For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాపారంలో విజయం సాధించాలి అంటే ఇలా చేయండి.

By girish
|

సొంతంగా, కొత్త‌గా వ్యాపారాన్ని ప్రారంభించ‌డాన్నే ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌గా పిలుస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా కెరీర్‌ను ప్రారంభించ‌డంతోనే మొత్తం ప‌ని పూర్త‌యిన‌ట్టు లెక్క కాదు. వాస్త‌వానికి 25శాతమే ప‌ని పూర్త‌యిన‌ట్టు నిపుణులు చెబుతారు.

వ్యాపారాన్ని

వ్యాపారాన్ని

ఇంకా ఈ ప్ర‌యాణంలో ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అస‌లు కొత్త‌గా వ్యాపారం ప్రారంభించే ముందే ఎన్నో సందేహాలు, ఎన్నెన్నో ఒడిదొడుకులు. వ్య‌య‌ప్ర‌యాస‌లకోర్చి తీరా వ్యాపారాన్ని ప్రారంభించాక మీరేంటి 25శాతం ప‌నే పూర్త‌యింద‌ని చెబుతారు అంటారా?

ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా

ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా

ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి నిల‌దొక్కుకునేందుకు ఎన్నో రంగాల్లో ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారం ప‌ట్ల మీ ధోర‌ణి, మీ బిజినెస్ మోడ‌ల్‌, టీమ్‌లో ప‌నిచేసే స‌భ్యులు, మార్కెట్ స్ట్రాటెజీ ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయి. ఇది బ‌య‌ట ప్ర‌భావం చూపే అంశాలు. ఇక అంత‌ర్గ‌తంగా 5 ప్ర‌ధాన మార్గాల్లో నాణ్య‌త‌ను మెరుగుప‌ర్చుకుంటే ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా జీవితం చ‌క్క‌గా సాగి విజ‌యాల ప‌రంప‌ర‌ను కొన‌సాగించ‌గ‌లుగుతాం

అంశాల‌పై

అంశాల‌పై

ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా నిల‌దొక్కుకొని విజ‌యం సాధించేందుకు అయిదు అంశాల‌పై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 బిజినెస్ మోడ‌ల్‌

బిజినెస్ మోడ‌ల్‌

మీ బిజినెస్ మోడ‌ల్‌పై పూర్తి ప‌ట్టు సాధించేందుకు దాని ప‌రిమాణం తెలుసుకోవ‌డంతోపాటు మీ శ‌క్తిపైనా ఓ అంచనాకు రండి. ఇక్క‌డ మీ నైపుణ్యాల‌కు పెద్ద పీట వేయ‌వ‌చ్చు. స‌మ‌స్య‌లొస్తే ఏ విధంగా ఎదుర్కొంటారన్న‌ది ముఖ్యం. దాంతో పాటు మీకు వాటిని ఎదుర్కోగ‌ల ధైర్యంపై న‌మ్మ‌కం ఉండి తీరాలి. దీర్ఘ‌కాలంపాటు ఈ శ‌క్తి ఉండాలి. అప్పుడే మీ వ్యాపారానికి ఇది స‌హ‌క‌రిస్తుంది. పూర్తి న‌మ్మ‌కం ఏర్ప‌డే దాకా ప‌ట్టు వీడ‌కూడ‌దు. అంతిమ ల‌క్ష్యం సాధిస్తామ‌నే న‌మ్మ‌కం, అందుకు త‌గిన ధైర్యం, శ‌క్తి ఉంటేనే వ్యాపారంలో విజ‌యం సాధ్య‌మ‌వుతుంది.

దృఢ‌మైన సంక‌ల్పం :

దృఢ‌మైన సంక‌ల్పం :

ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించాలంటే దృఢ‌మైన సంకల్పం ఉండి తీరాల్సిందే. దానికి మీరెంత‌గా క‌ట్టుబ‌డి ఉంటే అంత తొంద‌ర‌గా విజ‌యాలు సాధించ‌గ‌లుగుతారు. అకుంఠిత దీక్ష‌తో ప‌నిచేస్తే వ్యాపారం సులువుగా మీ వ‌శ‌మ‌వుతుంది. స‌వాళ్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవాలంటే బ‌ల‌మైన సంక‌ల్పంతో పాటు భావోద్వేగాల‌ను కంట్రోల్ చేసుకునేలా ఉండాలి.

ఒకేదానిపై దృష్టి:

ఒకేదానిపై దృష్టి:

బిజినెస్ మోడ‌ల్‌ను నిర్ణ‌యించుకున్నాక ఆ ఒక్క‌దానిపైనే దృష్టి సారిస్తే మంచిది. వ్యాపారంలో మంచి వృద్ధి సాధించేందుకు వ్య‌క్తిగ‌తంగా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఎన్నో త్యాగాల‌ను చేయాల్సి రావొచ్చు. కొంద‌రు వ్యాపారానికి ప్ర‌త్యామ్నాయంగా ప్లాన్ బి ఉండాల‌ని చెబుతారు. అంటే ఈ వ్యాపారం చేస్తూ మ‌రో వ్యాపారం చేయడమో లేదా ఉద్యోగ‌మో లేదా వృత్తి నిర్వ‌హ‌ణో ఉండాలంటారు. నిజంగా వ్యాపారంలో స‌ఫ‌లం కావాలంటే మాత్రం ప్లాన్ బి అక్క‌ర్లేదు. అది మీ ఫోక‌స్‌ను దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంటుంది.

న‌మ్మ‌కమైన వారితో ఉండండి:

న‌మ్మ‌కమైన వారితో ఉండండి:

ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా ప్ర‌యాణం బాగా చాలెంజింగ్‌గా ఉంటుంది. ప్ర‌యాణంలో తోడుగా ఎవ‌రూ ఉండ‌క‌పోవ‌చ్చు. చాలా సంద‌ర్భాల్లో ఒంట‌రిగానే వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఒక్కోసారి చాలా లోన్లీగా అనిపించి మీకున్న ఎన‌ర్జీ కూడా త‌గ్గుతూ ఉన్న‌ట్టుగా క‌నిపిస్తుంది. న‌మ్మ‌క‌మైన వారిని గుర్తించ‌డం వ‌ల్ల దీనికి ప‌రిష్కారాన్ని క‌నుక్కోవ‌చ్చు. వారు మీలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపి ఎల్ల‌వేళ‌లా ప్రోత్స‌హిస్తుంటారు. అలాంటి వారితో ట‌చ్‌లో ఉంటే మీకు బూస్టింగ్ వ‌స్తుంది. వ్యాపార నిర్వ‌హ‌ణ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో ఉంటే మీకు చేయూత‌నందించ‌గ‌ల‌రు. స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌డంలో మీకు చేదోడువాదోడుగా ఉంటారు.

ఆర్థిక నైపుణ్య త‌త్వం:

ఆర్థిక నైపుణ్య త‌త్వం:

బ‌ల‌మైన ఎమోష‌న్, ఫోక‌స్‌, నాలెడ్జ్‌, న‌మ్మ‌క‌మైన వారితో స‌ఖ్య‌త ఇవ‌న్నీ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా మీ జ‌ర్నీ చ‌క్క‌గా సాగేందుకు ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. వ్యాపారం నిల‌దొక్కుకోవాల‌న్నా, వృద్ధి ప‌థంలో న‌డ‌వాల‌న్నా ఇవి ముఖ్య‌మే. అయితే బ‌ల‌మైన ఆర్థిక ప్ర‌ణాళిక లేక‌పోతే ఎన్ని ఉన్నా దండ‌గే. ఆర్థిక‌ప‌రమైన నిర్వ‌హ‌ణ‌కు చ‌క్క‌ని నైపుణ్యాలు ఉండితీరాలి. వ్యాపారానికి స‌రిపోయే ఆర్థిక ప్ర‌ణాళిక‌, దానిని అమ‌లుప‌రిచే నైపుణ్యం సొంతం చేసుకోవ‌డం ముఖ్యం. ప్ర‌ణాళిక వేసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో దాన్ని ప‌క్కాగా అమ‌లు చేసే విధానం తెలిసి ఉండాలి. ప్ర‌ణాళిక వేయ‌డంలో దిట్ట అని ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని అమ‌లుప‌రిచే విధానం సులువుగా ఉన్న‌ప్పుడే.

Read more about: business
English summary

వ్యాపారంలో విజయం సాధించాలి అంటే ఇలా చేయండి. | Tips to Get Success in Business

On its own, the new business will start to be called entrepreneurship. The whole work is not counted as the entrepreneurial career starts. In fact, experts say that 25 percent work is complete.
Story first published: Tuesday, November 13, 2018, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X