ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకుల్లోని సేవింగ్ అకౌంట్ కస్టమర్లు తమ తమ బ్యాంకుల్లో కనీస నగదు (మినిమం బ్యాలెన్స్) ఉండాలి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి మొదలు ప్రయివేటు రంగ బ్యాంకు దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐలు యావరేజ్ మినిమం మంత్లీ బ్యాలెన్స్ విషయంలో తమ తమ రూల్స్ ఫాలో అవుతున్నాయి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే పెనాల్టీ ఉంటుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులలో ఎక్కడ ఎంత మినిమం బ్యాలెన్స్ ఉంటే పెనాల్టీ తప్పించుకోవచ్చో చూడండి.

SBI మినిమం బ్యాలెన్స్
మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో SBI సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నవారు తమ తమ ఖాతాల్లో రూ.3,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సెమీ అర్బన్, రూరల్ బ్రాంచీల్లో వరుసగా రూ.2,000, రూ.1,000 ఉండాలి. మంత్రీ యావరేజ్ ఇంతకు తగ్గితే జరిమానా విధిస్తారు.

ICICI మినిమం బ్యాలెన్స్
మెట్రో, అర్బన్ ప్రాంతాలలో ICICI సేవింగ్స్ అకౌంట్లో కనీసం రూ.10,000 ఉండాలి. సెమీ అర్బన్ ప్రాంతాలలో యావరేజ్‌గా రూ.5,000 ఉండాలి. రూరల్ ప్రాంతాల్లో రూ.2,000 ఉండాలి. గ్రామీణ్ లొకేషన్స్‌లలో మినిమం బ్యాలెన్స్ రూ.1,000 ఉండాలని ఈ బ్యాంక్ వెబ్ సైట్ వెల్లడిస్తోంది.

HDFC మినిమం బ్యాలెన్స్
మెట్రో, అర్బన్ ప్రాంతాలలో HDFC సేవింగ్స్ అకౌంట్లో కనీసం రూ.10,000 ఉండాలి. సెమీ అర్బన్ బ్రాంచీలలో కనీసం రూ.5,000 ఉండాలి. రూరల్ బ్రాంచీలలో కనీసం రూ.2,500 ఉండాలి. లేదా రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్ కలిగి ఉండాలి. కనీస మెచ్యూరిటి పీరియడ్ ఏడాది ఒక్కరోజు ఉండాలి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications