For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల బ్యాంకు అకౌంట్ వల్ల కలిగే లాభాలు!

By girish
|

చిన్న‌త‌నం నుంచే పొదుపు అల‌వాటు ఉంటే పెద్ద‌య్యాక డ‌బ్బును ఎలా పొదుపు, పెట్టుడులు చేయాలో బాగా తెలుసుకోవ‌చ్చు. చిన్న‌ప్ప‌టి నుంచే పిల్ల‌లు పొదుపు అల‌వాటు నేర్చుకోవాలంటే వారికి డ‌బ్బు నిర్వ‌హ‌ణ‌, దాని విలువ తెలియాలి. అందుకే బ్యాంకులు పిల్ల‌ల పొదుపు ఖాతాను ప్ర‌వేశ‌పెట్టాయి.పిల్ల‌లు తామే స్వ‌యంగా బ్యాంకు ఖాతాను వాడుకునేలా భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించింది. ప్ర‌స్తుతం ఉన్న మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం 10 సంవ‌త్స‌రాల పైబ‌డిని పిల్ల‌లు స్వ‌యంగా బ్యాంకు ఖాతా నిర్వ‌హించుకోవ‌చ్చు.ఈ నేప‌థ్యంలో పిల్లల పొదుపు ఖాతా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

 లాభాలు

లాభాలు

  • చిన్న వ‌య‌సులోనే బ్యాంకింగ్ వ్య‌వ‌హారంపై అవ‌గాహ‌న వ‌స్తుంది.
  • చిన్న‌త‌నంలోనే డ‌బ్బు విలువ తెలిసి వ‌స్తుంది. పొదుపు ప్రాముఖ్య‌త తెలిసి వ‌స్తుంది.
  • చిన్న‌త‌నం నుంచే ఆర్థిక ప్ర‌ణాళిక‌పై చ‌క్క‌ని అవగాహ‌న క‌లుగుతుంది.
  • సదుపాయాలు

    సదుపాయాలు

    • కొత్త మార్గ‌దర్శ‌కాలు రూపొందించాక బ్యాంకులు పిల్ల‌ల ఖాతాల విష‌యంలో క‌ల్పించే సౌక‌ర్యాల‌పై ఆశాభావం ఉంది.
    • వ్య‌క్తిగ‌త డెబిట్ కార్డులేదా చెక్కు పుస్త‌కాల‌ను బ్యాంకులు జారీ చేస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉంటుంది.
    • కొన్ని ప‌రిమితుల‌తో మొబైల్ బ్యాంకింగ్ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నాయి.
    • ప్రణాళిక

      ప్రణాళిక

      • ఈ పిల్ల‌ల ఖాతాలో జ‌మ చేసే సొమ్మును భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు.
      • పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు, వివాహం, ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌కు వీటిని ఉప‌యోగించ‌వ‌చ్చు.
      • ఉదాహ‌ర‌ణ‌కు రిక‌రింగ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్ సిప్లు, ఫిక్స్ డ్ డిపాజిట్ల వంటి వాటిలో ఖాతా తెరించి దీర్ఘ‌కాలంలో ఎక్కువ మొత్తం మ‌దుపు చేసేందుకు అవ‌కాశం ఉంది.
      • ఒక‌సారి ఖాతా తెరిచిన త‌ర్వాత వాటినే జీవితాంతం కొన‌సాగించ‌వ‌చ్చు. త‌ద్వారా భ‌విష్య‌త్తులో ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌కు ఇవే ఖాతాలు తోడ్ప‌డ‌తాయి.
      • సాధార‌ణ వ‌డ్డీ

        సాధార‌ణ వ‌డ్డీ

        • పిల్ల‌ల బ్యాంకు పొదుపు ఖాతాల్లో సాధార‌ణ వ‌డ్డీ వ‌స్తుంది. పిల్ల‌ల‌కు త‌ర‌చూ త‌ల్లిదండ్రులు, బంధువులు అప్పుడ‌ప్పుడు ఇచ్చిన డ‌బ్బును బ్యాంకు ఖాతాలో వేయడం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో ఎక్కువ డ‌బ్బు జ‌మ‌వుతుంది.
        • పిల్ల‌ల‌కు డ‌బ్బు విలువ సులువుగా తెలిసి వ‌స్తుంది. బ్యాంకింగ్ వ్య‌వ‌హారాలు ఎలా నెర‌పాలో ఒక వ‌య‌సు వ‌చ్చే స‌రికి వారికే తెలుస్తుంది.

Read more about: bank account
English summary

పిల్లల బ్యాంకు అకౌంట్ వల్ల కలిగే లాభాలు! | Benefits of Opening Children Bank Account

If you have a savvy habit of early childhood, you can learn how to save money and invest money. If children want to learn savings habits since childhood, they need to know the value of money and money.
Story first published: Tuesday, November 13, 2018, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X