న్యూఢిల్లీ: పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందించే స్కీంలలో నేషనల్ పెన్షన్ స్కీం (NPS) ఒకటి. రెండేళ్ల కిందట పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Pension Fund Regulatory and Development Authority-PFRDA) వయస్సు పరిమితిని పెంచింది. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్ల తర్వాత NPSలో చేరినవారు 70ఏళ్ల వరకు కొనసాగవచ్చు.

పెన్షన్ ఇలా..
SBI పెన్షన్ ఫండ్ NPS క్యాలిక్యులేషన్ ప్రకారం 65 ఏళ్లలో స్కీంలో చేరిన వారు నెలకు రూ.4,924 పెన్షన్ పొందవచ్చు. 70 ఏళ్ల వరకు స్కీంను కొనసాగించాలి. నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేయాలి. 70 ఏళ్ల తర్వాత వారికి రూ.4,924 పెన్షన్ వస్తుంది. ఇక్కడ రాబడిని ఎనిమిది శాతంగా అంచనా వేశారు. దీనికంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రూ.4వేలు పొందవచ్చు. నెలకు రూ.5వేలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రూ.2వేలు పెన్షన్ పొందవచ్చు.

పేటీఎం మనీ ద్వారా NPSలో ఇన్వెస్ట్
నేషనల్ పెన్షన్ స్కీం (NPS) చెల్లింపులకు పేటీఎం మనీ యాప్‌కు అప్రూవల్ వచ్చింది. ఈ మేరకు బుధవారం నాడు పేటీఎం యాజమాన్యం వెల్లడించింది. తమ ప్లాట్‌ఫాం నుంచి NPSలో ఇన్వెస్ట్ చేసేందుకు PFRDA నుంచి అనుమతి లభించిందని పేర్కొన్నారు. పేటీఎం మనీలో నమోదైన వారు NPSలో నిమిషాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చునని చెప్పారు. NPS పెట్టుబడిని పేపర్‌లెస్‌గా పేటీఎం మనీ చేస్తోంది. ఇది డిజిటల్ టు డిజిటల్. స్టాక్ బ్రోకింగ్ సర్వీసుల కోసం తమకు సెబి నుంచి అనుమతులు వచ్చాయని కూడా ఇటీవల పేటీఎం వెల్లడించింది. గత నెల ఇండియా వ్యాప్తంగా 40 అసెట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీల మ్యుచువల్ ఫండ్స్ స్కీంలు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పేటీఎం మనీ యాప్ ద్వారా NPS స్కీంలో నిమిషాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

మేజర్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్
మేజర్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్... ఎల్ఐసీ పెన్షన్ ఫండ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్, రిలయన్స్ కేపిటల్ పెన్షన్ ఫండ్, డీఎస్పీ బ్లాక్‌రాక్, రిలయన్స్ కేపిటల్ పెన్షన్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్స్ మేనేజ్‌మెంట్, కొటక్ మహింద్రా పెన్షన్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ పెన్షన్ వంటివి పేటీఎం మనీలో అందుబాటులో ఉన్నాయి.

పేటీఎం మనీ ద్వారా NPSలో ఇన్వెస్ట్ ఎలా చేయాలి?
NPSల పెట్టుబడి పెడితే 12 అంకెల యూనిక్ నెంబర్ ఇస్తారు. దీనిని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (PRAN)గా పిలుస్తారు. టయర్ 1, టయర్ 2 అకౌంట్స్ ఉంటాయి. మొదటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ అయ్యేదాకా మీరు దానిని విత్ డ్రా చేయలేరు. టయర్ 1 అకౌంట్‌కు ఐటీ చట్టం సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. టయర్ 2 స్వచ్చంధంగా ఓపెన్ చేసే అకౌంట్. ఇందులో రిటైర్మెంట్‌కు ముందే తమ అమౌంట్ విత్ డ్రా చేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications