ఈ రోజుల్లో హ్యాకర్స్ తెలివిగా ఇతరుల అకౌంట్లలోని డబ్బులు కొట్టేస్తున్నారు. ఎన్ని కొత్త సాంకేతిక పద్ధతులు వచ్చినా, అంతకుమించి తెలివిమీరుతున్నారు హ్యాకర్స్. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఫ్రాడస్టర్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నాయి. ఏటీఎం, ఆన్‌లైన్ తదితర మార్గాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో HDFC తమ కస్టమర్లకు పలు జాగ్రత్తలు సూచించింది.

పిన్ నెంబర్ అలా రాయకండి
మీరు డెబిట్ కార్డు లేదా ఇతర కార్డులు కలిగి ఉంటే, తరుచూ ఏటీఎం సెంటర్‌కు వెళ్తుంటే, HDFC బ్యాంక్ సూచనలు, జాగ్రత్తలు పాటించండి. మీరు చేసే చిన్న పొరపాటు ఫ్రాడస్టర్స్ మీ డబ్బు దొంగిలించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ.. ఇలా చేయకండి అంటూ పలు సూచనలు చేసింది. ఏటీఎం యూజర్లకు ఈ బ్యాంకు షేర్ చేసిన టిప్స్ తెలుసుకుందాం....
- ఎప్పుడు కూడా మీ పిన్ నెంబర్ మీరు గుర్తుంచుకోండి. మీ సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ను ఎక్కడ కూడా రాయవద్దు. ముఖ్యంగా మీ కార్డ్ పైన అసలు రాయకూడదు. అలాగే, మీ మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ ఎవరితోను షేర్ చేసుకోవద్దు. అలాగే ఎక్కడా స్టోర్ చేయవద్దు. మొబైల్ ఫోన్‌లో కూడా స్టోర్ చేసుకోవద్దు.

బ్యాంక్ ఉద్యోగులకు కూడా పిన్ నెంబర్ ఇవ్వకండి
- బ్యాంక్ ఉద్యోగులతో సహా, ఎవరికి కూడా మీ పిన్ నెంబర్ ఇవ్వవద్దు. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడం మంచిది. తరుచూ మీ పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. అప్పుడప్పుడు మీ పిన్ నెంబర్ మార్చుకోండి.

పిన్ నెంబర్ టైప్ చేసే సమయంలో...
- మీరు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో ఏటీఎం మిషన్‌కు చాలా దగ్గరగా ఉండేలా చూసుకోండి. అలాగే, మీరు కీ ప్యాడ్ పైన పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు.. మీ చేతులు, శరీరం.. కీ ప్యాడ్‌ను కవర్ చేసేలా... అంటే ఎవరూ చూడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

ఏటీఎం కార్డు ఇతరుల చేతికి ఇవ్వకండి
- మీ ఏటీఎం కార్డును లేదా ట్రాన్సాక్షన్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులను ఉపయోగించుకోవద్దు.
- ఏటీఎం మిషన్ సమీపంలో లేదా ఏటీఎం సెంటర్‌లో ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ట్రాన్సాక్షన్ చేయవద్దు.

క్యాన్సల్ బటన్ పైన క్లిక్ చేయండి
- ఏటీఎంను ఉపయోగించిన తర్వాత.. ఏటీఎం రూం నుంచి బయటకు వెళ్లేటప్పుడు Cancel బటన్‌పైన కచ్చితంగా క్లిక్ చేయండి. ఆ తర్వాత welcome స్క్రీన్ కనిపించే వరకు వేచి చూడండి. మీ కార్డును మరిచిపోవద్దు. అలాగే స్లిప్ వస్తే దానిని తప్పకుండా తీసుకు వెళ్లండి. ఆ స్లిప్‌ను ముక్కలుగా చించివేయండి. అంతేకానీ, వచ్చిన స్లిప్‌ను అలాగే ఏటీఎం రూంలోని డస్ట్ బిన్‌లో వేయడం మంచిది కాదు.

ఏటీఎం కార్డు పోతే వెంటనే తెలియజేయండి
- మీ ఏటీఎం కార్డు ఎక్కడైనా పోయినా లేదా దొంగిలించిబడినా వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేయండి. సమీపంలోని బ్యాంకుకు వెళ్లి లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

మొబైల్ ద్వారా అలర్ట్ మెసేజ్ పొందండి
- మీరు డిపాజిట్ చేసిన మొత్తం క్రెడిట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. మీ అకౌంట్‌లో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేయండి.
- ఎప్పటికప్పుడు మీ ట్రాన్సాక్షన్స్ అలర్ట్ మెసేజ్‌ల పొందేందుకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ను బ్యాంక్‌కు సమర్పించండి.

వెంటనే బ్యాంకుకు ఫోన్ చేయండి
- మీ కార్డు ఏటీఎం మిషన్‌లో స్టక్ అయినా లేదా ట్రాన్సాక్షన్ సమయంలో మీ డబ్బు రాకపోయినా వెంటనే బ్యాంకుకు ఫోన్ చేయండి.
- ఏటీఎం సెంటర్లో ఏటీఎం/డెబిట్/క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ విషయంలో ఫిర్యాదులు ఉంటే సాధ్యమైనంత త్వరగా బ్యాంకుకు తెలియజేయండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications