For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC రేగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తెలుసా?: రివార్డ్స్, ప్రియారిటీ పాస్.. మరిన్ని తెలుసుకోండి

|

ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాము. క్రమంగా ఒక్కరొక్కరు డిజిటలైజ్ అవుతున్నారు. డబ్బులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లిస్తున్నారు. బ్యాంకులు జారీ చేసే అన్ని క్రెడిట్ కార్డులు అందరూ ఉపయోగించలేరు. కొన్ని కార్డులు మాత్రమే అందరికీ జారీ చేస్తారు. మరికొన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు అర్హతలు లేదా నిబంధనలు ఉంటాయి. వ్యక్తుల లైఫ్‌స్టైల్ అవసరాలకు అనుగుణంగా ప్రీమియం లేదా సూపర్ ప్రీమియం సెగ్మెంట్ కార్డులు ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఐదు రకాల సుప్రీం ప్రీమియం సెగ్మెంట్ కార్డులు జారీ చేస్తోంది. ఇందులో ఇన్ఫీనియా(Infinia), రెగాలియా(Regalia), రేగాలియా ఫస్ట్(Regalia First), డైనర్స్ క్లబ్ బ్లాక్ (Diners Club Black), డైనర్స్ క్లబ్ మైల్స్ (Diners ClubMiles) ఉన్నాయి. ఇక్కడ మనం రేగాలియా ఫస్ట్ గురించి తెలుసుకుందాం.

బ్యాంకింగ్ మోసాల పట్ల జాగ్రత్త, ఈ సూచనలు పాటించండిబ్యాంకింగ్ మోసాల పట్ల జాగ్రత్త, ఈ సూచనలు పాటించండి

 రేగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డు ఎవరికి ఇస్తారు?

రేగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డు ఎవరికి ఇస్తారు?

రేగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డును వేతనజీవులకు, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కు ఇస్తారు. ఆదాయాన్ని, వయస్సును కూడా పరిగణలోకి తీసుకుంటారు. కనీసం 21 ఏళ్ల వయస్సు, గరిష్టం 60 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ కార్డు పొందేందుకు అర్హులు. వీరి గ్రాస్ నెలసరి ఆదాయం రూ.40వేలకు పైగా ఉండాలి. ఇది వేతన జీవులకు వర్తిస్తుంది.ఇక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనీస వయస్సు 21. గరిష్టం 65 ఏళ్లు. ఏడాదికి రూ.5 లక్షలకు పైగా ఐటీఆర్ ఫైల్ చేసి ఉండాలి.

రివార్డు పాయింట్స్ ఎలా ఉంటాయి, ఎప్పటి దాకా పరిమితం

రివార్డు పాయింట్స్ ఎలా ఉంటాయి, ఎప్పటి దాకా పరిమితం

రేగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డు ఫస్ట్ ఇయర్ మెంబర్ షిప్ రూ.1000 మరియు అప్లికేబుల్ ట్యాక్స్‌లు. రెన్యూవల్ మెంబర్‌షిప్ రూ.1000 ప్లస్ అప్లికేబుల్ ట్యాక్స్‌లు. అయితే ఏడాదిలో రూ.1,00,000 స్పెండ్ చేస్తే తదుపరి ఏడాది రెన్యూవల్ ఉచితం. అంటే మరుసటి ఏడాదికి రెన్యూవల్ ఫీ రద్దు చేస్తారు.

ఈ కార్డును ఉపయోగిస్తే మంచి రివార్డు పాయింట్స్ ఉంటాయి. ప్రతి 150 ఖర్చు పైన 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ రివార్డు పాయింట్లతో ఉచిత ఎయిర్ టిక్కెట్స్ కొనుగోలు చేసుకోవచ్చు. వెల్‌కం బెనిఫిట్స్ 1000 రివార్డు పాయింట్స్ ఉంటాయి. అలాగే రెన్యూవల్ రివార్డు పాయింట్స్ కూడా 1000 ఉంటాయి. అయితే ఉచిత రెన్యూవల్‌కు ఈ రివార్డు పాయింట్స్ రావు. ఈ రివార్డ్ పాయింట్లు ఫ్యూయల్‌కు ఉండవు. ఈజీఈఎంఐ, ఈ-వ్యాలెట్ ట్రాన్సాక్షన్ ద్వారా రివార్డు పాయింట్స్ ఉండవు. ఇన్సురెన్స్ ట్రాన్సాక్షన్స్ పైన ఒక ట్రాన్సాక్షన్‍‌కు గరిష్టంగా 2,000 రివార్డ్స్ పాయింట్స్. ఏడాది పాటు చేసే స్పెండింగ్స్ పైన బోనస్ పాయింట్స్ వస్తాయి. రూ.6,00,000 ఖర్చుపై ఏడాదికి 7,500 రివార్డు పాయింట్స్ పొందవచ్చు. రూ.3,00,000 స్పెండింగ్స్ పైన 5,000 రివార్డు పాయింట్స్ పొందవచ్చు. ఇక్కడ మరో విషయం రివార్డు పాయింట్స్ కేవలం రెండేళ్ల వరకే వ్యాలిడ్.

రెగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డుతో విమానాశ్రయాల్లో ఇలా

రెగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డుతో విమానాశ్రయాల్లో ఇలా

రెగిలియా ఫస్ట్ క్రెడిట్ కార్డు కలిగినవారు ప్రపంచంలోని 1000కి పైగా విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ ప్రియారిటీ పాస్ మెంబర్‌షిప్ పొందుతారు. దీంతో వెయ్యికి పైగా ఎయిర్ పోర్ట్ లాంజ్‌లలో ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఉంటుంది. అయితే, ఈ కార్డు ద్వారా ఒక్కరికే పరిమితి అని గుర్తుంచుకోవాలి. ప్రియారిటీ పాస్ ఉంటే భారతదేశంలోని విమానాశ్రయాల్లో 27 అమెరికన్ డాలర్లు ప్లస్ జీఎస్టీ చెల్లించి లాంజ్‌లోకి వెళ్లవచ్చు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎనిమిది కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్‌లు ఉంటాయి. విదేశాల్లో 3 కాంప్లిమెంటరీ విజిట్స్ ఉంటాయి. దీనికి కూడా 27 అమెరికన్ డాలర్లు ప్లస్ జీఎస్టీ.

ఎయిర్ లైన్ టిక్కెట్స్

ఎయిర్ లైన్ టిక్కెట్స్

రూ.400 కనీస ట్రాన్సాక్షన్ పైన 1 శాతం ఫ్యూయల్ ఛార్జ్ రద్దవుతుంది. గరిష్ట క్యాష్ బ్యాక్ రూ.500. మీరు తరుచూ ప్రయాణిస్తుంటారా.. మీకు రెగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డు ఉందా... అయితే మీ ఎయిర్ లైన్ టిక్కెట్స్‌ను రివార్డు పాయింట్స్‌తో కొనుగోలు చేసుకోవచ్చు. హోటల్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ కార్డు కలిగిన వారు ఎయిర్ యాక్సిడెంట్‌లో మృతి చెందితే నామినీకి రూ.50 లక్షల కంపెన్షేషన్ వస్తుంది. కాబట్టి నామినీ పేరును బ్యాంకుకు అందజేయడం మంచింది. అయితే హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ రేగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డు ద్వారా టిక్కెట్స్ కొనుగోలు చేస్తే ఇది వర్తిస్తుంది. ఈ కార్డు హోల్డర్స్ విదేశాల్లో ఉంటే రూ.10 లక్షల మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది. రూ.5 లక్షల వరకు క్రెడిట్ లయబులిటీ కవర్ ఉంది.

English summary

HDFC రేగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తెలుసా?: రివార్డ్స్, ప్రియారిటీ పాస్.. మరిన్ని తెలుసుకోండి | What is HDFC regalia first credit card?

HDFC Bank Regalia First: Credit cards are increasingly becoming a must-have in this digital age. Some of them are plain-vanilla cards while some could be co-branded ones. While some cards may cater to all, there are some cards that only cater to the lifestyle needs of the premium or the super premium segment.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X