దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డులు (ఆహార భద్రత కార్డు) ఇస్తారు. మీ సేవా కేంద్రాల్లో నిర్దేశిత ధృవపత్రాలు, ఇతర వివరాలతో కూడిన దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏయే పత్రాలు అవసరమో తెలుసుకోండి.

మీ సేవా ద్వారా దరఖాస్తు
- దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మొదట పామ్ తీసుకోవాలి. ఇవి మీకు సమీపంలోని మీసేవా కేంద్రాల్లో లభిస్తాయి. మీసేవా (Meeseva) అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- పామ్‌లో అవసరమైన సమాచారం నింపండి. సూచించిన చోట సంతకం చేయాలి.
- ఎక్కడ కూడా తప్పుడు సమాచారం ఇవ్వకండి. అలా చేస్తే కనుక మీ ఫామ్‌ను రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి
- అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి. ఫీజును, దరఖాస్తు ఫాంను మీసేవలో సబ్‌మిట్ చేయండి. అక్కడ మీరు అక్నాలెడ్జ్ స్లిప్ తీసుకోవడం మరిచిపోవద్దు.
- కుటుంబ యజమాని సంవత్సర ఆదాయం, వృత్తి వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. గ్రామీణ ప్రాంతం వారి ఆదాయం రూ.ఒక లక్ష 60 వేలు, పట్టణ ప్రాంత ప్రజల ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు.
- గ్రౌండ్ లెవల్ వెరిఫికేషన్ అనంతరం కొంతకాలానికి మీసేవ మీకు రేషన్ కార్డు అందిస్తుంది. నిబంధనలకు లోబడి అర్హత కలిగిన వారికి ఆహార భద్రత కార్డు జారీ చేస్తారు.

అవసరమైన డాక్యుమెంట్లు
- దరఖాస్తు ఫారం.
- రెసిడెన్షియల్ ప్రూఫ్
- ఏజ్ సర్టిఫికేట్/ఫ్యామిలీ హెడ్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్.
- ఫ్యామిలీ ఇన్‌కం ప్రూఫ్. ఫ్యామిలీ ఆదాయం సూచించిన మేరకు ఉండాలి.
- ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు వంటి ఐడెంటిటీ ప్రూఫ్ అవసరం
- దరఖాస్తుదారు పాస్‌పోర్టు ఫోటోలు
- ప్రధాన్/కౌన్సెలిర్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్ ఫారం
- మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్ అడ్రస్.
- మీరు అద్దెకు ఉంటున్నట్లయితే టెనెన్సీ అగ్రిమెంట్.

అర్హత
- దరఖాస్తుదారు ఇండియన్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే రాష్ట్రంలో ఉండాలి.
- ఇతర రాష్ట్రాలలో ఫ్యామిలీ మెంబర్స్‌కు కార్డు ఉండరాదు.
- దరఖాస్తులో అందరు కుటుంబ సభ్యులు ఉండాలి.
- మీకు కొత్తగా పెళ్లయితే కొత్త రేషన్ కార్డు తీసుకోవాలి. అలాగే మీ పాత కార్డులో మీ పేరు తొలగించుకోవాలి. అప్లికేషన్ ఫామ్ రూ.10. ఛార్జీలు రూ.35.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications