ఆధార్ ప్రోగ్రాం కింద UIDAI 12 అంకెలు కలిగిన ఆధార్ కార్డును ఇస్తోంది. ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. మీ ఆధార్ కార్డు పోయిన సందర్భాలలో లేదా అప్ డేట్ అయిన సందర్భాలలో కొత్త ఆధార్ కార్డును పొందవచ్చు. దీనికి రూ.50 వసూలు చేస్తారు. జీఎస్టీ, స్పీడ్ పోస్ట్ ఛార్జీలు కలిపి దీనిని వసూలు చేస్తారు. అంటే మీరు మీ మరో ఆధార్ resident.uidai.gov.in/aadhaar-reprint ద్వారా కోరవచ్చు.
మరో ఆధార్ కార్డు కోసం మీరు ఇలా అప్లై చేసుకోవాలి. https://resident.uidai.gov.in/aadhaar-reprint లోకి వెళ్లాలి. పైన నోట్, వాలిడేషన్ ఆఫ్ ఓటీపీ వివరాలు కనిపిస్తాయి. దానికి కిందభాగాన పర్సనల్ డిటెయిల్స్ అని అడుగుతుంది. ఆధార్ మరో కాపీ కోసం ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (వీఐడీ) అవసరం. ఆధార్ నెంబర్ లేదా వీఐడీ నెంబర్ ఇచ్చాక అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

కుడివైపు భాగాన ఎంటర్ ఓటీపీ అని ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీని అక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలతో కూడిన ఆధార్ కార్డు కనిపిస్తుంది. కింది భాగాన Make Payment మరియు Cancel అని ఉంటుంది. మీరు మరో ఆధార్ కార్డును కోరుతున్నారు కాబట్టి మేక్ పేమెంట్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎలా పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాని వివరాలు అడుగుతుంది. అవి పూర్తి చేశాక pay now అని ఉంటుంది. ఆ మొత్తం పే చేయాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications