న్యూఢిల్లీ: పేద కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కోసం జాతీయ పింఛన్ వ్యవస్థ (NPS)లో డబ్బులు దాచుకునేలా అటల్ పెన్షన్ యోజన (APY) పుట్టుకు వచ్చింది. అసంఘటిత రంగాల్లో పని చేసే కార్మికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ విరమణ అనంతరం ఆనందమయ జీవితాన్ని పొందేందుకు.. ముందు నుంచే పొదుపు చేసేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశ్యం. 2011-12లోని ఓ సర్వే ప్రకారం 47.29కోట్ల మంది ఎలాంటి పింఛన్ సదుపాయం లేకుండా ఉన్నారు. అలాంటి వారి కోసం ఇది ప్రయోజనకారి.

అటల్ పెన్షన్ వల్ల ప్రయోజనం
నిర్దేశిత పింఛను మొత్తం రూ.1000 నుంచి రూ.5000 మధ్య ఉంటుంది. ఖాతాదారు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారైతే చెల్లించాల్సిన మొత్తాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఖాతాదారు చిన్న వయస్సులో చేరితే తక్కువగా, వయస్సు పెరిగే కొద్ది క్రమంగా పెరుగుతుంటుంది. అన్ని బ్యాంకుల ఖాతాదారులు ఇందులో చేరవచ్చు. అయిదేళ్ల కాల వ్యవధికి చెల్లించే మొత్తంలో 50 శాతం లేదా ఏడాదికి రూ.1000 ఏది తక్కువైతే అది కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎవరైతే చట్టబద్దమైన సోషల్ సెక్యూరిటీ పథకాలు వర్తించని అలాగే, ఆదాయపన్ను పరిధిలోకి రాని వారికి మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది.

వయో పరిమితి
అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్టంగా 40 సంవత్సరాలు. 60 ఏళ్ల వయస్సు రాగానే పథకం నుంచి తప్పుకోవడంతో పాటు పింఛన్ రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి చెల్లింపులు జరపటానికి కనీస కాల వ్యవధి 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి. ముఖ్యమంగా అసంఘటిత రంగాల్లో పని చేసే కార్మికులకు ప్రయోజనకారిగా ఉండటమే దీని ఉద్దేశ్యం.

బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్
అటల్ పెన్షన్ యోజన ఖాతా ప్రారంభించాలంటే తొలుత బ్యాంక్ ఖాతా తప్పనిసరి. ఖాతా లేకపోతే ఏదేనీ బ్యాంకులో ఖాతా ప్రారంభించడం ద్వారా ఇందులో చేరవచ్చు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, నామినీ వివరాలు తప్పనిసరి. స్కీమ్‌లో చేరే సమయంలో ఆధార్ నంబర్ లేకపోతే ఆ తర్వాత అయినా సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకులు నెలవారీ చందాను వారి ఖాతా నుంచి నిర్ణీత తేదీన ఉపసంహరించుకుంటాయి. కనుక చెల్లింపు తేదీ నాటికి చందామొత్తాన్ని అకౌంట్‌లో ఉండేలా చూసుకోవాలి.

అపరాధ రుసుము (డిఫాల్ట్ ఛార్జీలు)
అటల్ పెన్షన్ యోజన కింద నమోదు చేసుకున్న వారు నెలవారీ చెల్లింపులు చేసేందుకు అవకాశం కలిగి ఉంటారి. ఆలస్యంగా చెల్లింపులు జరిపితే బ్యాంకులు అదనపు సొమ్మును వసూలు చేస్తాయి. ఆ మొత్తం నెలకు రూ.1 నుంచి రూ.10 వరకు ఉంటుంది. నెలకు రూ.100 వరకు చెల్లింపు జరిపే వారి ఆలస్య చెల్లింపుపై రూ.1, రూ.101 నుంచి రూ.500 వరకు రూ.2, రూ.501 నుంచి రూ.1000 వరకు రూ.5, రూ.1001 నుంచి అంతకుముంచి రూ.10 చార్జ్ వసూలు చేస్తారు.

చెల్లింపులు నిలిపివేస్తే...
చెల్లింపులు నిలిపివేసిన సమయంలో ఆరు నెలల తర్వాత ఖాతాను ఫ్రీజ్ చేస్తారు. 12 నెలల తర్వాత ఖాతా రద్దు చేస్తారు. 24 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తారు.

ఖాతా నిష్క్రమణ
60 ఏళ్లు పూర్తయిన తర్వాత ఖాతాదారులు తమకు రావాల్సిన నెలవారీ పింఛను పొందేందుకు విజ్ఞప్తి పత్రం ఇవ్వాలి. ప్రత్యేక సందర్భాల్లో.. అంటే ఖాతాదారు మరణిస్తే లేదా నయం కానీ వ్యాధితో బాధపడితే కనుక 60 ఏళ్ల కంటే ముందే పెన్షన్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.

ఏ వయస్సు వారు ఎంత చెల్లించాలి
ఈ స్కీంలో 18 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సు వరకు చేరవచ్చు. 18 ఏళ్ల వయస్సులో చేరితో నెలకు రూ.1000 పింఛన్ పొందేందుకు రూ.42, రూ.5.000 పింఛన్ పొందేందుకు రూ.210 చెల్లించాలి. 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.1,000 పింఛన్ కోసం రూ.291, రూ.5,000 పింఛన్ కోసం రూ.1,454 చెల్లించాలి.

ఖాతాదారు లేదా జీవిత భాగస్వామి లేదా నామినీకి చెల్లించే మొత్తం
18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.42 చెల్లిస్తే రూ.1,000 పెన్షన్, రూ.84 చెల్లిస్తే రూ.2,000 పెన్షన్, రూ.126 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్, రూ.168 చెల్లిస్తే రూ.4,000 పెన్షన్, రూ.210 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్.
20 ఏళ్ల వయస్సులో నెలకు రూ.50 చెల్లిస్తే నెలకు రూ.1,000 పెన్షన్, రూ.100 చెల్లిస్తే రూ.2,000 పెన్షన్, రూ.150 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్, రూ.198 చెల్లిస్తే రూ.4,000 పెన్షన్, రూ.248 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్.
25 ఏళ్ల వయస్సులో రూ.76 చెల్లిస్తే రూ.1,000 పెన్షన్, 151 చెల్లిస్తే రూ.2,000 పెన్షన్, రూ.226 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్, రూ.301 చెల్లిస్తే రూ.4,000 పెన్షన్, రూ.376 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్.
30 ఏళ్ల వయస్సులో రూ.116 చెల్లిస్తే రూ.1,000 పెన్షన్, 231 చెల్లిస్తే రూ.2,000 పెన్షన్, రూ.347 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్, రూ.462 చెల్లిస్తే రూ.4,000 పెన్షన్, రూ.577 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్.
35 ఏళ్ల వయస్సులో రూ.181 చెల్లిస్తే రూ.1,000 పెన్షన్, 362 చెల్లిస్తే రూ.2,000 పెన్షన్, రూ.543 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్, రూ.722 చెల్లిస్తే రూ.4,000 పెన్షన్, రూ.902 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్.
40 ఏళ్ల వయస్సులో రూ.291 చెల్లిస్తే రూ.1,000 పెన్షన్, 582 చెల్లిస్తే రూ.2,000 పెన్షన్, రూ.873 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్, రూ.1164 చెల్లిస్తే రూ.4,000 పెన్షన్, రూ.1454 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications