PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు.. ఇవీ
దేశంలోని అర్హులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) కింద ఏటా రూ.6వేల సాయం అందించాలని రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు, జీఎస్టీ పరిధిలోకి రాని వ్యాపారులకు పింఛన్ పథకం అమలు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. పాడి పశువులకు రోగాలు కేంద్రం ఖర్చుతో వ్యాక్సిన్లు వేయనున్నారు. ఇప్పటి వరకు రెండు హెక్టార్ల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకే పీఎం కిసాన్ వర్తింప చేస్తున్నారు. ఇక మీదట అందరికీ దీని ప్రయోజనాన్ని వర్తింపచేయనున్నారు.

రూ.2వేల చొప్పున మూడు విడతల్లో
ఇప్పటి వరకు 2 హెక్టార్ల లోపు ఉన్న రైతులకే పీఎం కిసాన్ వర్తింప చేశారు. దీని ద్వారా 12.50 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. ఇక నుంచి అందరికీ వర్తింపచేయడంతో 14.50 కోట్ల మందికి ఈ లబ్ధి పెరగనుంది. వ్యవసాయం చేసే అందరికీ రూ.6వేలు ఇస్తారు. దీనిని రూ.2వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తారు. దీంతో పీఎం కిసాన్‌కు ప్రభుత్వం చేసే ఖర్చు రూ.87 వేల కోట్లకు చేరుకుంది. దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

రైతులకు ప్రయోజనాలు
ఈ పథకంలో కొత్తగా చేరే రైతులకు పాత వాటిని (తొలి విడత) చెల్లించరు. ఈ పథకంలో చేరినప్పటి నుంచి మాత్రమే చెల్లిస్తారు. చిన్న, సన్నకారు రైతులకు అరవై ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పింఛన్ అందించేందుకు వీలుగా పీఎం కిసాన్ యోజన తీసుకువస్తున్నారు. దీనికింద 18 నుంచి 40 ఏళ్లలోపు రైతులు చేరవచ్చు. ఇందుకు వయస్సును బట్టి రోజుకు రూ.2 నుంచి రూ.7 వరకు చెల్లించవలసి ఉంటుంది. దీనిని కేంద్రమే చెల్లిస్తుంది. వీరికి 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత నెలకు రూ.3వేలు వస్తుంది. ఒకవేళ రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 50 శాతం వస్తుంది. దీని వల్ల కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. దీని వల్ల మొదటి మూడేళ్లలో 5 కోట్ల మంచి రైతులకు లబ్ధి చేకూరుతంది.
కాగా, జీఎస్టీ పరిధిలోకి రాని చిన్న వ్యాపారులకు కూడా రైతులకు వర్తింపజేసే తరహా పథకాన్ని వర్తింప చేస్తారు. రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులు దీనిని ఉపయోగించుకోవచ్చు.

ఇవి అవసరం
కాగా, ప్రధాని మోడీ ఫిబ్రవరి 24, 2019న గోరక్‌పూర్‌లో కిసాన్ నిధి స్కీంను ప్రారంభించారు. మొదటిసారి కోటి మంది రైతులకు రూ.2వేల చొప్పున నగదు బదలీ చేశారు. ఈ స్కీంకు ఇవి అవసరం...
డేటా బేస్‌లో భూయజమాని పేరు, సామాజిక వర్గాకరణ, భూయజమాని ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, మొబైల్ నెంబర్ అవసరం. ఇది కేంద్రం స్పాన్సర్ చేస్తోన్న పథకం.


Click it and Unblock the Notifications