For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి

|

ఈపీఎఫ్ నుంచి మీరు మీ వంద శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని భావిస్తున్నారా? ఉద్యోగం లేకుండా రెండు నెలలు ఉంటేనే మొత్తం తీసుకోవడం సాధ్యమవుతుంది. ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల తర్వాత 75 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత రెండు నెలల తర్వాత మిగిలిన 25 శాతం తీసుకోవచ్చు. మీ పీఎఫ్ నిధుల విత్ డ్రా నిబంధనలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) రూపొందిస్తుంది.

పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం ఎంతో సులభంపీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం ఎంతో సులభం

ఎవరైనా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్లోకి వెళ్లి తమ పీఎఫ్ అకౌంట్‌ను తమ యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ అకౌంట్‌లో ఎంత మొత్తం ఉంది, పాస్‌బుక్, పీఎప్ క్లెయిమ్ స్టేటస్‌లు తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ గత ఏడాది పీఎప్ విత్ డ్రా విషయంలో కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. ఈపీఎఫ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చింది.

Need to withdraw from EPF account? Know these rules

మీరు 3 సందర్భాల్లో మాత్రమే మీ 100 శాతం మొత్తాన్ని పీఎఫ్ అకౌంట్ నుంచి తీసుకోగలుగుతారు. 1. రిటైర్మెంట్ సమయంలో 2. రెండు నెలల పాటు ఉద్యోగం లేకుండా ఉన్న సమయంలో 3. రిటైర్మెంట్ ఏజ్ కంటే ముందే చనిపోయినప్పుడు... ఈ మూడు సందర్భాల్లో మాత్రమే 100 శాతం ఉపసంహరించుకోగలరు.

- పెళ్లి కోసం ఈపీఎఫ్‌లో ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్‌లో 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. దీనికి కనీసం ఏడేళ్ల సర్వీస్ ఉండాలి. పెళ్లి సదరు ఉద్యోగిది కావొచ్చు లేదా కుటుంబ సభ్యులది కావొచ్చు.
- చదువు కోసం ఈపీఎఫ్‌లోని 50 శాతం వరకు తీసుకోవచ్చు. దీనికి ఏడేళ్ల సర్వీస్ ఉండాలి. పదో తరగతి తర్వాతి ఉన్నత చదువుల నిమిత్తం తన చదువు లేదా తన పిల్లల చదువు కోసం తీసుకోవచ్చు.
- ఇళ్లును కొనుగోలు చేయడం లేదా స్థలం కొనుగోలు కోసం తీసుకోవచ్చు. ఇందుకు అయిదేళ్ల సర్వీస్ ఉండాలి. ఆ ఇళ్లు లేదా భూమి సదరు ఉద్యోగి పేరు మీద ఉండాలి లేదా భార్య పేరుతో జాయింట్‌గా ఉండాలి. ఇంటి నిర్మాణం కోసం కేవలం ఒకేసారి పీఎఫ్ తీసుకోవచ్చు.
- హోమ్ లోన్ రీపేమెంట్ కోసం 90 శాతం మొత్తం తీసుకోవచ్చు. ఇందుకు మూడేళ్ల సర్వీస్ ఉండాలి. పీఎఫ్ లేదా ఈపీఎఫ్ నుంచి తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ ఉద్యోగి పేరు మీద లేదా జీవిత భాగస్వామితో కలిపి జాయింట్‌గా ఉండాలి.
- ఇంటి మరమత్తులు, రిటైర్మెంట్‌కు ముందు, వైద్య ఖర్చులకు కూడా పీఎఫ్ డబ్బును తీసుకోవచ్చు. వైద్య ఖర్చులకు లాకిన్ పీరియడ్ అవసరం లేదు. సర్వీస్ గడువు లేదు.

English summary

పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి | Need to withdraw from EPF account? Know these rules

In order to withdraw 100 per cent amount from the Employee Provident Fund (EPF), an employee has to wait for at least two months after leaving the job. However, 75 per cent of the PF amount can be withdrawn after one month of leaving a job.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X