పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మిస్సవకండి.

By girish
Subscribe to GoodReturns Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    సాధార‌ణంగా డ‌బ్బు దాచుకోవ‌డానికి మ‌నం బ్యాంకు ఖాతాల వైపే మొగ్గుచూపుతాం. కావాల్సిన‌ప్పుడ‌ల్లా డ‌బ్బు తీసుకునే వీలు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్‌, ఏ శాఖ‌లోనైనా డిపాజిట్ చేసే వీలుండ‌టం వంటి కార‌ణాల రీత్యా బ్యాంకులంటే అంద‌రికీ అంత ఆస‌క్తి. అయితే ప్ర‌స్తుతం క్ర‌మంలో ఒక ప‌రిమితి దాటి డిపాజిట్లు, విత్‌డ్రాయ‌ల్స్ చేసినా బ్యాంకులు రుసుములు విధించేందుకు సిద్ద‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా 1ల‌క్షా 50 వేల శాఖ‌లు క‌లిగిన పోస్టాఫీసు ఖాతాను మాత్రం చాలా మంది మ‌రిచిపోతున్నారు. త్వ‌ర‌లో చాలా చోట్ల పోస్టాఫీసు ఏటీఎమ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. పోస్టాఫీసు పొదుపు ఖాతా ఉంటే సౌక‌ర్య‌వంతంగా ఉండ‌టంతో పాటు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అవేంటో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

    ఖాతాను

    ఖాతాను

    భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరిచి బ్యాంకు ఖాతాలవలే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కేవలం 20 రూపాయలతో ఖాతాను తెరవచ్చు. చెక్ సదుపాయం లేకుండా అయితే కనీసం 50 రూపాయలు నిల్వ ఉంచితే చాలు. అదే చెక్ సదుపాయం కావాలనుకుంటే ఖాతాలో కనీసం 500 రూపాయలు ఎప్పుడూ నిల్వ ఉంచాలి.

    పోస్టాఫీసు శాఖ‌కు

    పోస్టాఫీసు శాఖ‌కు

    మూడేళ్లలో కనీసం ఓ లావాదేవీ అయినా ఉండాలి. లావాదేవీ లేని ఖాతాలను నిష్క్రియాప‌ర‌మైన‌(సైలంట్‌) ఖాతా కింద పరిగణిస్తారు. అంటే మనుగడలో ఉండదు. అటువంటి ఖాతాల‌ను మ‌ళ్లీ యాక్టివేట్ చేసుకునేందుకు సంబంధిత పోస్టాఫీసు శాఖ‌కు వెళ్లాల్సిందే. ఓ లేఖ ఇవ్వడం ద్వారా తిరిగి దాన్ని యాక్టివేట్ చేయించుకోవచ్చు. ఖాతాలో సూచించిన దాని కంటే త‌క్కువ న‌గ‌దు నిల్వ ఉంటే సేవా రుసుముల కింద రూ.20 మిన‌హాయిస్తారు.

    ఖాతా బ‌దిలీ

    ఖాతా బ‌దిలీ

    ఖాతా బ‌దిలీ ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఖాతాను సులువుగా బదిలీ చేసుకోవచ్చు. ఖాతాను బ‌దిలీ చేసుకునేవారు SB10(b) ఫారంను నింపి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సార్లు మాన్యువ‌ల్‌గా ద‌ర‌ఖాస్తు చేసినా అంగీక‌రిస్తారు. పూర్తి చేసిన ఫారంను ఖాతాను బ‌దిలీ చేసుకునే కార్యాల‌యంలో లేదా ఇదివ‌ర‌కే ఖాతా ఉన్న కార్యాల‌యంలో ఇచ్చినా అంగీక‌రిస్తారు.

    వడ్డీ

    వడ్డీ

    ఖాతాలో నిల్వలపై 4 శాతం వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లిస్తారు. వ్యక్తిగతంగానే కాదు, ఇద్దరు లేదా ముగ్గురు కలసి ఉమ్మడిగానూ ఖాతా ప్రారంభించవచ్చు. మైనర్ల పేరుతోనూ ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతాలో నిల్వలపై ఏడాదికి వడ్డీ రూపంలో 10వేల వరకు వచ్చే ఆదాయంపై పన్ను ఉండదు

     పాస్‌బుక్

    పాస్‌బుక్

    ఖాతా తెరిచేందుకు అవ‌స‌మైన ఫారంను పోస్టాఫీసుకు వెళ్లి కానీ లేదా ఆన్‌లైన్‌లో పొంద‌వ‌చ్చు. పూర్తి చేసిన ఫారాన్ని కేవైసీ ప‌త్రాల‌ను జ‌త‌చేసి మీ ద‌గ్గ‌రలో ఉన్న పోస్టాఫీసులో స‌మ‌ర్పించాలి. ఖాతా తెరిచేందుకు అవ‌స‌ర‌మైన రూ. 20 చెల్లించాలి. వీలైనంత తొంద‌ర‌గా మీ ఖాతా తెరుస్తారు. పాస్‌బుక్ అంద‌జేస్తారు. ఏక ఖాతాదారు విష‌యంలో రూ.1ల‌క్ష‌, ఉమ్మ‌డి ఖాతా విష‌యంలో రూ.2 ల‌క్ష‌ల గ‌రిష్ట డిపాజిట్ అని గుర్తుంచుకోండి

    Read more about: post office
    English summary

    Post Office Saving Account Facts

    Usually, we will look forward to bank accounts to hide money. Banks are so interested in all the reasons for making money, online transfers, and the possibility of depositing any branch.
    Story first published: Wednesday, November 28, 2018, 20:30 [IST]
    Company Search
    Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
    Thousands of Goodreturn readers receive our evening newsletter.
    Have you subscribed?

    Find IFSC

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more