ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డుతో డబ్బులు తీస్తున్నారా? అయితే మీరు అప్పు తీసుకున్నట్లే
కొంతమంది క్రెడిట్ కార్డు వినియోగదారులు ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేస్తారు. కానీ ఇది ఫ్రీ కాదని తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు ద్వారా మీరు మనీ డ్రా చేస్తున్నారంటే మీరు అప్పు తీసుకుంటున్నట్లే లెక్క. అంటే ఓ విధంగా షార్ట్ టర్మ్ లోన్. కాబట్టి క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీయకపోవడమే మంచిది. అన్ని క్రెడిట్ కార్డుల్లో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండదు. కానీ కొన్నింటికి ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ దీంతో డబ్బు తీసుకుంటే అప్పు కిందకు వస్తుంది.
క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే బ్యాంకులు చార్జీలను వసూలు చేస్తాయి. ప్రతి విత్ డ్రాకు చార్జీలు 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటాయి. క్రెడిట్ కార్డు క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్ కింద రూ.300 నుంచి రూ.500 వసూలు చేస్తాయి. తీసుకున్న మొత్తం పైన వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. విత్ డ్రా వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. క్యాష్ విత్ డ్రాపై ఎలాంటి వడ్డీ మినహాయింపు కాలవ్యవధి ఉండదు. అంటే నగదు తీసుకున్నప్పటి నుంచే వడ్డీ మొదలవుతుంది.

బ్యాంకులు లేట్ పేమెంట్ చార్జీలు కూడా వసులు చేస్తాయి. డ్యూ డేట్ లోగా చెల్లించకుంటే ఈ చార్జీలు వర్తిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ 2.5 శాతం లేదా రూ.300 ట్రాన్సాక్షన్ ఫీజుగా వసూలు చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.5 శాతాన్ని కనీసం రూ.300 క్యాష్ అడ్వాన్స్ ఫీజుగా వసూలు చేస్తుంది. కాబట్టి డెబిట్ కార్డుతో తప్పితే, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు తీసుకోకపోవడం మంచిది. క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు తీస్తే క్యాష్ అడ్వాన్స్ అవుతుంది. దీనికి అధిక మొత్తంలో ఫీజు ఉంటుంది.


Click it and Unblock the Notifications