అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ (pmsym) పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో చేరే కార్మికులు ఎంతమేర ప్రీమియం చెల్లిస్తే దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెల రూ.3వేల పెన్షన్ వస్తుంది. ఈ పథకంలో కార్మికుడు తన వాటా కింద ప్రీమియం చెల్లించాలి. చాలామందికి దీనిపై అంతగా అవగాహన లేదు. నెలకు రూ.15వేలు ఆదాయం వచ్చే 18 నుంచి 40 వయస్సు గల అసంఘటిత కార్మికులు ఈ స్కీంలో చేరవచ్చు. వీరికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేలు వస్తాయి.

pmsym ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు
అసంఘటిత కార్మికునికి 60 ఏళ్లు నిండిన తర్వాత జీవితకాలం ప్రతి నెల రూ.3వేల పెన్షన్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ద్వారా అందుతుంది. మరణిస్తే నామినీకి పింఛన్ మొత్తంలో 50 శాతం లభిస్తుంది. అతను 60 ఏళ్ల లోపు మృతి చెందితే కట్టిన ప్రీమియాన్ని వడ్డీతో కలిపి నామినికి చెల్లిస్తారు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ స్కీంలో చేరవచ్చు. 60 ఏళ్ల వరకు దీనిని చెల్లించాలి. అంటే 20 నుంచి 42 ఏళ్లు చెల్లించాలి. ఇతర పెన్షన్ పథకాల్లో సభ్యులు కానివారు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివారు, నెల ఆదాయం రూ.15వేల లోపు ఉన్నవారు దీనికి అర్హులు. పనివాళ్లు, భవన నిర్మాణ కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారు, వ్యవసాయ కూలీలు, చెత్త ఎరుకుని విక్రయించేవారు, ఆటో, రిక్షా, ప్రయివేటు డ్రైవర్లు, బీడీ, చేనేత, రజక, కుమ్మరి, దర్జీ వంటి చేతి వృత్తుల వారు అర్హులు. అర్హులైన వారు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తమ పేరును నమోదు చేసుకోవాలి. అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలి.

ఇవి ఇవ్వండి
అర్హులైన వారు తమ ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్, సెల్ ఫోన్ నెంబర్, ఇవ్వాలి. వయసు ఆధారంగా నెలకు ప్రీమియం రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కార్మికుడు చెల్లించిన దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కార్మికుడు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. తొలి నెల ప్రీమియం నగదు రూపంలో మిగిలిన ప్రీమియంలు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా పథకం పేరుతో జమ అవుతాయి. ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్, పాస్‌బుక్‌లు ఇవ్వవలసి ఉంటుంది. వయస్సు, ఆదాయానికి సంబంధించిన డిక్లరేషన్ తప్పుగా ఇస్తే పెనాల్టి ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ పెన్షన్ స్కీం ఫండ్ మేనేజర్, సబ్‌స్బ్రైబర్‌కు పేమెంట్ సర్వీస్ప్రొవైడర్ ఎల్ఐసీ.

pmsym ఎగ్జిట్ రూల్స్
pmsym స్కీంలో చేరిన వారు ఏదైనా ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి వెళ్తే, అందులో మూడేళ్ల పాటు ఉంటే.. మీ అకౌంట్ అలాగే కొనసాగుతుంది. కానీ ఆ కాలానికి ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఆగిపోతుంది. ఒకవేళ సబ్‌స్క్రైబర్ కనుక మొత్తం అమౌంట్ చెల్లించుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ప్రకారం 60 ఏళ్లు వచ్చాక మీ అమౌంట్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ సమయంలోని బ్యాంకు ఇంట్రెస్ట్‌తో కలిపి తీసుకోవచ్చు.
అయిదేళ్ల తర్వాత ఈ స్కీం వద్దనుకుంటే సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటుతో కలిపి ఇస్తారు.
మరో విషయం గుర్తుంచుకోండి. పెన్షన్ ప్రారంభానికి ముందు, పదేళ్ల కంట్రిబ్యూషన్ తర్వాత సబ్‌స్క్రైబర్ ఈ స్కీం నుంచి వెళ్లిపోవాలనుకుంటే కేవలం మీ కంట్రిబ్యూషన్ మాత్రమే ఇస్తారు. కానీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ రాదు.

ఏ వయస్సులో ఎంత కంట్రిబ్యూషన్ అంటే
18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఈ పెన్షన్ స్కీంలో చేరవచ్చు. 60 ఏళ్ల వయస్సు వరకు చెల్లించాలి. తక్కువ వయస్సులో చేరితే తక్కువ మొత్తం నుంచి ప్రారంభమవుతుంది. కార్మికుడి కంట్రిబ్యూషన్ ఎంతగా ఉంటే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే కార్మికుడి కంట్రిబ్యూషన్ రూ.55 అవుతుంది. ప్రభుత్వం అంతేమొత్తం ఇస్తుంది. మొత్తం రూ.110 అవుతుంది.
| వయస్సు | కార్మికుడి కంట్రిబ్యూషన్ | మొత్తం (ప్రభుత్వం కలిపి) |
| 18 | 55 | 110 |
| 19 | 58 | 116 |
| 20 | 61 | 122 |
| 21 | 64 | 128 |
| 22 | 68 | 136 |
| 23 | 72 | 144 |
| 24 | 76 | 152 |
| 25 | 80 | 160 |
| 26 | 85 | 170 |
| 27 | 90 | 180 |
| 28 | 95 | 190 |
| 29 | 100 | 200 |
| 30 | 105 | 210 |
| 31 | 110 | 220 |
| 32 | 120 | 240 |
| 33 | 130 | 260 |
| 34 | 140 | 280 |
| 35 | 150 | 300 |
| 36 | 160 | 320 |
| 37 | 170 | 340 |
| 38 | 180 | 360 |
| 39 | 190 | 380 |
| 40 | 200 | 400 |
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications