సరికొత్త SBI వెల్త్: అర్హతలు, ప్రయోజనాలు తెలుసుకోండి

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రీమియం బ్యాంకింగ్ సేవలను లాంచ్ చేసింది. అయితే ఇది కొద్దిమంది కస్టమర్లకు మాత్రమే. తమ ఖాతాదారులకు మంచి బెనిఫిట్స్‌తో ఎస్బీఐ SBI వెల్త్‌ను తీసుకు వచ్చింది. ఉదాహరణకు అన్ని బ్యాంకింగ్ అవసరాలకు రిలేషన్‌షిప్ మేనేజర్‌ను నియమిస్తారు. అలాగే, డోర్‌స్టెప్ బ్యాంకింగ్‌లో భాగంగా డాక్యుమెంట్స్ పికప్ మరియు డెలివరీ కోసం కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అందుబాటులో ఉంటారు.

SBI వెల్త్ అకౌంట్ హోల్డర్‌కు ప్రయోజనాలు

SBI వెల్త్ అకౌంట్ హోల్డర్‌కు ప్రయోజనాలు

SBI వెల్త్ అకౌంట్ హోల్డర్‌కు సిగ్నేచర్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల్ని లైఫ్ స్టైల్ బెనిఫిట్స్‌తో ఆఫర్ చేస్తుంది. అలాగే ఖాతాదారులకు వేగవంతమైన రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. SBI వెల్త్ రిలేషన్‌షిప్‌లో ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌తో సహా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సరికొత్త మెరుగైన సేవింగ్స్ అకౌంట్, ఎస్బీఐ వెల్త్ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్ (ఛార్జీలు లేవు), లైఫ్ స్టైల్ ప్రివిలేజెస్, ప్రాధాన్యతపై లోన్ అప్రూవల్స్, అదనపు ప్రివిలేజీలతో వీసా సిగ్నేచర్ కార్డులు, లాభదాయకమైన పెట్టుబడి ఎంపికలతో సహా విస్తృత రివార్డింగ్ ప్రోడక్ట్స్, సేవలు ఉంటాయి.

ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ ద్వారా ఆన్‌లైన్ సేవలు సులభతరం

ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ ద్వారా ఆన్‌లైన్ సేవలు సులభతరం

ఓపెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా పంపిణీ చేయబడిన వివిధ అసెట్స్ క్లాసెస్‌ల పెట్టుబడి ఉత్పత్తులను ఎస్బీఐ అందిస్తుంది. ఒకరు తమ భాగస్వాముల ద్వారా డైరెక్ట్ ఈక్విటీ, స్థిర ఆదాయ సేవలలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఎవరైనా తమ ప్రొటక్షన్ అవసరాల కోసం జీవిత బీమా, సాధారణ బీమాను తీసుకోవచ్చు. ముఖ్యమంగా ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్ సేవలు సులభతరం చేస్తుంది.

SBI Wealth అర్హత

SBI Wealth అర్హత

ఎస్బీఐ వెల్త్‌కు ఎగ్జిస్టింగ్ టు బ్యాంక్ (ETB) క్లయింట్స్, న్యూ టు బ్యాంక్ (NTB) క్లయింట్స్‌కు అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి.

ETB క్లయింట్ అయితే

ETB క్లయింట్ అయితే

- ETB క్లయింట్ అయితే టోటల్ రిలేషన్‌షిప్ వ్యాల్యూ (TRV) రూ.30 లక్షలుగా ఉండాలి. (ఎస్బీఐ ద్వారా మ్యుచువల్ ఫండ్స్, డిమాట్ హోల్డింగ్స్‌లలో మొత్తం డిపాజిట్స్, పెట్టుబడులు)

- SBI అకౌంట్‌లోకి నెట్ శాలరీ క్రెడిట్ రూ.2 లక్షలు అంతకుమించి.

- SBI హోమ్ లోన్ రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ.

NTB క్లయింట్ అయితే

NTB క్లయింట్ అయితే

- ప్రారంభ డిపాజిట్/పెట్టుబడి రూ.10 లక్షలు.

- 12 నెలల కాలంలో టోటల్ రిలేషన్‌షిప్ వ్యాల్యూ రూ.30 లక్షలకు పెంచాలి.

- రూ.2 లక్షలు లేదా అంతకుమించి నెట్ శాలరీ క్రెడిట్‌తో SBIలో ఖాతా తెరవడం.

- కొత్త ఎస్బీఐ హోమ్ లోన్ రూ.1 కోటి అంతకుమించి.

మరిన్ని సేవలు...

మరిన్ని సేవలు...

ఎక్కువగా ప్రయాణం చేసేవారి డిజిటల్ సౌలభ్యం కోసం టైమ్ పొడిగింపుతో e-Wealth Centre‌ ద్వారా బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ లావాదేవీల కోసం వాయిస్/వీడియో కాల్ ద్వారా రిలేషన్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడి పూర్తి చేసుకోవచ్చు. వీరికి కొత్త పోర్టల్/మొబైల్ యాప్ తీసుకు వస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+