రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ పెన్షన్ స్కీం మీకోసమే?: పూర్తి వివరాలు

అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ - పీఎంఎస్‌వైఎం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిని అర్హులైన వారు సద్వినియోగం చేసుకుంటే లబ్ధి చేకూరుతుంది. కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం దీనిని తీసుకు వచ్చింది. పీఎంఎస్‌వైఎం స్కీంలో ఏప్రిల్ నెలాఖరు వరకు 1 కోటిమంది చేరుతారని కేంద్రం భావిస్తోంది.

ఎక్కడ ఎన్‌రోల్ చేసుకోవాలి?

ఎక్కడ ఎన్‌రోల్ చేసుకోవాలి?

ఇప్పటికే 25.36 లక్షల మంది ఇందులో చేరారని, నెలకు లక్షమందికి పైగా చేరుతారని అంచనా ఉందని, కాబట్టి ఏప్రిల్ చివరి నాటికి ఈ సంఖ్య కోటి వరకు ఉంటుందని భావిస్తున్నామని సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీఎస్సీ-ఎస్పీవీ) సీఈవో దినేష్ త్యాగి ఇటీవల తెలిపారు. సీఎస్సీ-ఎస్పీవీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నడుస్తున్న కామన్ సర్వీసెస్ సెంటర్‌లలో (సీఎస్సీ - ఈసేవా కేంద్రాలు) పీఎంఎస్‌వైఎంకి సంబంధించి ఎన్‌రోల్‌మెంట్స్ జరుగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 3.19 కోట్ల సీఎస్సీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 2.99 కోట్ల కేంద్రాలలో ఎన్‌రోల్ చేసుకుంటున్నారు. ఈ పథకం 15 ఫిబ్రవరి 2019 నుంచి అమలులోకి వచ్చింది. రోజుకు లక్ష మంది, అంతకంటే ఎక్కువ మంది ఎన్‌రోల్ చేసుకుంటున్నారని, ఇది రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 5 కోట్ల మంది పీఎంఎస్‌వైఎం పథకం కింద ఎన్‌రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ పథకం కింద నమోదు కోసం అందర్నీ జాగృతం చేస్తున్నామన్నారు. అలాగే, సీఎస్సీ ఎస్పీవీ ఉద్యోగులు కూడా డొమెస్టిక్ వర్కర్స్, హెల్పర్స్‌ను చేర్పించేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

 ఎంత చెల్లించాలి, కేంద్రం ఎంత జమ చేస్తుంది?

ఎంత చెల్లించాలి, కేంద్రం ఎంత జమ చేస్తుంది?

18 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ మధ్య వయస్సుగల వారు ఎవరైనా పీఎంఎస్‌వైఎం పథకం కింద తమ పేరును నమోదు చేసుకోవచ్చునని దినేష్ త్యాగి తెలిపారు. ఇందులో నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాలని చెప్పారు. 18 ఏళ్ల వయస్సుకు రూ.55 చెల్లిస్తే, 40 ఏళ్లు వచ్చే వరకు రూ.200 చెల్లించాలన్నారు. మీరు అలా చెల్లించిన మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తం జత చేస్తుందని తెలిపారు. రానున్న అయిదేళ్లలో ఈ పథకం కింద మొత్తం 10 కోట్ల మంది వర్కర్స్ ఎన్‌రోల్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ సీఎస్సీ ఎస్పీవీ ముందు ఓ సమస్య ఉందని, అసంఘటిత కార్మికులకు సంబంధించి కచ్చితమైన డేటా బేస్ లేదన్నారు. అందుకే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డేటా సేకరిస్తున్నామన్నారు.

 ఎవరు అర్హులు?

ఎవరు అర్హులు?

ఈ పథకానికి వీధి వర్తకులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలీలు, ఇటుక బట్టీల కార్మికులు, చర్మకారులు, చెత్తను ఏరేవారు, ఇళ్లలో పని చేసేవారు, రజకులు, రిక్షా కార్మికులు, భూమిలేని పేదలు, వ్యవసాయ కూలీలు, బీడీ, చేనేత కార్మికులు, కుమ్మరి, టైలర్, ఆటో, రిక్షాలు సహా ప్రయివేటు డ్రైవర్లు, వివిధ చేతి వృత్తులతో స్వయం ఉపాధి పొందుతున్న వర్గాలు, కుల ఇతరకార్మికులు అందరూ పీఎంఎస్‌వైఎం పథకంలో చేరవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు గల అసంఘటిత రంగ కార్మికులు మాత్రమే అర్హులు. ఇందులో చేరిన కార్మికులు వయస్సును అనుసరించి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాలి. 60 ఏళ్ల వచ్చేవరకు చెల్లిస్తే ఆ తర్వాత ప్రతినెలా రూ.3వేల పెన్షన్ వస్తుంది. నెలసరి ఆదాయం రూ.15వేల లోపు ఉండాలి.

 ఏం సమర్పించాలి?

ఏం సమర్పించాలి?

ఇందులో ఎన్‌రోల్ చేసుకునేందుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీం ఎంతో ప్రయోజనకరం. వృద్ధాప్యంలో అసంఘటిత కార్మికులను ఆదుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అర్హులు అందరూ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రీమియం చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+