For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం మారుతున్నారా అయితే పీఎఫ్ అమౌంట్ ఎలా?

చాలా మంది ఉద్యోగం మారగానే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను తీసేసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పీఎఫ్ నిధిని ముట్టుకోకుండా, వేరే ఉద్యోగంలో చేరిన తర్వాత కొత్త కంపెనీ పీఎఫ్ ఖాతాకు బదిలీ చేసుకోవడం చాలా ఉత్తమం.

By bharath
|

చాలా మంది ఉద్యోగం మారగానే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను తీసేసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పీఎఫ్ నిధిని ముట్టుకోకుండా, వేరే ఉద్యోగంలో చేరిన తర్వాత కొత్త కంపెనీ పీఎఫ్ ఖాతాకు బదిలీ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రస్తుతం పీఎఫ్ నిబంధనల ప్రకారం ఐదేళ్లలోపు పీఎఫ్ సొమ్మును ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని ఆదాయంగా పరిగణించి ఆదాయపు పన్ను చెల్లించాలి.

అప్పటివరకూ తీసుకున్న ఆదాయపు పన్ను మినహాయింపులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత కంపెనీలో మీరు ఐదేళ్లకు మించి పని చేశారనుకుందాం. పీఎఫ్ నిధి కింద రూ. 10 లక్షలు వచ్చిందనుకుందాం. ఇలాంటప్పుడు మీరు ఉద్యోగం మానేస్తే మీకు వచ్చిన పీఎఫ్ సొమ్మును ఏయే మార్గాల్లో మదుపు చేస్తే మంచిదో చూద్దాం.

పీఎఫ్ కొనసాగించడమే మేలు

పీఎఫ్ కొనసాగించడమే మేలు

సాధారణంగా ఉద్యోగాలు చేసే వారు ఇన్‌కమ్ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు గాను రుణం తీసుకుంటుంటారు. మీకు అలాంటి రుణాలు ఏమైనా ఉంటే ముందుగా వాటిని తీర్చేయాలి. దీంతో పాటు 13 శాతం వడ్డీతో వ్యక్తిగత రుణం ఉంటే వెంటనే ఆ రుణాన్ని కూడా తీర్చేయండి.

ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ

ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ

ఇక ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ దాదాపు 10 శాతం కంటే ప్రావిడెండ్ ఫండ్ నిల్వపై వచ్చే వడ్డీ 8.7 శాతం తక్కువ. కాబట్టి ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ రుణాన్ని తీర్చకుండా పదవీ విరమణ తర్వాత ప్రావిడెండ్ ఫండ్‌ను కొనసాగించడం మంచిది.

వయసు పైబడిన వారు

వయసు పైబడిన వారు

ముఖ్యంగా వయసు పైబడిన వారు చేయాల్సిన పని. మీ పీఎఫ్ నగదుని మ్యూచువల్ ఫండ్స్‌లోని బాండ్ పథకాల్లో మదుపు చేస్తే మంచిది. వీటి నుంచి ప్రతినెలా కొంత మొత్తం ఈక్విటీ ఫండ్లలోకి ఎస్‌టీపీ ద్వారా మళ్లించండి. ఇలా చేయడం వల్ల ప్రావిడెంట్ ఫండ్‌లో వచ్చే 8.7 శాతం రాబడి కంటే దీర్గకాలంలో ఈక్విటీ మ్యూచవల్ ఫండ్‌లో ఎక్కువ రాబడి పొందే వీలుంది.

కొత్తగా వ్యాపారం

కొత్తగా వ్యాపారం

కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి బదులు మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటే మాత్రం పీఎఫ్‌ సొమ్మును ఈక్విటీలో మదుపు చేయండి. కాదు వ్యాపారమే చేయాలనుకుంటే మాత్రం పీఎఫ్ సొమ్మును సురక్షిత పథకాల్లో ఉంచుకొని అవసరానికి వ్యాపారంలో వినియోగించుకునేలా చేసుకోండి.

Read more about: pf money employee పీఎఫ్
English summary

ఉద్యోగం మారుతున్నారా అయితే పీఎఫ్ అమౌంట్ ఎలా? | Can I withdraw my PF after changing job?

After resigning from a job many individuals do not get their PF balance transferred from the previous employer to the new employer or do not withdraw the balance.
Story first published: Wednesday, February 13, 2019, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X