స్వల్పకాలిక రుణ నిధి అనేది ఆసక్తి గల వ్యక్తులు తమ పెట్టుబడులను స్పల్ప కాలానికి సంస్థలలో పెట్టుబడి పెట్టే ఒక అవకాశం.
స్వల్పకాలిక రుణ నిధి అనేది ఆసక్తి గల వ్యక్తులు తమ పెట్టుబడులను స్పల్ప కాలానికి సంస్థలలో పెట్టుబడి పెట్టే ఒక అవకాశం. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ద్వారా మూడు సంవత్సరాలకు లోబడి పెట్టుబడి పెట్టిన పెట్టుబడులపై వచ్చే ఆదాయమే స్వల్పకాలిక రుణ నిధులు అనవచ్చు. స్వల్పకాలిక రుణ నిధులను బ్యాంకు పత్రాలు (డిపాజిట్ సర్టిఫికేట్), కార్పొరేట్ పేపర్, ప్రభుత్వ పత్రాల ద్వారా పెట్టుబడిగా పెట్టవచ్చును.

వడ్డీ రేటులో మార్పులు
స్వల్పకాలిక రుణ నిధి పెట్టుబడులలో వచ్చే వడ్డీ రేటులో స్వల్ప మార్పులు ఉంటాయి. రుణ సిద్ధాంతం ప్రకారం మార్కెట్ రుణ విలువ తగ్గితే వడ్డీ రేటు పెరుగుతుంది. అలాగే రుణ విలువ పెరిగితే వడ్డీ రేటు తగ్గుతుంది. దీంతో స్వల్పకాలిక రుణ నిధిపై మార్కెట్ వడ్డీ రేటు వల్ల ప్రభావతమవుతుందని చెప్పుకోవచ్చు.
తక్కువ సున్నితత్వం కలిగిన స్వల్ప కాలిక నిధిపై ఇంటరెస్ట్ రేట్లు, భద్రత, స్థిరమైన లాభాలు రావడం అనేది ఉంటుంది.

ఫ్లెక్సిబిలిటీ
ఇలాంటి స్వల్ప కాలిక రుణ నిధులను తమకు అనుకూలంగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. ఫిక్సిడ్ డిపాజిట్ల కంటే కూడా స్వల్పకాలిక రుణ నిధుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువగా వడ్డీ రేటును పొందవచ్చు.

టాక్స్ ఎఫిసియంట్
ఏడాదికిపైగా పొందే సల్పకాలిక రుణ నిధుల పెట్టుబడులపై తక్కువ స్థాయిలో పన్ను విధించడం జరుగుతుంది. బ్యాంకులలోని ఫిక్సిడ్ డిపాజిట్లతో పోలిస్తే తక్కువ పన్నుల భారం ఉండే అవకాశం ఉంటుంది.

రిస్క్
సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో మార్పులు స్వల్ప కాలిక రుణ నిధి పెట్టుబడులపై కూడా ఉంటాయి. ఈ మార్పుల కారణంగా వడ్డీ రేట్ల రూపంలో వచ్చే ఆదాయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ రిస్క్
కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకునేందుకు తాము జారీ చేసిన స్వల్ప కాలిక రుణ నిధుల పెట్టుబడులపై తిరిగి పొందే ఆదాయాలలో కూడా తేడాలుంటాయి. కంపెనీలకు పెట్టుబడులు అత్యధిక లాభాలు చేకూర్చితేనే తమ పెట్టుబడులకు పెట్టుబడిదారులు లాభాలను పొందే అవకాశం ఉంటుంది లేదా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడిదారులు కంపెనీ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుని పెట్టుబడి చేస్తే లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

ద్రవ్యోల్బణ రేటు రిస్క్
తక్కువ కాలానికి అంటే 2 నుంచి 3 సంవత్సరాలకు సంబంధించిన పెట్టుబడి కావడం వల్ల తక్కువ స్థాయిలోనే లాభాలు ఉంటాయి. స్వల్పకాలిక రుణ పెట్టుబడి నిధులపై ద్రవ్యోల్బణం కూడా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా దీర్ఘ కాలంలో ఎక్కువ మొత్తంలో లాభాలను పెట్టుబడిదారుడు ఆర్జించే అవకాశం ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications