For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కార్డులను కాపాడుకోవచ్చు ఇలా..

By Jai
|

ఒకప్పుడు పర్సులో నగదు, కొన్ని ముఖ్యమైన గుర్తింపు కార్డులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మీ పర్సులో మీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న గుర్తింపు కార్డులు ఉంటున్నాయి. ఒకవేళ మీ పర్సు దొంగతనానికి గురైనా లేదా పోగొట్టుకున్నా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. మీ క్రెడిట్/డెబిట్ కార్డులు పోతే అవి దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టం జరగవచ్చు. ఇలా జరగకుండా ఉండటానికి మీరు మీ బ్యాంకుకు ఫోన్ చేసి కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది ఎంతో కష్టంతో కూడుకున్న వ్యవహారం. బ్లాక్ చేసుకున్న కార్డుల స్థానంలో కొత్త వాటిని పొందడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొత్త కార్డులకు కొంత సొమ్ము కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని క్రెడిట్ కార్డు లను జారీ చేస్తున్నఆర్ధిక సంస్థలు కార్డు రక్షణ ప్లాన్లను అందిస్తున్నాయి.

EPF అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్EPF అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్

బీమా పాలసీ మాదిరిగా..

బీమా పాలసీ మాదిరిగా..

మీ కార్డుల రక్షణ కోసం తీసుకునే ప్లాన్ బీమా పాలసీ లాంటిదే. ఈ ప్లాన్ వల్ల మీ వద్ద ఉండే వివిధ రకాల ప్లాస్టిక్ మనీ కార్డులకు కూడా కవరేజీ లభిస్తుంది. దాదాపు ప్రధాన బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపనీలు ఈ కార్డు రక్షణ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ బీమాను మీరు ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ కార్డుకు రక్షణ లభిస్తుంది.

రక్షణ పొందడం ఎలా ?

రక్షణ పొందడం ఎలా ?

ఉదాహరణకు క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత మీకు కార్డు ఇచ్చిన కంపనీ నుంచి కాల్ చేస్తుంటారు. అప్పుడు మీరు కార్డు రక్షణ కోసం ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కోరుకున్న ప్రయోజనాల ఆధారంగా ప్లాన్ చార్జీలు ఆధారపడి ఉంటాయి.

* క్రెడిట్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకొని ఉంటే ఒకవేళ మీరు పలు రకాల కార్డులను పోగొట్టుకున్నప్పటికీ ఒకే సారి అన్ని కార్డులను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ పర్సు పోయినప్పుడు కార్డు ప్రొటెక్షన్ సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్ చేస్తే మీ కార్డులను బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.

 కార్డు సంరక్షణ ప్లాన్ తో మోసాలకు రక్షణ కూడా లభిస్తుంది

కార్డు సంరక్షణ ప్లాన్ తో మోసాలకు రక్షణ కూడా లభిస్తుంది

* ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లలోను కార్డులకు సంబందించిన వివరాలు ఉంటున్నాయి. మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఫోన్ ద్వారా లావాదేవీలు జరిపినా నష్టం జరుగుతుంది. కాబట్టి కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ ఉంటే మీ ఫోన్ సిమ్ కార్డును బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.

* కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ల ద్వారా పాన్ కార్డు, పాస్ పోర్ట్ వంటి వాటికీ రక్షణ లభించే అవకాశం ఉంటుంది. కోల్పోతే అదనపు ఖర్చులు లేకుండా పొందే అవకాశం లభిస్తుంది.

English summary

మీ కార్డులను కాపాడుకోవచ్చు ఇలా.. | Credit Card and Debit Card Protection Plan

Credit Card Protection Plan acts as an insurance plan for credit cards, debit, retail, and membership and retail cards, in case of theft, loss or fraud on the cards.
Story first published: Tuesday, June 25, 2019, 10:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X