For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ pf డబ్బులు ఈజీగా తెచ్చుకోండి ఇలా

By girish
|

ఎన్నో కోట్ల మంది పీఎఫ్ చందాదారుల‌కు శుభ‌వార్త‌. పీఎఫ్ ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా లేదా క్లెయిం చేసుకునే స‌దుపాయం అందుబాటులోకి వ‌చ్చింది. ఇంత‌కుముందు పీఎఫ్ సొమ్మును క్లెయిం చేయాలంటే మీరు ఇంత‌కు ముందు ఉద్యోగం చేసిన సంస్థ చుట్టూనో, పీఎఫ్ కార్యాల‌యం చుట్టూనో తిర‌గాల్సి ఉండేది. ఇప్పుడు మీరు ఎక్క‌డికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండానే పీఫ్ ఆన్‌లైన్ క్లెయిం చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో వీలు క‌ల్పిస్తోంది. మీరు ఆన్‌లైన్లో అప్లై చేసిన 5 రోజుల్లోగా నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకే పీఎఫ్ సొమ్ము వ‌చ్చి ప‌డుతుంది. అది ఎలా చేయాలో తెలుసుకుందాం.

1.పీఎఫ్

1.పీఎఫ్

పీఎఫ్ వెబ్‌సైట్‌ పీఎఫ్ ఆన్‌లైన్ క్లెయిం కోసం వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. మీ ముందు పీఎఫ్ సంబంధిత వివ‌రాల‌ను క‌లిగిన వెబ్‌సైట్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఈ వెబ్‌సైట్ హోం పేజీలోనే కుడి ప‌క్క ఆన్‌లైన్ క్లెయిం అనే ఆప్ష‌న్ ఉంటుంది. మీరు దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయ‌గానే యూఏఎన్ సాయంతో లాగిన్ అయ్యే విండో వ‌స్తుంది.

2. యూఏఎన్ లాగిన్‌:

2. యూఏఎన్ లాగిన్‌:

మీరు ఇదివ‌ర‌కే పీఎఫ్ ఖాతా క‌లిగి ఉంటే మీ యాజ‌మాన్యం మీకు యూఏఎన్ నంబ‌రు స‌దుపాయం క‌ల్పిస్తుంది. యూఏఎన్ లాగిన్ అయిన త‌ర్వాత ఐదు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. మేనేజ్ అనే దానిలో మీరు కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేయ‌వ‌చ్చు. అకౌంట్ అనే చోట పాస్ వ‌ర్డ్ మార్చుకోవ‌చ్చు. ఆన్‌లైన్ స‌ర్వీసు అనేది పీఎఫ్ సొమ్ము సంబంధించిన ముఖ్య‌మైన ఆప్ష‌న్

3. ఇలా చేయండి:

3. ఇలా చేయండి:

ఆన్‌లైన్ స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌లో ఉండే క్లెయిం, ట్రాన్స్‌ఫ‌ర్ రిక్వెస్ట్‌, ట్రాక్ క్లెయిం స్టేట‌స్ ద్వారా మీకు కావాల్సిన ప‌ని చేసుకోవ‌చ్చు. క్లెయిం ఆప్ష‌న్ నొక్కితే మీ ఆధార్ సంఖ్య కేవైసీ వివ‌రాల‌తో పీఎఫ్ వెబ్సైట్ అప్‌డేట్ అయిందో లేదో తెలుస్తుంది. మీ కేవైసీ వివ‌రాల వెరిఫికేష‌న్ పూర్త‌యితే మీరు ఆన్‌లైన్‌లో క్లెయిం నేరుగా చేసుకోవ‌చ్చు.

4. కేవైసీ వివ‌రాల

4. కేవైసీ వివ‌రాల

అప్‌డేట్‌ కేవైసీ వివ‌రాలు స‌రిగా లేక‌పోతే వాటిని మీరు ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కేవైసీ ప్ర‌క్రియ పూర్తి చేయ‌డం అన‌వ‌చ్చు. కేవైసీ పూర్తిచేయ‌కుడా పీఎఫ్ ఆన్‌లైన్ క్లెయిం చేయ‌డం క‌ష్టం. హోం, వ్యూ త‌ర్వాత మేనేజ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. అక్క‌డ కాంటాక్ట్ డీటెయిల్స్‌, కేవైసీ అని ఉంటుంది. అక్క‌డ కేవైసీ పై క్లిక్ చేయండి.

5. వివ‌రాల‌ను నింపండి:

5. వివ‌రాల‌ను నింపండి:

ఇక్క‌డ డాక్యుమెంట్ ర‌కం, డాక్యుమెంట్ నంబ‌రు, మీ పేరు వంటి వివ‌రాల‌ను వెబ్‌సైట్ అడుగుతుంది. బ్యాంకు, పాన్‌, ఆధార్ వివ‌రాల‌ను ఇస్తే వెరిఫికేస‌న్ పూర్త‌వుతుంది. ఇక్క‌డ మీ ఆధార్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ వెబ్‌సైట్లో ఉన్న వాటితో ప‌రిపోలాలి. త‌ర్వాత సేవ్ ఆప్ష‌న్ నొక్కండి. ఒక‌సారి కేవైసీ ప్ర‌క్రియ పూర్త‌యితే మ‌ళ్లీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌లోకి వెళ్లి క్లెయిం ఆప్ష‌న్ నొక్కండి. దీన్ని పూర్తి చేస్తే 10 రోజుల్లోపు మీ ఖాతాలోకి పీఎఫ్ సొమ్ము జ‌మ అవుతుంది

Read more about: pf
English summary

మీ pf డబ్బులు ఈజీగా తెచ్చుకోండి ఇలా | How to Get PF Amount

Good news for many PF subscribers. Access to PF online is available or available.
Story first published: Friday, November 23, 2018, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X