ఎంతోమంది విద్యార్థులు ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలలో చదవాలని భావిస్తారు. ఉన్నత చదువులు ఖర్చుతో కూడుకున్నవి. అయితే విద్యార్థుల చదువు కోసం పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వివిధ రకాల ఎడ్యుకేషన్ లోన్ ఆఫర్ చేస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ స్కాలర్ లోన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్, స్టూడెంట్ లోన్, స్కిల్ లోన్ ఇలా వివిధ రకాల లోన్స్ ఇస్తోంది. ఎడ్యుకేషన్ లోన్ విషయానికి వస్తే ఎస్బీఐ స్టూడెంట్ లోన్ స్కీం కింద ఇండియన్స్‌కు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లోన్ ఇస్తోంది. భారత్ లేదా అబ్రాడ్ కోసం ఈ లోన్ వెసులుబాటు ఉంది. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఈ లోన్ రీపేమెంట్‌కు పదిహేనేళ్ల కాలపరిమితి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్‌కు ప్రాసిసెంగ్ ఫీజు తదితర ఫీజులు లేవు. భారతదేశంలో చదువులకు గరిష్టంగా రూ.10 లక్షలు, విదేశాల్లో చదువులకు రూ.20 లక్షల వరకు ఇస్తోంది.

ఎడ్యుకేషన్ లోన్‌కు ఏం అవసరం
- ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్.... పాన్‌కార్డ్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డు.
- ఏదైనా రెసిడెన్స్ ప్రూఫ్... టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు.
- విదేశాల్లో చదువులకు పాస్‌పోర్ట్ తప్పనిసరిగా సబ్‌మిట్ చేయాలి.
- అకడమిక్ రికార్డ్స్. 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ ఫలితాల మెమోలు. అవసరమైతే సెమిస్టర్ వైజ్ కూడా ఇవ్వాలి.
- ఏ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా వెళ్తున్నావో అందుకు సంబంధించిన వివరాలు. CAT, CMAT, JEE, NEET, CET, GMAT, GRE, TOEFL.. ఇలా ఏ పరీక్షల ద్వారా వెళ్తే అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి.
- అడ్మిషన్ ప్రూఫ్... మీరు చదవబోయే ఇనిస్టిట్యూషన్ పంపించిన ఆఫర్ లెటర్ లేదా అడ్మిషన్ లెటర్. విదేశాల్లో చదవాలనుకుంటే మాత్రం అడ్మిషన్ లెటర్ తప్పనిసరి కావొచ్చు.
- చదువు కోసం అయ్యే ఖర్చు వివరాలు/ఖర్చులకు సంబంధించిన వివరాలు.
- రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు
- ఇతర బ్యాంకుల నుంచి ఏవైనా లోన్‌లు తీసుకొని ఉంటే అది వెల్లడించాలు. అలాగే గత 12 నెలల కాలానికి సంబంధించిన స్టేట్‌మెంట్ ఇవ్వాలి.

కో అప్లికెంట్
- ఎడ్యుకేషన్ లోన్‌కు కో-అప్లికెంట్ అవసరం. ఇతను విద్యార్థి పేరెంట్స్ కావొచ్చే లేదా గార్డియన్ కావొచ్చు.
- ఐడీ ప్రూఫ్ అవసరం. పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డు వంటివి అవసరం.
- ఏదైనా అడ్రస్ ప్రూఫ్ అవసరం. టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు.
- 2 పాస్‌పోర్టు ఫోటోలు.
- బ్యాంకులు, ఇతర లెండర్స్ నుంచి గతంలో ఏమైనా లోన్ తీసుకుంటే వెల్లడించాలి. గత 12 నెలల కాలానికి సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్.

శాలరైడ్ కో-అప్లికేంట్ లేదా గ్యారెంటీర్ ఇన్‌కం ప్రూఫ్
- గత మూడు నెలల శాలరీ స్లిప్ లేదా శాలరీ సర్టిఫికేట్
- గత 2 సంవత్సరాల ఫారం 16 కాపీ లేదా గత రెండేళ్ల ఐటీ రిటర్న్స్
- గత ఆరు నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ (శాలరీ అకౌంట్)
గ్యారంటీర్/ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కో-అప్లికెంట్ ఇన్‌కం ప్రూఫ్
- అవసరమైతే బిజినెస్ అడ్రస్ ప్రూఫ్.
- గత రెండు ఆర్థిక సంవత్సరాలకు చెందిన ఐటీ రిటర్న్స్
- అవసరమైతే టీడీఎస్ సర్టిఫికేట్
- క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ (సీఏ/డాక్టర్/ఇతర ప్రొఫెషన్)
- గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications