For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ SBI క్రెడిట్ కార్డు బిల్లు కట్టండి ఇలా!

By girish
|

క్రెడిట్ కార్డు వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలున్నాయి. షాపింగ్‌కు ఎంతో అనుకూల‌మైన‌ది. క్యాష్ కంటే క్రెడిట్ కార్డును తీసుకెళ్ల‌డం చాలా సుర‌క్షితం. క్రెడిట్ కార్డును స‌మ‌ర్థ‌వంతంగా, తెలివిగా ఉప‌యోగిస్తే మంచి క్రెడిట్ రేటింగ్‌ను సాధించొచ్చు. ఇది త‌ర్వాత త‌ర్వాత రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ రోజుల్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాటు చాలా ప్రైవేట్‌, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డుల‌ను జారీచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎస్బీఐ క్రెడిట్ కార్డుల బిల్లుల‌ను ఎలా చెల్లించ‌వ‌చ్చో తెలుసుకుందాం.

నెట్ బ్యాంకింగ్

నెట్ బ్యాంకింగ్

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం ఇప్పుడు చాలా సుల‌భ‌త‌రం. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఇందుకు వేదికైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ర‌కాల చెల్లింపు విధానాల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచింది. క్రెడిట్ కార్డు బిల్లును క్యాష్ ద్వారా, చెక్కు డిపాజిట్ చేయ‌డం ద్వారా చేయ‌వ‌చ్చు. ఇది కాకుండా ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఉండ‌నే ఉంది. ఎస్‌బీఐ ఇ-పే సేవ మ‌రో విధానం. దీంట్లో ఎన్ఈఎఫ్‌టీ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లును సుల‌భంగా క‌ట్ట‌వ‌చ్చు.

ఏటీఎమ్ ద్వారా:

ఏటీఎమ్ ద్వారా:

ఏదైనా ఎస్‌బీఐ ఎటీఎమ్‌కు వెళ్లి క్రెడిట్ కార్డు బిల్లు ఎలా క‌ట్టాలో తెలుసుకుందాం. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ కు వెళ్లి అక్క‌డ మీ వ‌ద్ద ఉన్న ఏటీఎమ్ కార్డును ఉంచండి. పిన్ నెంబ‌రు ఎంట‌ర్ చేశాక, తెర పైన క‌నిపించే Bill Pay ఆప్ష‌న్‌పైన క్లిక్ చేయండి. క్రెడిట్ కార్డు నెంబ‌రుతో పాటు బ‌కాయి ప‌డ్డ సొమ్మును న‌మోదు చేసేయండి. అంతే! మీ ఖాతాలోని సొమ్ము డిడ‌క్ట్ అయి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు పూర్త‌వుతుంది.

 ఎస్‌బీఐ

ఎస్‌బీఐ

బిల్ డెస్క్ ఎస్‌బీఐ దేశంలో అతిపెద్ద బ్యాంకు. దాదాపు అన్ని న‌గ‌రాల్లో దీనికి సంబంధించిన ఏటీఎమ్లు ఉంటాయి. అయితే ఒక్కోసారి ఏటీఎమ్‌ల వ‌ర‌కూ వెళ్లేందుకు సైతం స‌మ‌యం లేకుండా ఉండొచ్చు. లేదా ఏటీఎమ్‌లు ఒక్కోసారి స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. అలాంటి స‌మ‌యాల్లో మీరు నెట్ ఉంటే సెల్, ల్యాప్‌ట్యాప్ నుంచే బిల్ డెస్క్ ద్వార సైతైం ఎస్‌బీఐ కార్డు బిల్లు చెల్లించేయ‌వ‌చ్చు. ఇందుకోసం బిల్ డిస్క్లో లాగిన్ అయిన త‌ర్వాత ఆప్ష‌న్ల‌లోంచి క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. త‌ర్వాత ఎంత బిల్లు చెల్లించాలో అంత సొమ్ము ఎంట‌ర్ చేసి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించేయ‌వ‌చ్చు.

ఆల‌స్యం చేస్తే

ఆల‌స్యం చేస్తే

ఆల‌స్యం చేస్తే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌డాన్ని ఆల‌స్యం చేస్తే క్రెడిట్ స్కోరుపైన ప్ర‌తికూల ప్ర‌భావం చూపిస్తుంది. బిల్లులు ఆల‌స్యంగా చెల్లించ‌డానికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలున్నాయి. ఒక‌టి అందుబాటులో స‌రైన స‌మ‌యానికి డ‌బ్బు లేక‌పోవ‌డం. మ‌రొక‌టి బిల్లు క‌ట్టే చివ‌రి తేదిని మ‌ర్చిపోవ‌డం. ఇది కాకుండా సాంకేతిక కార‌ణాల వ‌ల్ల చెల్లించ‌లేక‌పోవ‌చ్చు. ఏది ఏమైనా ... బ్యాంకును సంప్ర‌దించి ఎప్ప‌టిక‌ప్పుడు క్రెడిట్ కార్డు ఖాతా వివ‌రాలు, బ్యాలెన్స్ గురించి తెలుసుకోవ‌డం మంచిది. లేదా మ‌న ఫోన్‌కే సంక్షిప్త సందేశాల రూపంలో బిల్లు వ‌చ్చేలా చూసుకుంటే మంచిది.

Read more about: sbi
English summary

మీ SBI క్రెడిట్ కార్డు బిల్లు కట్టండి ఇలా! | How to Pay Sbi Credit Card Bill

The credit card has many advantages. Excellent for shopping. It is very safe to carry a credit card than cash. Using a credit card effectively and wisely can achieve a better credit rating
Story first published: Monday, November 26, 2018, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X