ఇవి ఆరోగ్య బీమా ప్లాన్లు.. ఎంచుకోండి ఏది మీకు సూటవుతుందో..

పిండి కొద్ది రొట్టె అంటారు. ఎవరి ఆర్ధిక పరిస్థితిని బట్టి వారు ఖర్చులు చేస్తుంటారు. అయితే ఈ రోజుల్లో ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. వీటిని బట్టే అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. కొంత మందికి తిండి ఎక్కువై.. కొంత మందికి తక్కువై వ్యాధుల బారిన పడుతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రిలో చేరితే ఎంత ఖర్చవుతుందో ఊహించడం కష్టమే. ప్రభుత్వాలు పలు ఆరోగ్య పథకాల ద్వారా చికిత్సలు పొందే అవకాశం కల్పిస్తున్న దానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటప్పుడు కొన్ని మొండి వ్యాధుల చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుంటున్న వారు కూడా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదనుకుంటే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాల్సింది. మన, మన కుటుంబ అవసరాలను బట్టి ఈ పాలసీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ఎలాంటి పాలసీలు అందుబాటులో ఉన్నాయంటే...

వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తిగత ఆరోగ్య బీమా

* ఈ బీమా వ్యక్తులకు సంబంధించినది. ఒక్కొక్కరికి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులను ఈ బీమా ద్వారా కవరేజీ పొందవచ్చు.

* వ్యక్తుల వయసు, అలవాట్లు, ఉండే ప్రదేశం, చేస్తున్న ఉద్యోగం వంటి అంశాల ఆధారంగా ఈ బీమా పాలసీ ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

* చిన్న వయసులో ఉన్నవారు తక్కువ ప్రీమియం తో ఎక్కువ సమ్ అష్యురెన్సు పొందవచ్చు. వయసు పెరిగే కొద్దీ బీమా ప్రీమియం పెరుగుతుంది.

వ్యక్తిగత ప్రమాద బీమా

వ్యక్తిగత ప్రమాద బీమా

*ఈ బీమా ద్వారా ప్రమాదం జరిగి ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది.

* ఎంత మొత్తానికి బీమాను తీసుకుంటారన్న దానిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

* ప్రమాదం జరిగినప్పుడు ఎముకలు విరగవచ్చు లేదా ఏదైనా భాగంలో ఆపరేషన్ అవసరం ఉండవచ్చు. అప్పుడు బీమా ఆడుకుంటుంది.

టర్మ్ ఇన్సూరెన్సు

టర్మ్ ఇన్సూరెన్సు

* టర్మ్ ఇన్సూరెన్సు కింద చెల్లించే బీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది. కానీ పరిహారం ఎక్కువ లభిస్తుంది.

* బీమా తీసుకున్న వ్యక్తి మరణించి నప్పుడు మాత్రమే బీమా పరిహారం లభిస్తుంది. జీవించి ఉంటే ఎలాంటి పరిహారం లభించదు.

కుటుంబ ఆరోగ్య బీమా

కుటుంబ ఆరోగ్య బీమా

*ఈ పాలసీ కింద కుటుంబ సభ్యులందరికి బీమా తీసుకోవచ్చు.

* సింగిల్ కవర్ కింద పలు వ్యాధులకు బీమా రక్షణను పొందవచ్చు.

* ఈ పాలసీ తీసుకునే వారందరికీ కలిపి సమ్ అస్యూరెన్సు ఉంటుంది. ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులెవరైనా పొందవచ్చు.

సీనియర్ సిటిజెన్ ఆరోగ్య బీమా

సీనియర్ సిటిజెన్ ఆరోగ్య బీమా

* ఈ బీమా పథకాలను సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీమా కంపెనీలు అందిస్తున్నాయి.

* 60 ఏళ్ళు దాటినా వారు ఈ బీమా పాలసీలను తీసుకోవచ్చు. అయితే వీరు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది.

* వయసు పెరిగే కొద్దీ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వారు క్లెయిమ్ చేసుకునే మొత్తం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

సర్జరీ, తీవ్ర అనారోగ్య బీమా

సర్జరీ, తీవ్ర అనారోగ్య బీమా

* తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ బీమాలను తీసుకోవచ్చు.

* కేన్సర్, కిడ్నీ విఫలమైన వారు, హృద్రోగులు ఇలాంటి బీమా పాలసీలను తీసుకోవచ్చు. వీటికి చెల్లించే బీమా ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది.

* ఇలాంటి వ్యాధుల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు బీమా ప్రీమియం ను కంపెనీలు వసూలు చేస్తుంటాయి.

ప్రసూతి ఆరోగ్య బీమా

ప్రసూతి ఆరోగ్య బీమా

* ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఈ బీమాను తీసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీకి ముందు డెలివరీ తర్వాత అయ్యే ఖర్చులు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ బీమా అవసరం ఏర్పడుతోంది.

* సాధారణ డెలివరీలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఆపరేషన్ తప్పనిసరిగా మారింది. దీనికి ఒక్కో ఆస్పత్రి ఒక్కో విధంగా బిల్లు వేస్తోంది.

* కొన్ని సందర్భాల్లో పుట్టిన బిడ్డ అనారోగ్యం పాలుకావచ్చు. అలాంటి సందర్భంలో ఆ బిడ్డ రక్షణ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక వేళ డెలివరీకి ముందే బీమా తీసుకొని ఉంటే ఇలాంటి ఊహించని ఖర్చుల భారాన్ని బీమా కంపెనీ ద్వారా కవరేజి పొందడానికి అవకాశం ఉంటుంది.

యూనిట్ లింక్డ్ ఆరోగ్య బీమా

యూనిట్ లింక్డ్ ఆరోగ్య బీమా

* ఇలాంటి బీమా పథకాల ద్వారా అటు బీమా ప్రయోజనం ఇటు పొదుపునకు అవకాశం ఉంటుంది.

వ్యక్తుల అవసరాలు మారిపోతున్న నేపథ్యంలో బీమా కంపెనీలు అందుకు అనుగుణంగా పాలసీలను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలోని ఫీచర్లు, నియమ నిబందనలు సరిగ్గా చూసుకొని పాలసీని ఎంచుకోవడం ద్వారా అనారోగ్యం పాలైన సందర్భంలో బీమా రక్షణను పొందడానికి అవకాశం ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+