ఈ-మెయిల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం నెంబర్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఐఆర్‌సీటీసీ... ఇలా మనం ఎన్నింటికో లాగిన్ పాస్‌వర్డ్స్ గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో చాలామంది తమ పాస్‌వర్డ్ మరిచిపోతారు. పాస్ వర్డ్స్ రికవరీలేదా రీసెట్టింగ్ పెద్ద విషయమేమీ కాదు. కానీ యూజర్ ఐడీ రికవరీ మాత్రం కాస్త సంక్లిష్టమైనదే. IRCTC లాగిన్ ఐడీ మరిచిపోతే మూడు సులభమైన స్టెప్స్ ద్వారా తిరిగి పొందవచ్చు.
మీరు మీ IRCTC లాగిన్ ఐడి మరిచిపోతే, టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు మరో ఐడీని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Forgot User ID అనే ఫీచర్ ద్వారా మీరు పోగొట్టుకున్న మీ ఐడీని రికవరీ చేసుకోవచ్చు. ఓసారి మీరు ఐడీ పొందాక.. పాస్‌వర్డ్ మరిచిపోయిఉంటే అది కూడా మార్చుకోవచ్చు.

IRCTC లాగిన్ ఐడీ ఇలా పొందండి.
- IRCTC అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. Login పైన క్లిక్ చేయండి.
- కనిపించే డైలాగ్ బాక్సులో Forgot user ID పైన క్లిక్ చేయండి.
- కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఈ-మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, కాప్చా కోడ్ ఎంటర్ చేయండి. అడిగిన సమాచారం నింపండి. ఆ తర్వాత సబ్‌మిట్ పైన క్లిక్ చేయండి.
మీ యూజర్ ఐడీ ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు. దీంతో IRCTC అకౌంట్‌కు లాగిన్ అవండి. మళ్లీ మీరు ఎప్పుడైనా మరిచిపోయినా మీ మెయిల్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది.
నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్నారై)లు కూడా దీంతో ట్రెయిన్ టిక్కెట్ బుకింగ్, హోటల్స్, హాలీడే ప్యాకేజీ, ప్లైట్ టిక్కెట్, ఈ-కేటరింగ్ సర్వీసులు, టూరిస్ట్ ట్రెయిన్ టిక్కెట్స్, చార్టర్ ట్రెయిన్లు బుక్ చేసుకోవచ్చు. వీరికి నామినల్ ఫీజుగా రూ.100 వసూలు చేస్తుంది.


Click it and Unblock the Notifications