For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యవసరమా?: ఇలా 2 రోజుల్లో పాన్‌కార్డ్ పొందవచ్చు, ఇవి అవసరం..

|

పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ఎంతో కీలకమైన ఐడెంటిటీ ప్రూఫ్. 10 డిజిట్స్ కలిగిన ఈ కార్డులో మీ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఉంటుంది. కంపెనీ లేదా వ్యక్తి ఎవరైనా పాన్ కార్డును పొందవచ్చు. ఇదివరకు పాన్ కార్డు రావడానికి చాలా రోజులు పట్టేది. పాన్ కార్డ్ ఉంటేనే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయగలం. క్రమంగా, ఇటీవలి కాలంలో పాన్ కార్డ్ పొందడం ఎంతో సులభంగా మారింది. ఆన్‌లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే లామినేటెడ్ రూపంలో పాన్ కార్డు మీకు పోస్టులో రావాలంటే 15 నుంచి ఇరవై రోజులు పట్టవచ్చు. కానీ ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వెంటనే పొందవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు, బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేందుకు, పాస్‌పోర్టు కోసం... అవసరమైతే పాన్ కార్డ్ త్వరగా పొందవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో రెండ్రోజుల్లో పాన్ కార్డ్

అత్యవసర పరిస్థితుల్లో రెండ్రోజుల్లో పాన్ కార్డ్

అత్యవసర పరిస్థితుల్లో పాన్ కార్డు రెండు రోజుల్లో పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒకరకంగా తత్కాల్ పాన్ అప్లికేషన్. ఫామ్ 49ఏ లేదా ఫామ్ 49ఏఏ దరఖాస్తు ద్వారా మీరు వెంటనే పాన్ కార్డ్ పొందవచ్చు. NSDL వెబ్ సైట్ www.tin-nsdl.com ద్వారా దరఖాస్తు చేయవచ్చు. లేదా NSDL టిన్-ఫెసిలిటేషన్ సెంటర్ (TIN-FC)/పాన్ సెంటర్ లేదా ఇతర స్టేషనరీ వెండర్స్ నుంచి పాన్ కార్డ్ అప్లికేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి ఫామ్స్ దొరుకుతాయి. అలాగే NSDL వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ ఉచితం.

ఇవి అవసరం

ఇవి అవసరం

దరఖాస్తు ఫామ్‌ను బ్లాక్ ఇంక్‌తో ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్‌తో నింపాలి. ఇండివిడ్యుయల్ అప్లికెంట్ అయితే రెండు కలర్ ఫోటోలు అతికించాలి. బ్యాక్ గ్రౌండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. సైజ్ 3.5 cm x 2.5 cm ఉండాలి. ఎందుకంటే ఫాంలో అంతే స్పేస్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డు వంటివి జత చేయాలి. వీటితో పాటు మీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు డిజిటల్ సిగ్నేచర్ అవసరం.

రెండ్రోజుల్లో పాన్ కార్డ్

రెండ్రోజుల్లో పాన్ కార్డ్

ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసే ఫామ్‌లో మీరు ఇచ్చే వివరాలు కచ్చితమైనవి ఉండాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయండి. మీరు సబ్‌మిట్ చేసే సమయంలో ఫిజికల్ కార్డ్ లేదా ఈ-పాన్ కార్డు ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీకు అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. దాని ద్వారా మీ కార్డు స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. రెండు రోజుల్లో పాన్ కార్డు వస్తుంది. దానిని ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఫిజికల్ కార్డు 15-20 రోజుల్లో వస్తుంది.

English summary

అత్యవసరమా?: ఇలా 2 రోజుల్లో పాన్‌కార్డ్ పొందవచ్చు, ఇవి అవసరం.. | You can get PAN card in just 48 hours

The Permanent Account Number (PAN) is a vital proof of identity. It is issued in 10 digit alphanumeric pattern that has a link to your name, date of birth and fathers name in it.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X