సీనియర్ సిటిజన్లు మీకు ఈ పెన్షన్ ప్లాన్ గురించి తెలుసా? ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) అనే పెన్షన్ ప్లాన్ మీ లాంటి వారి కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకాన్ని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) నిర్వహిస్తోంది. దీని ద్వారా హామీపూర్వక రిటర్న్ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ ను పొందవచ్చు. ఇది ఎంతో ప్రయోజనాన్ని కల్పించే పింఛన్ పథకంగా చెప్పవచ్చు.

ఎవరు ఈ పథకంలో చేరవచ్చంటే...
- కనీస వయసు 60 ఏళ్ళు నిండిన స్త్రీ, పురుషులు ఏ ప్లాన్ ను కొనుగోలు చేయవచ్చు.
- గరిష్ట వయసు విషయంలో ఎలాంటి పరిమితి లేదు
- పాలసీ కాలపరిమితి 10 సంవత్సరాలు. పదేళ్ల పాటు పెన్షన్ ను చెల్లిస్తారు.
కాలపరిమితి
* 2020 మార్చి 31 వరకు ఈ పథకంలో చేరవచ్చు.
* ఎల్ఐసి కార్యాలయాన్ని సంప్రదించి లేదా ఎల్ఐసి వెబ్ సైట్ లోకి లాగ్ఇన్ అయి ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
* పాలసీ నియమ నిభందనలు నచ్చనట్టయితే పాలసీ కొనుగోలు చేసిన 15 రోజుల తర్వాత వెనక్కి ఇవ్వవచ్చు. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తే 30 రోజుల గడువు ఉంటుంది.

ఎంత మొత్తం?
* ఈ పథకంలో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్య భర్తలు వేర్వేరుగా ఇంత మొత్తానికి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
* ఇందులో నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ పొందాలనుకుంటే కనీసం రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
* ఈ స్కీం లో కనీస పెన్షన్ నెలకు రూ . 1,000. నెలవారీ పెన్షన్ రూ. 10,000 వరకు కూడా ఉంటుంది. ఇది పాలసీని కొనుగోలు చేసిన మొత్తం పై ఆధారపడి ఉంటుంది.
* నెలవారీగా రూ.1,000 పెన్షన్ పొందాలనుకుంటే కనీస పెట్టుబడి మొత్తం రూ.1,50,000 ఉండాలి. గరిష్టంగా వచ్చే పెన్షన్ నెలవారీగా రూ.10,000 అందుకోవాలంటే పెట్టుబడి రూ. 15,00,000 ఉండాలి.
* వార్షికంగా రూ. 12,000 కనీస పెన్షన్ అందుకోవాలంటే రూ. 1,44,578, గరిష్టంగా రూ. 1,20,000 అందుకోవాలంటే రూ. 14,45,784 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
* మూడు నెలలకు పెన్షన్ రూ. 3,000, ఆరు నెలలకు రూ. 6,000 ఉంటుంది.

ఎంత రిటర్న్ వస్తుంది?
* పీఎంవీవీవై కింద 8 శాతం రిటర్న్ అందడానికి అవకాశం ఉంటుంది. నెలవారీ పెన్షన్ స్కీం కు దరఖాస్తు చేరితే 8 శాతం వార్షిక రిటర్న్ అందుతుంది.
* పాలసీ కొనుగోలు చేసిన పదేళ్లకు ఎంత ప్రీమియంకు కొనుగోలు చేసామో ఆ మొత్తం చెల్లిస్తారు. అంతే కాకుండా పెన్షన్ చివరి వాయిదాను పొందుతారు.
* ఒకవేళ పాలసీ దారు పదేళ్ల లోపు మరణిస్తే పాలసీ కొనుగోలు మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు.
* ఈ పెన్షన్ ప్లాన్ లో ఎలాంటి వస్తుసేవల పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ ఉండదు.
* ఈ ప్లాన్ ద్వారా వచ్చే రిటర్న్ పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రుణం పొందవచ్చు
* ఈ ప్లాన్ ను కొనుగోలు చేసిన వారు అవసరమైతే రుణాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు మూడేళ్ళ కాలపరిమితి దాటాలి. పాలసీ కొనుగోలు అసలు మొత్తంలో 75 శాతాన్ని రుణం గా పొందవచ్చు.
* తీవ్రమైన అనారోగ్యానికి గురై పాలసీని సరెండర్ చేస్తే పాలసీ కొనుగోలు కోసం చెల్లించిన మొత్తంలో 98 శాతం వెనక్కి తీసుకోవచ్చు.
* మరింత సమాచారం కోసం ఎల్ఐసి వెబ్ సైట్ లేదా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications