For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఎక్కువ లోన్లు మరియు క్రెడిట్ కార్డులు ఉంటే ఏమవుతుందో తెలుసా?

By girish
|

ఒకప్పుడు క్రెడిట్ కార్డులు రావాలంటే చాలా కష్టం. బ్యాంకులు అనేక రకాలుగా పరీక్షించి, పరిశీలించి కార్డులు ఇచ్చేవి. కానీ ఇప్పుడు బ్యాంకుల మధ్య పోటీ పెరిగిపోవడంతో క్రెడిట్ కార్డులు ఇచ్చే పద్ధతి కాస్త సులువైంది. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని ఒక్కొక్కరు నాలుగైదు క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. విచ్చలవిడిగా వాడుతున్నారు. అప్పులు చెల్లించలేక తిప్పలు పడుతున్నారు. అయితే ఇలా ఎక్కువగా క్రెడిట్ కార్డులు ఉండటంతో చాలా నష్టాలున్నాయి. అవేంటో చూడండి.

 క్రెడిట్ కార్డు

క్రెడిట్ కార్డు

మీకు ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారంటే ఎక్కువ అప్పులు చేసేవారి జాబితాలో మీరు కూడా ఉన్నట్లే.మీ ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారు అంటే లేట్ పేమెంట్స్ కి అవకాశాలు ఎక్కువ .

హై-రిస్క్ కస్టమర్

హై-రిస్క్ కస్టమర్

ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్న మరియు లోన్లు ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరు ఏ లోన్లుకు దరఖాస్తు చేసుకున్నా హై-రిస్క్ కస్టమర్ గా బ్యాంకు భావిస్తుంది.

2 లేదా 3 క్రెడిట్ కార్డులు మరియు లోన్లు ఉండడం వల్ల క్రెడిట్ స్కోర్కి ఏమి ఇబ్బంది ఏమి లేదు. అంతకన్నా ఎక్కువగా కార్డులు ఉంటే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చుపిస్తున్నాయి. మీ చెల్లింపు చరిత్ర క్రెడిట్ కార్డు స్కోర్ పై త్రీవ్ర ప్రభావం చూపిస్తుంది.

క్రెడిట్ స్కోర్

క్రెడిట్ స్కోర్

గడువులోగా వాయిదాలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అందుకే క్రెడిట్ కార్డు బిల్లులు మరియు ఈఎంఐలు ఆలస్యంగా కట్టకూడదు. ఒక్కసారి గడువులోగా చెల్లించపోయిన మీ సిబిల్ స్కోర్ 80-110 పాయింట్లు పడిపోతుంది. క్రెడిట్ స్కోర్ పై చెల్లింపుల చరిత్ర ప్రభావం 35 శాతం ఉంటుంది.

ఎక్కువ క్రెడిట్ కార్డులు

ఎక్కువ క్రెడిట్ కార్డులు

ఎక్కువ క్రెడిట్ అకౌంట్లు ఉంటే క్రెడిట్ స్కోర్ పై 30 శాతం ప్రభావం చూపిస్తుంది. మీ క్రెడిట్ లిమిట్ 60 శాతం కన్నా ఎక్కువ వాడకపోవడం మంచిది. లోన్లకు మరియు క్రెడిట్ కార్డులకు ఎక్కువ దరఖాస్తు చేస్తే కూడా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కుదిరినంత వరకు ఎక్కువ క్రెడిట్ కార్డులు మరియు ఎక్కువ లోన్లలకి దూరంగా ఉండడం మంచిది.

Read more about: credit cards
English summary

మీకు ఎక్కువ లోన్లు మరియు క్రెడిట్ కార్డులు ఉంటే ఏమవుతుందో తెలుసా? | Tips to Increase Cibil Score

It is difficult to give credit cards at one time. Banks have examined and evaluated cards in many different ways.
Story first published: Tuesday, September 25, 2018, 14:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X