జీతం లేదా వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయానికి తోడుగా అదనంగా కొంత సొమ్మును సంపాదించుకోవాలని ఎవరైనా చూస్తుంటారు. అందుకోసం కొంత మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపెడితే మరికొందరు ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికీ కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలోనూ పెట్టుబడులు పెట్టి అదనంగా అదాయాన్ని పొందవచ్చు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. కార్పొరేట్ లేదా కంపనీ డిపాజిట్లను ఆర్ధిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందిస్తున్నాయి. వివిధ కంపనీల ఫిక్స్డ్ డిఫాజిట్స్, వాటి కాలపరిమితి, వడ్డీరేట్లను చూసి ఎంపిక చేసుకోవచ్చు.
అధిక వడ్డీ
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. వివిధ కాలపరిమితులకు ఇవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని మీ ప్రాధాన్యానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. అంటే నెలవారీ, త్రైమాసిక, ఆరునెలలు, ఏడాది కాలానికే కాకుండా గరిష్టంగా ఐదేళ్ల కాలానికి ఈ డిపాజిట్లు అందుబాటులో ఉంటాయి.
ఉదాహరణకు హెచ్ డీ ఎఫ్ సి లిమిటెడ్, మహీంద్రా ఫైనాన్స్ సమృద్ధి, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్, బజాజ్ ఫైనాన్స్ , ఎల్ ఐ సి హౌసింగ్ ఫైనాన్సులు ఆఫర్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేటు కాలపరిమితిని బట్టి 7.87 శాతం నుంచి 9.25 శాతం వరకు ఉంది. సీనియర్ సిటిజెన్లకు అదనంగా 0. శాతం వడ్డీని అఫర్ చేస్తున్నారు.
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే వీటి లాక్ ఇన్ పీరియడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు నగదు తీసుకునే అవకాశం ఉంటుంది.

రేటింగ్ చూడండి...
- కార్పొరేట్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం లకు క్రిసిల్, ఇక్రా వంటి క్రెడిట్ రేటింగ్ సంస్థలు రేటింగ్ లను ఇస్తుంటాయి. వాటి ఆధారంగా రిస్క్ ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు పెట్టుబడి పెట్టే ముందు ఈ రేటింగ్స్ పై ఒక్కసారి దృష్టి సారించాలి. అధిక రేటింగ్ ఉన్న వాటికీ ప్రాధాన్యం ఇవ్వాలి.
- పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ చరిత్ర తెలుసుకోవాలి. ఆ కంపెనీ వ్యాపార వ్యవహారాలపై దృష్టి సారించాలి. ఆర్థిక ఫలితాలను విశ్లేషించుకోవాలి.
- ఇంతకు ముందు ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లింపులు ఏవిధంగా ఉన్నాయో చూసుకోవాలి.
ఇప్పుడు కాస్త జాగ్రత్త
- కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవే. రాబడికి హామీ ఉంటుంది. కానీ కంపెనీ దివాళా తీస్తే మీ పెట్టుబడి మొత్తాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉండవచ్చు.
- ఐ ఎల్ అండ్ ఎఫ్ ఎస్ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఈ సంస్థ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడులు పెట్టినవారికి చెల్లింపులు చేయడంలేదు. అందుకే పెట్టుబడులకు ముందు కంపెనీ చరిత్రను తరచి చూసుకోవాలి.


Click it and Unblock the Notifications