ఇప్పుడు క్రెడిట్ కార్డులు చాలామంది వద్ద ఒకటికి మించి ఉంటున్నాయి. క్రెడిట్ కార్డులు ఉపయోగించి వివిధ కారణాల వల్ల వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకుండా క్రెడిట్ స్కోర్ తగ్గించుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఇలా జరిగినప్పుడు అత్యవసర సమయంలో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు క్రెడిట్ స్కోర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్లాన్‌గా ఉఫంటే క్రెడిట్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు.

క్రెడిట్ స్కోరు బాగుంటే లాభాలు ఏమిటి?
క్రెడిట్ స్కోర్‌ను మెరుచుపరుచుకున్నంత మాత్రాన ప్రత్యేక బహుమతులు, ప్రోత్సాహకాలు ఉండవు. కానీ మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీ వ్యక్తిగత రుణానికి, గృహ రుణ దరఖాస్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, మంచి రుణ రేట్లు కూడా పొందవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే ఇంటి రుణాలను అందిస్తాయి. ప్రస్తుతం ఉన్న రుణానికి టాపప్ రుణం కూడా అందిస్తుంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీ రుణాన్ని ప్రస్తుత రుణ సంస్థ నుంచి మరొక రుణ సంస్థకు సులభంగా బదలీ చేసుకోవచ్చునని చెబుతున్నారు. అలాంటి క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ప్లాన్ ఉండాలి. ఇందుకు కొన్ని సూచనలు పాటించాలి.

ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం
మీ క్రెడిట్ స్కోర్ బాగుండాలంటే సకాలంలో చెల్లింపులు ఉండాలి. క్రెడిట్ స్కోర్ లెక్కించేందుకు అనేక సాధనాలు ఉన్నాయి. వినియోగదారుడికి ఉన్న రుణాల సంఖ్య, అతని క్రెడిట్ హిస్టరీ, ఎన్ని రుణాలు కలిగి ఉన్నాడు, వాటి హిస్టరీలను చూస్తారు. కానీ అన్నింటి కంటే ముఖ్యమైనది సకాలంలో చెల్లింపులను చూస్తారు. ఒకవేళ మీరు రుణాలు సకాలంలో చెల్లించకుంటే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు ఈ నెల చెల్లించాల్సిన వాటిని తదుపరి నెలలో చెల్లించినప్పటికీ ఆలస్యంగా చెల్లింపు చేసినందుకు బ్యాంకు మీ వాయిదాల నుంచి ఛార్జీలు వసూలు చేస్తుంది. చాలా ఇన్‌స్టాల్మెంట్లలో ఆటోమేటెడ్ లేదా పోస్ట్ డేటెడ్ చెక్కుల ద్వారా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి ప్రతి తదుపరి నెల మీరు తక్కువ మొత్తాన్ని చెల్లించినట్లవుతుంది. ఎక్కువ సంఖ్యలో రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా క్రెడిట్ స్కోర్ పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి దానిని క్రెడిట్ బ్యూరోకి పంపిస్తారు. అక్కడ మీ దరఖాస్తు నమోదవుతుంది. రుణాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రుణం కోసం పలు సంస్థలను సంప్రదించడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. పలు సంస్థలను సంప్రదించి, వడ్డీ రేట్లను సరిచూసుకొని అఫ్పుడు దరఖాస్తు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే, కార్డును ఎంత ఎక్కువగా వినియోగిస్తే అంత ఎక్కువ రివార్డు పాయింట్లు వస్తాయి. కాబట్టి మీరు కార్డును దేని కోసం ఎక్కువగా వినియోగిస్తారో చూసుకొని ఆ కార్డును ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే కార్డులను బట్టి కూడా ప్రోత్సాహకాలు మారే అవకాశాలు ఉంటాయి.

స్కోర్ తగ్గకుండా కార్డులు ఇలా వాడండి
ప్రస్తుతం రకరకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణం చేసేవారు ట్రావెల్ కార్డులు కూడా తీసుకోవచ్చు. దీని వల్ల విమాన టిక్కెట్ల బుకింగ్, హోటళ్ల గది అద్దెలో రాయితీ లభిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఎక్కువగా కొనుగోలు చేసేవాళ్లు క్యాష్ బ్యాక్ అధికంగా ఇచ్చే కార్డులను ఎంపిక చేసుకోవాలి. మనం సరైన కార్డును ఎంచుకోవాలి. ఎక్కువగా ఏ లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తామో దానికి సరిపోయే కార్డును తీసుకోవడం మంచిది. ఎక్కువ కార్డులు తీసుకున్నప్పుడు వాటిని ప్లాన్ ప్రకారం ఉపయోగించాలి. ఖర్చు చేసే సమయంలో బిల్లు తేదీలను జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ బిల్లు చెల్లింపులో ఆలస్యం జరిగితే కార్డులు భారీగా పెనాల్టీ వేస్తాయి. చెల్లించాల్సిన బిల్లుపై వడ్డీతో పాటు కొత్త కొనుగోళ్ల పైన కూడా రుసుము ఉంటుంది. కాబట్టి మీ లక్ష్యం మనం ఖర్చు చేసిన బిల్లుకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించే పరిస్థితి రావొద్దు. బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. దీని వల్ల రుసుముల భారం తగ్గుతుంది. క్రెడిట్ స్కోర్ పైన కూడా ప్రభావం ప్రతికూలంగా ఉంటదు. అలాగే, కార్డు పరిమితి, దానిని ఎంత మేరకు ఉపయోగిస్తున్నారనే అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ప్రతి నెల కార్డు పరిమితి మొత్తం వాడకపోవడం బెట్టర్ అని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప సగంలోపు వాడటం బెట్టర్. క్రెడిట్ స్కోర్ పెరగాలంటే సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించాలి. అప్పుడు మీకు అప్పుపై పెద్దగా ఆసక్తి లేదని బ్యాంకులు గుర్తిస్తాయి. ఇలా ఉంటే అవసరమైనప్పుడు వెంటనే అప్పు దొరుకుతుంది. అలాగే, హామీగా ఉన్న వ్యక్తుల ఖాతాలను, సంయుక్తంగా నిర్వహించుకునే ఖాతాలను అప్పుడప్పుడు పరిశీలించాలి. వారు సరైన సమయంలో రుణాలు చెల్లించకుంటే ఆ ప్రభావం హామీదారుపై కూడా ఉంటుంది. మీరు ఒక్క వాయిదా సకాలంలో చెల్లించకున్నా మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..



Click it and Unblock the Notifications