ఈరోజుల్లో పెన్షన్ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు.అలాగే ఎన్నో ప్రభుత్వాలు ఈ పెన్షన్ స్కీం మీద హామీలు ఇస్తున్నాయి. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్)ను 2004లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ పథకం
మొదట ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ పథకం 2009 నుంచి పౌరులందిరికీ వర్తింపజేశారు. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసులోని వారు ఈ పథకంలో చేరవచ్చు. 70ఏళ్ల వరకు కొనసాగించవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి ఆదరణ పెరుగుతోంది. ట్యాక్స్ బెనిఫిట్స్, రిటర్నులు బాగుండటం వల్ల దీనివైపు ఉద్యోగులు ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ పథకాన్ని పౌరులకు మరింత చేరువ చేయడానికి ఎన్‌ఫీఎస్ అకౌంట్ తెరిచే విధానాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ సులభతరం చేసింది.

బ్యాంక్ అకౌంట్
ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో మాత్రమే ఉన్న ఈ సదుపాయాన్ని ఇప్పుడు ఆన్‌లైన్ చేసింది. ఈఎన్‌ఫీఎస్ పేరిట ప్రారంభమైన ఈ సిస్టమ్ ద్వారా పౌరులు ఆన్‌లైన్‌లోనే ఎన్‌పీఎస్ ఖాతా తెరుచుకోవచ్చు. టైర్ 1, టైర్ 2 అకౌంట్లలో మీ డబ్బును పొదుపు చేసుకోవచ్చు. అయితే వ్యక్తిగత ఎన్‌పీఎస్ అకౌంట్ తెరవడానికి ప్రతి ఒక్కరికి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో పాటు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. అలాగే మొబైల్ నంబర్‌తో రిజిస్టరై ఉన్న ఆధార్ నంబర్ ఉండాలి. ఫొటో స్కాన్ కాపీ, క్యాన్స్‌ల్డ్ చెక్, సంతకం, బ్యాంక్ అకౌంట్‌లో లేదా క్రెడిట్ కార్డులో కనీసం రూ.500 సొమ్ము ఉండాలి.

ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ అకౌంట్ తెరవడం ఎలా
మొదట ఈఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి
https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html. హోమ్ పేజ్‌లో కుడిచేతి వైపు ఉన్న ‘Registration' బటన్‌పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్
ఆన్‌లైన్ సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్‌ను సెలక్ట్ చేసి, సంబంధిత విభాగాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి ‘Continue'పై క్లిక్ చేయాలి.

‘కంటిన్యూ'
‘కంటిన్యూ' మీద క్లిక్ చేసిన తరవాత మీ పేరు, టైమ్ స్టాంప్‌తో కూడిన అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ జనరేట్ అవుతుంది. అప్పుడు ‘OK'ను సెలక్ట్ చేసుకోవాలి.

వ్యక్తిగత వివరాలు
ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వివరాలు మొత్తం నింపిన తరవాత ఒకసారి సరిచూసుకోండి. ఆ తరవాత ‘Save & Proceed'పై క్లిక్ చేయండి

బ్యాంక్ అకౌంట్
ఆ తరవాత స్టెప్‌లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను నింపాల్సి ఉంటుంది. మీకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలను నింపి ‘Save & Proceed'పై క్లిక్ చేయాలి

నాలుగు ఫండ్లను
ఆ తరవాత స్టెప్‌లో, వెబ్‌సైట్‌లో మీకు కనిపించే నాలుగు ఫండ్లను ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఒక్కోదానిలో గరిష్టంగా 50 శాతం ఈక్విటీ ఫండ్స్ తీసుకునే అవకాశం ఉంది. కేటాయింపులు పూర్తయిన తరవాత, నామిని వివరాలు నింపాల్సి ఉంటుంది.

నామిని
నామిని వివరాలు నింపిన తరవాత, మీ అకౌంట్ క్యాన్స్‌ల్డ్ చెక్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫొటోగ్రాఫ్, సంతకం కూడా అప్‌లోడ్ చేయాలి.

కనీసం
చివరిగా, మీ ఎన్‌పీఎస్ అకౌంట్‌లో తొలి డిపాజిట్‌గా కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ తొలి పేమెంట్‌ను ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.

పేమెంట్
పేమెంట్ విజయవంతంగా పూర్తైన తరవాత, మీ పర్మనెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్) జనరేట్ అవుతుంది. అలాగే పేమెంట్ రిసిప్ట్ కూడా వస్తుంది.

డౌన్‌లోడ్
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయడానికి లేదా రిజిస్ట్రేషన్ ఫామ్(ఈ సైన్)ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఈమెయిల్
మీ పీఆర్ఏఎన్ నంబర్‌లో యూనిట్లు క్రెడిట్ కావడానికి కనీసం రెండు పని దినాల సమయం పడుతుంది. అలాగే, పీఆర్ఏఎన్‌కు ఐపిన్‌ను జనరేట్ చేసుకోవడానికి మీకు ఒక ఈమెయిల్ కూడా వస్తుంది. మీ ఎన్‌పీఎస్ అకౌంట్‌లోకి ఆన్‌లైన్ ద్వారా లాగిన్ కావడానికి ఈ ఐపిన్ ఉపయోగపడుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications