ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మినిమం బ్యాలెన్స్ పైన (సేవింగ్స్) ఛార్జీలను సవరించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంకు అకౌంట్‌లో నెలకు కనీసం మొత్తం బ్యాలెన్స్ (AMB) మెయింటెన్స్ చేయకుంటే మెట్రో, అర్బన్ కేంద్రాల్లో నెలకు రూ.50 నుంచి రూ.15కు తగ్గించారు. సెమీ అర్బన్, రూరల్ కేంద్రాల్లో రూ.40 నుంచి రూ.12కు తగ్గించారు. పైన పేర్కొన్న వ్యయాల పైన రూ.10 జీఎస్టీ అదనంగా అప్లికబుల్ అవుతుంది. అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ ఉండాలి. మినిమం బ్యాలెన్స్ లెక్కలు లెక్కలను ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా వేస్తుంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసుకోండి. మినిమం బ్యాలెన్స్ లేదా మంత్లీ యావరేజ్ బ్యాలెస్ ఏమిటి, బ్యాంకులు ఎలా లెక్కిస్తాయో చూడండి.

SBIలో ఏ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే?
ఎస్బీఐ సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే మెట్రో, అర్బన్‌లలో ఛార్జీలు ఇలా ఉంటాయి. ఇక్కడ కనీస మినిమం బ్యాలెన్స్ రూ.3,000.
మినిమం బ్యాలెన్స్ 50% తగ్గితే Rs.30/- +GST Rs. 10/- +GST
మినిమం బ్యాలెన్స్ 50 - 75% వరకు తగ్గితే Rs.40/- +GST Rs. 12/- +GST
మినిమం బ్యాలెన్స్ 75% కంటే తగ్గితే Rs.50/- +GST Rs. 15/- +GST
ఇక, సెమీ అర్బన్ సెంటర్‌లలో మినిమం బ్యాలెన్స్ రూ.2,000.
మినిమం బ్యాలెన్స్ 50% తగ్గితే Rs.20/- +GST Rs 7.50 +GST
మినిమం బ్యాలెన్స్ 50 - 75% తగ్గితే Rs.30/- +GST Rs 10.00 +GST
మినిమం బ్యాలెన్స్ 75% కంటే తగ్గితే Rs.40/- +GST Rs.12.00+GST
గ్రామీణ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ రూ.1,000
మినిమం బ్యాలెన్స్ 50% వరకు తగ్గితే Rs.20/- +GST Rs 5.00 +GST
మినిమం బ్యాలెన్స్ 50 - 75% కంటే తగ్గితే Rs.30/- +GST Rs. 7.50 +GST
మినిమం బ్యాలెన్స్ 75% కంటే తగ్గితే Rs.40/- +GST Rs 10.00 +GST

మెట్రో, అర్బన్ కేంద్రాల్లో
మెట్రో, అర్బన్ కేంద్రాల్లో మినిమం బ్యాలెన్స్ రూ.3వేలు ఉండాలి. ఆ మొత్తం డిపాజిట్ చేస్తే చాలు అనుకుంటారు. కానీ ఆయా బ్యాంకులు లెక్కించే విధానం మరోలా ఉంటుంది. ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.3వేలు మంత్రీ యావరేజ్ బ్యాలెన్స్ ఉండాలి. అంటే నెల రోజుల సగటు లెక్కిస్తే రూ.3వేలు రావాలి.
ఉదాహరణకు ఏదైనా బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ రూ.5వేలు ఉండాలి అనుకుందాం.
సెప్టెంబర్ 1వ తేదీన మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ.4,000 ఉంది అనుకుందాం.
ఆ తర్వాత సెప్టెంబర్ 12వ తేదీన అందులో నుంచి రూ.3,000 విత్ డ్రా చేశారనుకుందాం.
అనంతరం 18వ తేదీన రూ.9,000 డిపాజిట్ చేశారనుకుందాం.
బ్యాంకులు ఇలా లెక్కిస్తాయి. ఆగస్టు 1వతేదీ నుంచి 11వ తేదీ వరకు మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ.4,000 ఉంది. అంటే దానిని రూ.4,000 X 11=44,000గా లెక్కిస్తారు.
12వ తేదీన మీరు రూ.3వేలు విత్ డ్రా చేశారు. కాబట్టి అందులో రూ.వెయ్యి ఉంటుంది. 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 6 రోజులు ఉంటుంది. దీనిని రూ.1,000 X 6=6,000గా లెక్కిస్తారు.
18వ తేదీన రూ.9వేలు డిపాజిట్ చేశారు. దీంతో అంతకుముందు రూ.వెయ్యి, రూ.9వేలు కలిపి పదివేలు అవుతుంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 13 రోజులు ఉంటాయి. అంటే రూ.10,000 X 13=1,30,000గా లెక్కిస్తారు.

ఇలా లెక్కిస్తారు
వీటన్నింటిని కలిపితే 44,000+6,000+1,30,000.. ఈ మొత్తం కలిస్తే 1,80,000 అవుతుంది. దీనిని 30 రోజులకు యావరేజ్ చేస్తారు. అంటే రోజుకు రూ.6,000 అవుతుంది. కనీస నగదు నిల్వ రూ.5వేలు. కానీ ఆ నెలలోని సరాసరి తీస్తే రూ.6వేలుగా ఉంది. కాబట్టి పెనాల్టీ ఉండదు. ఇలా సరాసరి తీసినప్పుడు రూ.5వేల కంటే తక్కువ వస్తే పెనాల్టీ ఉంటుంది.వేర్వేరు బ్యాంకుల్లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూల్స్, సెమీ, అర్బన్, మెట్రో వారీగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications