ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై SBI వడ్డీ రేటు తగ్గింపు: FD రేట్లు ఇలా...

ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) పైన వడ్డీ రేటు తగ్గిస్తూ ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిర్ణయం తీసుకుంది. ఒక నెల రోజుల్లోనే రెండోసారి వడ్డీ రేట్లు తగ్గించింది. అన్ని కాలపరిమితిలపై FD రేట్లను 10 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. బల్క్ డిపాజిట్స్ పైన కూడ అన్ని కాలపరిమితులపై 30-70 బేసిస్ పాయింట్స్ తగ్గించింది.

ఆగస్ట్ 26 నుంచి.. అందుకే వడ్డీ రేట్ల తగ్గింపు

ఆగస్ట్ 26 నుంచి.. అందుకే వడ్డీ రేట్ల తగ్గింపు

తగ్గించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 26వ తేదీ (సోమవారం) నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. మిగులు ద్రవ్యం, వడ్డీ రేట్లు... ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లు తగ్గించడానికి కారణమని ఎస్బీఐ తెలిపింది. ఇంతకుముందు ఎస్బీఐ ఆగస్ట్ 1వ తేదీన ఎస్బీఐ రేట్లను సమీక్షించింది. ఈ నెలలో ఇది రెండోసారి.

110 పాయింట్లు తగ్గిన రెపో..

110 పాయింట్లు తగ్గిన రెపో..

ఆర్బీఐ ఈ నెలలో రెపో రేటును 35 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఈ క్యాలెండర్ ఇయర్లో ఇది వరుసగా నాలుగోసారి. ఈ ఏడాది తగ్గిన రెపో రేటు 110 బేసిస్ పాయింట్లు. ఆర్బీఐ తగ్గించిన రెపో రేటును కస్టమర్లకు బదలీ చేయాలని ఆర్బీఐ సూచిస్తోంది.

రూ.2 కోట్లలోపు కొత్త FD వడ్డీ రేట్లు ఇలా...

రూ.2 కోట్లలోపు కొత్త FD వడ్డీ రేట్లు ఇలా...

- రూ.2 కోట్ల లోపు కలిగిన FDలపై ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లు ఇలా ఉంటాయి...

- 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 5% అందిస్తున్న వడ్డీని 4.50% తగ్గించింది.

- 46 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50% ఇస్తుంది.

- 180 రోజుల నుంచి 210 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 6.25% శాతం నుంచి 6% శాతానికి తగ్గించింది.

- 211 రోజుల నుంచి ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 6.25% నుంచి 6% శాతానికి తగ్గించింది.

రూ.2 కోట్లలోపు కొత్త FD వడ్డీ రేట్లు ఇలా... ఏడాదికి మించి..

రూ.2 కోట్లలోపు కొత్త FD వడ్డీ రేట్లు ఇలా... ఏడాదికి మించి..

- ఏడాది నుంచి రెండేళ్ల వరకు రూ.2 కోట్ల లోపు మొత్తంపై 6.70% వడ్డీని ఇస్తుంది.

- రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు రూ.2 కోట్ల లోపు మొత్తంపై 6.50% వడ్డీని ఇస్తుంది.

- మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు రూ.2 కోట్ల లోపు మొత్తంపై 625% వడ్డీని ఇస్తుంది.

- ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు రూ.2 కోట్ల లోపు మొత్తంపై 6.25% వడ్డీని ఇస్తుంది.

సీనియర్ సిటిజన్స్‌కు రూ.2 కోట్లలోపు కొత్త FD వడ్డీ రేట్లు...

సీనియర్ సిటిజన్స్‌కు రూ.2 కోట్లలోపు కొత్త FD వడ్డీ రేట్లు...

- సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించింది.

- 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 5.00% తగ్గించింది.

- 46 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 6.00% ఇస్తుంది.

- 180 రోజుల నుంచి 210 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 6.50%కు తగ్గించింది.

- 211 రోజుల నుంచి ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 6.50%కు తగ్గించింది.

ఏడాదికి మించి సీనియర్ సిటిజన్లకు రూ.2 కోట్లలోపు కొత్త FD వడ్డీ రేట్లు..

ఏడాదికి మించి సీనియర్ సిటిజన్లకు రూ.2 కోట్లలోపు కొత్త FD వడ్డీ రేట్లు..

- ఏడాది నుంచి రెండేళ్ల వరకు రూ.2 కోట్ల లోపు మొత్తంపై సీనియర్ సిటిజన్లకు 7.20% వడ్డీని ఇస్తుంది.

- రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు రూ.2 కోట్ల లోపు మొత్తంపై సీనియర్ సిటిజన్లకు 7.00% వడ్డీని ఇస్తుంది.

- మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు రూ.2 కోట్ల లోపు మొత్తంపై సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని ఇస్తుంది.

- ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు రూ.2 కోట్ల లోపు మొత్తంపై సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+