For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తక్కువ రేటుతో మంచి కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే చూడండి.

By girish
|

భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ అక్టోబర్ రెండోవారం నుంచి నవంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఇంట్లోకి కొత్త వస్తువులు తీసుకురావాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. అయితే ఏ వస్తువైనా డిస్కౌంట్ ధరకు కొంటే ఆ కిక్కే వేరు. ఇక మంచి డిస్కౌంట్‌తో కార్ కొనగలిగితే ఆ సంతోషమే వేరు.

ఫెస్టివల్ సీజన్‌

ఫెస్టివల్ సీజన్‌

ఫెస్టివల్ సీజన్‌ క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు కూడా కొత్త కార్లు లాంఛ్ చేస్తాయి. ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈసారి ఫోర్డ్ ఆస్పైర్, హోండా సీఆర్-వీ, హుందాయ్ సాంత్రో, టాటా టియాగో జేటీపీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లాంటి కార్లెన్నో లాంఛయ్యాయి. వీటిపై నవరాత్రి ఆఫర్లు, దసరా డిస్కౌంట్లు, దీపావళి ధమాకాలు కూడా ఉన్నాయి. మరి ఈ సీజన్‌లో కారు కొనాలనుకుంటే భారీ డిస్కౌంట్ ఎలా పొందాలో తెలుసుకోండి.

ఎలా పొందాలో

ఎలా పొందాలో

  • కార్ల డీలర్స్ అందరూ పారదర్శకంగా ఉండరు. ఆఫర్ల వెనుక మతలబులుంటాయి.
  • మీ తెలివితేటలు, బేరం చేసే సామర్థ్యంతో మంచి డిస్కౌంట్ పొందొచ్చు.
  • కంపెనీలు ఇచ్చే క్యాష్ డిస్కౌంట్లు కాకుండా కొందరు డీలర్లు సేల్స్ పెంచుకోవడానికి అదనంగా డిస్కౌంట్ ఇస్తారు.
  • మీరు తెలివిగా బేరమాడితే డీలర్‌ నుంచి అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

ఇన్సూరెన్స్

ఇన్సూరెన్స్

  • మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తే తీసుకోకండి.
  • ఇన్సూరెన్స్ మొత్తాన్ని బిల్లులో తగ్గించమని కోరండి.
  • మీరు ఆన్‌లైన్‌లో తక్కువ ప్రీమియంకే ఇన్సూరెన్స్ తీసుకోండి. యాక్సెసరీస్ కూడా ఉచితంగా ఇస్తామని చెబితే తీసుకోవాల్సిన అవసరం లేదు
  • డిస్కౌంట్

    డిస్కౌంట్

    • ఫ్రీ యాక్సెసరీస్ బదులు అంతే మొత్తం డిస్కౌంట్ ఇవ్వమని అడగండి.
    • డీలర్ ఇచ్చే యాక్సెసరీస్ తక్కువ ధరకే మార్కెట్‌లో కొనుక్కోవచ్చు.
    • ఒకవేళ డిస్కౌంట్ కుదరదని డీలర్ చెబితే ఇంకా ఎక్కువ యాక్సెసరీస్ అడగండి.
    • కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా డిస్కౌంట్లు ఇస్తారు డీలర్లు.
    • మీ దగ్గర పాత కార్ ఉంటే మంచి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు పొందొచ్చు.
    •  లోన్‌

      లోన్‌

      • కంపెనీ ఇచ్చే వారంటీ కన్నా అదనంగా వారంటీ అడగండి.
      • అదనపు వారంటీ 3 నుంచి 5 ఏళ్లతో పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోరొచ్చు.
      • మీరు లోన్‌ పైన కారు కొంటున్నారంటే వడ్డీ రేట్లు, డౌన్‌పేమెంట్ తగ్గించమని అడగొచ్చు.
      • అరశాతం వడ్డీ రేటు తగ్గించినా మీకు ఈఎంఐ భారం తగ్గుతుంది.
      • ఫెస్టివల్ సీజన్‌లో డీలర్లు ఇచ్చే బహుమతులూ వదులుకోకండి.

Read more about: investment
English summary

తక్కువ రేటుతో మంచి కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే చూడండి. | How to Buy Car in Low Cost

Festival season in India will be from October second to end of November.
Story first published: Saturday, October 6, 2018, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X