For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఏటీఎం చార్జీలు ఎలా తగ్గించుకోవాలో మీకు తెలుసా?

By girish
|

బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎటిఎం లేదా డెబిట్‌ కార్డు తీసుకోవడం మామూలే. అయితే ఎప్పుడంటే అప్పుడు ఎటిఎం నుంచి డబ్బులను తీసుకునే వెసులుబాటు ఉండటం, షాపింగ్ కోసం లేదా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు ఈ కార్డులను ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే పరిమితికి మించి ఏటీఎం కార్డుని ఉపయోగిస్తే బ్యాంకులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఏ బ్యాంకులో అయితే అకౌంట్‌ను కలిగి ఉంటారో ఆ బ్యాంకు ఏటీఎంలో నెలకు ఐదుసార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడుసార్లు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే వెసులుబాటుని బ్యాంకులు అందిస్తున్నాయి. కాగా, ఈ పరిమితి మించితే చార్జీలు చెల్లించాల్సిందే. ఎక్కువగా సార్లు కార్డును వినియోగిస్తే చార్జీల మోత మరింతగా మోగుతుంది. ఈ క్రమంలో చార్జీల భారం నుంచి బయటపడాలంటే బ్యాంకు డెబిట్ కార్డు విషయంలో కొన్ని మెళకువలు పాటించాలి. అలా పాటించడం వల్ల కొంత మేరకు ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

 షాపింగ్‌

షాపింగ్‌

షాపింగ్‌ చేసే ముందు లేదా డబ్బులను మరోక ఖాతాలో వేయాలనుకునే వారు ఏటీఎంల నుంచి డబ్బులను విత్‌డ్రా చేస్తుంటారు. ఇలా చేయడానికి బదులు డిజిటల్‌ పేమెంట్‌కు లేదా వాలెట్‌ సర్వీసుల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తే మంచిది. డిజిటల్‌ వాలెట్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకుంటే మొబైల్‌ ఫోన్‌ ద్వారానే అవసరమైనప్పుడు చెల్లింపులు

 ఉదాహరణకు

ఉదాహరణకు

సాధారణ కస్టమర్లతో పోల్చితే ప్రయారిటీ బ్యాంకింగ్‌ కస్టమర్లకు బ్యాంకులు పెద్దపీట వేస్తుంటాయి. ఉదాహరణకు నెలలో ఖాతాలో కనీసం 25,000 రూపాయల నగదు నిల్వను ఉంచగలిగే స్థోమత ఉంటే బ్యాంకు వద్ద ప్రయారిటీ ఖాతాను తీసుకుంటే మంచిది. ఇలాంటి ఖాతా ఉన్న వారికి బ్యాంకులు అదనపు సౌకర్యాలను అందిస్తాయి.

ఖాతాలో

ఖాతాలో

ఖాతాలో ఎంత నిల్వ ఉన్నదో తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఏటీఎంను వినియోగిస్తుంటారు. దీనిని కూడా బ్యాంకులు ఒక లావాదేవీగానే పరిగణిస్తారు. నగదు నిల్వను తెలుసుకోవడానికి బ్యాంకులు ప్రత్యేకమైన ఫోన్‌ నెంబర్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. సంబంధిత బ్యాంకు శాఖలో లేదా బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెంబర్‌ను తెలుసుకోవచ్చు.

Read more about: atm
English summary

మీ ఏటీఎం చార్జీలు ఎలా తగ్గించుకోవాలో మీకు తెలుసా? | How to Avoid Atm Charges

It is unlikely that everybody in the bank has an ATM or debit card. But when there is a possibility of making money from ATM
Story first published: Friday, November 23, 2018, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X