పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా? ఇప్పటికే పలుమార్లు దీనిపై పొడిగింపు ఇచ్చారు. ఇటీవల 2019 మార్చి 31వ తేదీ వరకు గడువు ఉండగా, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఇక మళ్లీ పొడిగించే అవకాశాలు దాదాపు ఉండవని గుర్తుంచుకోండి. ఈ గడువు లోగా ఈసారి లింక్ చేసుకోకుంటే కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. లింక్ చేయకుంటే మీ పాన్ కార్డు పని చేయకపోవచ్చు కూడా. ఐటీఆర్ ప్రాసెస్ కాదు. అంతేకాదు, ఏ బ్యాంక్ అయినా రూ.50వేలకు పైగా ట్రాన్సాక్షన్లు కుదరకపోవచ్చు.

జూలై 30లోగా చేయకుంటే ఐటీఆర్ ఫైల్ చేయలేరు
దాదాపు 20 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో లింక్ చేయలేదని తెలుస్తోంది. కేంద్రం 44 కోట్ల పాన్ కార్డులు జారీ చేసింది. అంటే కేవలం 24 కోట్ల మంది మాత్రమే లింక్ చేసుకున్నారు. ఈసారి సెప్టెంబర్ 30వ తేదీలోపు లింక్ చేయకుంటే డీయాక్టివేట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లింక్ చేయని వాటిల్లో కొన్ని బోగస్ లేదా డూప్లికేట్ ఉండవచ్చునని చెబుతున్నారు. కొంతమంది తెలిసో, తెలియకో డూప్లికేట్ పాన్ కార్డులు తీసుకున్న వారు కూడా ఉన్నారు. దీంతో వారు ఒకటే లింక్ చేసుకుంటారు. మిగతా దానిని రద్దు చేస్తారు. చాలామంది పన్ను ఎగవేసేందుకు డూప్లికేట్ కార్డులు తీసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి. పాన్ - ఆధార్ లింక్‌కు ఇది కూడా కారణమే. మరోవైపు, 2019-20 ఐటీఆర్‌ను ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. పాన్ - ఆధార్ లింక్‌కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉన్నప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేసేవారు లింక్ చేయకుంటే మాత్రం (జూలై 31 లోగా) దానిని ఫైల్ చేయలేరు. ఆలస్య రుసుముతో సెప్టెంబర్ వరకు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.

ఇలా లింక్ చేసుకోండి
ఆధార్ - పాన్ కార్డును వివిధ మార్గాల్లో లింక్ చేసుకోవచ్చు.
- https://www.incometaxindiaefiling.gov.in/home ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఆధార్ లింకింగ్ ఓపెన్ చేసి, అక్కడ అడిగిన వివరాలు ఇవ్వాలి. ఆధార్ నెంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.
- ఇతర సులభ మార్గాల్లోను లింక్ చేసుకోవచ్చు. ఒక్క ఎస్సెమ్మెస్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. 567678 లేదా 56161 కు ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లింక్ చేసుకోవచ్చు. UIDPAN<12 Digit Aadhaar> <10 Digit PAN> ఎస్సెమ్మెస్ చేసి లింక్ చేసుకోండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఇది చేయాలి. మీరు పంపినట్లుగా మెసేజ్ వస్తుంది. కొన్ని రోజులకు లింక్ అయినట్లు కన్‌ఫర్మ్ చేస్తారు.
- ఈ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలోను లింక్ చేసుకోవచ్చుు. పాన్ - ఆధార్ లింక్‌కు ఆదాయపన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది. పాన్ కార్డు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లు లేదా మార్పులు చేసుకునే వాళ్లు ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది.

ఆధార్ - పాన్ లింక్ స్టేటస్
మీ పాన్ కార్డు - ఆధార్ లింక్ అయిందా తెలుసుకోవడం సులభమే. మీ దగ్గర పాన్ కార్డు, ఆధార్ నెంబర్ ఉంటే చాలు. https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html
లోకి వెళ్లి మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ లింక్ స్టేటస్ తెలిసిపోతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications