ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జోరందుకోనుంది. ఇటీవల ఎన్నికలు రావడంతో కొత్త రేషన్ కార్డు ప్రక్రియ నిలిపివేశారు. దీంతో దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు, దరఖాస్తు చేసుకున్నవారు ఇబ్బందులు పడ్డారు. కొత్త రేషన్ కార్డు ప్రక్రియ వేగవంతం కానుండటంతో వీటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏమేం కావాలో తెలుసుకుందాం. ప్రభుత్వ స్కీంలు రేషన్ కార్డుతో లింక్ చేస్తున్నందున, ఇవి తీసుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. బయోమెట్రిక్ కారణంగా ఇప్పుడు రేషన్ ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఇది రేషన్ కార్డు ఉన్న వారికి ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఇది వరకు రేషన్ తీసుకోవాలంటే తమ తమ ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేదు.

మరికొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం.
- అడ్రస్ ప్రూప్: ఆధార్ కార్డు, ఓటరు కార్డు వంటి ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్
- ఐడెంటిటీ కార్డు: కుటుంబ యజమాని ఐడెంటిటీ కార్డు (ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ వంటివి)
- డేట్ ఆఫ్ బర్త్ వివరాలు
- యజమాని ఫోటో
- యజమాని వయస్సు ధృవీకరణ పత్రం
- యజమాని ఆదాయ వివరాలు. గ్రామీణ ప్రాంతాల వారైతే 1,60,000, పట్టణ ప్రాంతాలవారైతే 2,00,000 మించకూడదు.
దగ్గరలోని మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పేర్కొన్న డాక్యుమెంట్లతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. మీసేవలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తుదారులకు నెంబర్ కేటాయిస్తారు. మీ సేవా ఇచ్చే దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన జిరాక్స్ పత్రాలను అటాచ్ చేసి ఎమ్మార్వో ఆఫీసులో సమర్పించాలి. ఎమ్మార్వో కార్యాలయం పరిశీలించి నిబంధనలకు లోబడి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.


Click it and Unblock the Notifications