వడ్డీ తక్కువ కానుంది.

SBI రికరింగ్ డిపాజిట్స్
SBI రికరింగ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లు సాధారణ కస్టమర్లకు 6.25 నుంచి 6.70 శాతం మధ్య ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేట్లపై మరో 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది. రికరింగ్ డిపాజిట్ల మెచ్యూరిటీ పైన 12 నెలల నుంచి 120 నెలల వరకు ఉంటుంది. సంవత్సరం రికరింగ్ డిపాజిట్స్ పైన ఎస్బీఐ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది.

వడ్డీ రేటు ఇలా..
SBI ఇయర్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటును ఆగస్ట్ 1వ తేదీ నుంచి 6.8 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. నెలలో ఇలా తగ్గించడం రెండోసారి. 24-35 నెలల మధ్య రికరింగ్ డిపాజిట్స్ పైన 20 బేసిస్ పాయింట్లు తగ్గి, 6.5 శాతంగా ఉంది. 3-5 ఏళ్ల టర్మ్ అయితే 35 బేసిస్ పాయింట్లు తగ్గి 6.25 శాతంగా ఉంది. లాంగ్ టర్మ్ రికరింగ్ డిపాజిట్స్ పైన 6.25 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు అన్ని కాల పరిమితులపై 0.5 శాతం ఎక్కువగా వడ్డీ రేటు ఉంటుంది.

బల్క్ డిపాజిట్స్ పైన...
బ్యాంకు రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లను 10 నంచి 15 బేసిస్ పాయింట్ల మధ్య తగ్గించింది. రూ.2 కోట్లకు మించిన బల్క్ డిపాజిట్లను సవరించింది. ఇవి సోమవారం నుంచి అమలులోకి వస్తున్నాయి. సాధారణంగా లాంగర్ మెచ్యూరిటీ పీరియడ్స్ కోసం రిటైల్ డిపాజిట్స్ పైన ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కానీ ఇప్పుడు 35 బేసిస్ పాయింట్స్ తగ్గుతున్నాయి.

ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ ఇలా...
రూ.100తో మంత్లీ రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఇన్‌స్టాల్‌మెంట్ మిస్ అయితే పెనాల్టీ వేస్తారు. వరుసగా ఆరు ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టకుంటే అకౌంట్ క్లోజ్ చేస్తారు. రికరింగ్ డిపాజిట్స్ పైన ఎస్బీఐ రిమైండర్ పంపించదు. సాధారణంగా బ్యాంకులు 15 నెలల పైన ఉన్న రికరింగ్ డిపాజిట్స్ పైన ఎక్కువ వడ్డీ అందిస్తాయి. వడ్డీ రేట్లు ఓసారి ఫిక్స్ అయితే డిపాజిట్ కాలపరిమితి ముగిసే వరకు అలాగే ఉంటాయి. మార్పులు ఉండవు.

మంచి ఆప్షన్...
షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ గోల్స్ కోసం రికరింగ్ డిపాజిట్స్ చాలా మంచి ఆప్షన్. 12 నెలల నుంచి పదేళ్ల వరకు వరకు మీ పొదుపు ఖాతాతో పోలిస్తే ఆకర్షణీయ వడ్డీ రేటు పొందవచ్చు. దీని ద్వారా సేవింగ్స్ అలవాటును పెంపొందించవచ్చు. వివిధ బ్యాంకులు రికరింగ్ డిపాజిట్స్ వివిధ వడ్డీని చెల్లిస్తుంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications