కేవలం మెట్రో నగరాల్లోనే కాదు.. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆర్థిక లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆధారంగా మారింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ప్రజలు, బ్యాంకు అధికారుల సమయాన్ని ఆదా చేసింది. ముఖ్యంగా కస్టమర్ల బ్యాంకింగ్ అవసరాలను ఎంతో సులభతరం చేసింది. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్లు తమ ఫండ్ ట్రాన్సుఫర్స్ కోసం బ్యాంకులకు వెళ్లడం లేదు! బిల్ పేమెంట్స్, ఫిక్స్‌డ్ లేదా కరెంట్ అకౌంట్ కోసం లేదా ఇతర అవసరాల కోసం తమ హోమ్ బ్రాంచీకి వెళ్లడం లేదు. వీటిని కస్టమర్లు ఎక్కడి నుండి అయినా పూర్తి చేయవచ్చు. ఆన్ లైన్‌లో ఇవి పూర్తి చేయడం కేవలం నిమిషాల పని. డిజిటల్ ప్రవేశం, స్మార్ట్ ఫోన్ల విస్తృత ఉపయోగం ద్వారా అన్ని బ్యాంకులు కూడా నెట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి.

నెట్ బ్యాకింగ్ సేవల ప్రయోజనం
బ్యాంకులు సాధారణంగా ఉదయం గం.9 లేదా గం.10 నుంచి సాయంత్రం నాలుగైదు గంటల వరకు మాత్రమే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. 24x7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే, దగ్గరలోని బ్యాంకులను విజిట్ చేసే అవసరం లేకుండా సమయాన్ని ఆదా చేస్తోంది. ఏ ఫైనాన్షియల్ ఉత్పత్తులను అయినా సులభంగా కొనుగోలు చేయవచ్చు. మ్యుచువల్ ఫండ్స్ ఐనా, ఇన్సురెన్స్ ఐనా.. మరే ఇతర ఫైనాన్షియల్ ఉత్పత్తులను ఐనా పర్చేజ్ చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకు నచ్చిన ఇతర ఆఫర్లు ఏమైనా ఉంటే తెలుసుకునే సౌకర్యం ఉంది. బ్యాంక్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా కూడా చేయవచ్చు.

ఆన్‌లైన్ మోసాలకు SBI 'లాక్' చెక్
అదే సమయంలో నెట్ బ్యాంకింగ్ రిస్క్‌లెస్ అని చెప్పలేం. అప్రమత్తంగా ఉంటే తప్ప ఇది రిస్క్‌తో కూడుకున్నదే. సైబర్ క్రిమినల్స్ ఎప్పటికి అప్పుడు తెలివి మీరుతున్నారు. కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని, ఆన్ లైన్ మోసాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లు తమ నెట్ బ్యాంకింగ్ యాక్సెస్‌ను లాక్ చేయగల ఫీచర్‌ను ఇంట్రొడ్యూస్ చేసింది.

SBI నెట్ బ్యాంకింగ్‌ను లాక్ -అన్‌లాక్ ఎలా?
- కస్టమర్లు తమ SBI నెట్ బ్యాంకింగ్‌ను లాకింగ్ లేదా అన్-లాకింగ్ చేసుకోవచ్చు.
- https://www.onlinesbi.com/ వెబ్ సైట్‌కు వెళ్లాలి.
- PERSONAL BANKINGలోని Lock & Unlock user ను ఎంచుకోవాలి.
- అప్పుడు ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- Select Lock or Unlock User Access ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీ వివరాలు ఫిల్ చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, అకౌంట్ నెంబర్, కాప్చా అడుగుతుంది.
- సబ్‌మిట్ చేసిన అనంతరం కొత్త పాపప్ వస్తుంది.
- అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్
- మీ ఖాతాలోకి అనధికార యాక్సెస్ లేదా ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లుగా కనిపిస్తే మీరు ఇంటర్నెట్ యాక్సెస్‌ను లాక్ చేసుకోవచ్చు.
- యూజర్ లేదా కస్టమర్ సెట్ చేసిన షెడ్యూల్డ్ ట్రాన్సాక్షన్స్, స్టాండింగ్ ట్రాన్సాక్షన్లు ఏమైనా ఉంటే యాక్టివ్‌గానే ఉంటాయి. యథావిథిగా కొనసాగుతాయి. ఈ ప్రాసెస్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
- కస్టమర్ OK పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, ఓకే చేస్తే ఇంటర్నెట్ యాక్సెస్ లాక్ చేయబడుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్ చేయబడుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications