ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ రకాల సేవలు అందిస్తోంది. నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మనీ ట్రాన్సుఫర్, చెక్‌బుక్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం.... ఇలా వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఏటీఎంల నుంచి క్యాష్ తీసుకునే వెసులుబాటు, క్యాష్ వేసే అవకాశాలు కూడా కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 50,000కు పైగా ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. తమ బ్యాంకు కస్టమర్లక్ ఈ సేవలు ఉచితం.

విత్ డ్రా
ఎస్బీఐ కస్టమర్లు కాకుండా Maestro, Master Card, Cirrus, VISA, VISA Electronలతో ఇతర బ్యాంకులు జారీ చేసే కార్డ్ హోల్డర్స్ కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఇంటర్నేషనల్ కార్డ్ హోల్డర్స్ కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. SBI క్లాసిక్ డెబిట్ కార్డు హోల్డర్ రోజుకు రూ.20,000 విత్ డ్రా చేసుకోవచ్చు. రోజుకు మినిమం రూ.100 విత్ డ్రా చేసుకోవచ్చు.

రూ.10వేల చొప్పున విత్ డ్రా
SBI ఏటీఎం నుంచి కస్టమర్లు రోజుకు రూ.20,000 విత్ డ్రా చేసుకోవచ్చు. అది కూడా లావాదేవీలకు రూ.10వేల చొప్పున తీసుకోవాలి. అంతకుముందు విత్ డ్రా అమౌంట్ రూ.40,000గా ఉండేది. ఆ తర్వాత దీనిని రూ.20వేలకు తగ్గించింది. కస్టమర్లు రోజుకు పాయింట్ ఆప్ సేల్స్ (POS), ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ పైన కార్డు ద్వారా రూ.50,000 వరకు ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. కనీస పరిమితి లేదు. కొన్ని రకాల కార్డుల ద్వారా ఏటీఎం నుంచి రోజుకు రూ.20,000 కన్నా ఎక్కువ మొత్తాన్ని కూడా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ సేవలు కూడా పొందవచ్చు
క్యాష్ విత్ డ్రా మాత్రమే కాకుండా ఏటీఏం నుంచి ఇతర సేవలు కూడా పొందువచ్చు. కస్టమర్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ పొందవచ్చు. క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయవచ్చు. ఒక ఎస్బీఐ డెబిట్ కార్డు నుంచి మరో కార్డుకు డబ్బులు పంపించుకోవచ్చు. చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. బిల్లులు చెల్లించవచ్చు. మొబైల్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. IMPS సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

లిమిట్ దాటితే ...
ఎస్బీఐ కస్టమర్లు తమ ఏటీఎం కార్డులను ఇతర బ్యాంకుల్లో ఉపయోగించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం ఇండివిడ్యువల్స్‌కు నెలకు మెట్రో నగరాల్లో మూడు ట్రాన్సాక్షన్లు, ఇతర నగరాల్లో 5 ట్రాన్సాక్షన్లు ఉచితం. ఈ పరిమితిని మించిన అనంతరం SBI ట్యాక్స్ కలిపి కొంత మొత్తం వసూలు చేస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications