For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు పై తక్షణ రుణం తీసుకోవచ్చు ఇలా...

By Jai
|

అత్యవసర సమయంలో డబ్బు అవసరం ఉంటే ఏం చేస్తాం... తెలిసిన వాళ్ళు లేదా స్నేహితుల నుంచి చేబదులు తీసుకుంటాం.. అవసరమైతే వడ్డీకి తీసుకుంటాం. కానీ మీరు అడిగినప్పుడు మీ స్నేహితులు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుంటే ఎలా? అలాంటి సందర్భాల్లో మీరు క్రెడిట్ కార్డ్స్ ద్వారా రుణం తీసుకోవచ్చు. ఇందుకు సంబందించిన వివరాలు తెలుసుకుందామా....

వ్యకిగత రుణం లాంటిదే...

వ్యకిగత రుణం లాంటిదే...

క్రెడిట్ కార్డు పై తీసుకునే రుణం వ్యక్తిగత రుణంలాంటిదే. అయితే కొంత తేడా మాత్రం ఉంది. అదేమిటంటే వ్యక్తిగత రుణానికి అనుమతి లభించడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ క్రెడిట్ కార్డు పై రుణానికి ముందే అనుమతి ఉంటుంది. అంటే ప్రీ అప్రూవ్డ్ అన్న మాట. క్రెడిట్ కార్డుపై రుణానికి డాక్యూమెంటేషన్ అవసరం ఉండదు. వ్యక్తిగత రుణానికి మాత్రం డాక్యూమెంటేషన్ తోపాటు ఆ రుణానికి అర్హత కలిగి ఉండాలి. సాధారణంగా క్రెడిట్ కార్డు పై ఇచ్చే పరిమితిలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవచ్చు. అయితే దీనిపై వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డు పై ఇచ్చే రుణంపై వడ్డీరేటు తక్కువ ఉంటుంది. కార్డుపై ఉన్న నగదు ఉపసంహరణ మొత్తం సరిపోనప్పుడు క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవచ్చు. ఈ రుణ మొత్తం చాలా

త్వరగా చేతికి అందుతుంది. అందుకే చాలా మంది క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇవీ అర్హతలు

ఇవీ అర్హతలు

క్రెడిట్ కార్డుపై రుణం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి అవేమిటంటే...

- సాధారణంగా బ్యాంకులు తమ కొత్త, పాత కస్టమర్లకు క్రెడిట్ కార్డుపై రుణం అందిస్తుంటాయి. కొన్ని బ్యాంకులు మాత్రం తమ పాత కస్టమర్లకు మాత్రమే క్రెడిట్ కార్డుపై రుణం ఇస్తున్నాయి.

- రుణం పొందడానికి క్రెడిట్ కార్డు ఖాతా కలిగి ఉండాలి.

- రుణం రావాలంటే మీ క్రెడిట్ చరిత్ర మెరుగ్గా ఉండాలి. మీ క్రెడిట్ కార్డు చెల్లింపులు బాగుండాలి.

- ఆదాయం పెంచుకుంటున్నవారు తమ క్రెడిట్ కార్డు కేటగిరీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ రుణ అర్హతను పెంచుకోవచ్చు.

- క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవడానికి ముందే మీ రుణ అర్హత మొత్తం గురించి తెలుసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ లేదా మీకు సమీపంలో ఉన్న మీ బ్యాంకు శాఖను సంప్రదించడం ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు.

- క్రెడిట్ కార్డుపై రుణం పొందడానికి మీరు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలోనే మీరు అవసరమైన డాక్యుమెంట్లు మీ బ్యాంకుకు సమర్పించి ఉంటారు కాబట్టి.

వడ్డీ రేటు ఎంత ?

వడ్డీ రేటు ఎంత ?

వ్యక్తిగత రుణం పై సాధారణంగా వడ్డీ రేటు 12 శాతం నుంచి 20 శాతం వరకు ఉండవచ్చు. కారు, గృహ ఇతర రుణాలకన్నా వ్యక్తిగత రుణంపై వడ్డీరేటు కాస్త ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ కార్డుపై రుణం కూడా వ్యక్తిగత రుణం లాంటిదే కాబట్టి వడ్డీరేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీరు తీసుకున్న క్రెడిట్ కార్డు రకాన్ని బట్టి, మీ ఫైల్ ను బట్టి వడ్డీరేటు ఆధారపడి ఉంటుంది.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

- డబ్బు అవసరం ఉన్నప్పుడు తక్షణమే పొందవచ్చు.

- క్రెడిట్ కార్డు లో ఉండే నగదు మొత్తాన్ని తీసుకోవడం ద్వారా చెల్లించే వడ్డీరేటు కన్నా తక్కువ వడ్డీ రేటు .

- డాక్యుమెంటేషన్ అవసరం లేదు.

- ఆన్ లైన్ లేదా ఫోన్ కాల్ ద్వారా మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

- వేగంగా రుణ మంజూరు.

- తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు తక్కువ.

- తీసుకున్న రుణాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. నెలవారీ మొత్తం మీ క్రెడిట్ కార్డు బిల్లులో జతవుతుంది.

- సాధారణంగా రెండేళ్ల కాలానికి క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవచ్చు.

మీరు క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవాలనుకున్నప్పుడు మీరు కార్డు పొందిన బ్యాంకు లేదా కార్డు కంపెనీని వడ్డీ రేటు గురించి ముందే తెలుసుకోండి. వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు ఉండవచ్చు.

English summary

క్రెడిట్ కార్డు పై తక్షణ రుణం తీసుకోవచ్చు ఇలా... | Apply for Instant Loan on Credit Card

Personal Loan on Credit Card is a service through which ICICI Bank provides Loan to select Bank Credit Card customers based on their spends, transaction pattern and payment history.
Story first published: Monday, May 20, 2019, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X