For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ కార్డులో ఉన్న తప్పులు ఎలా సరిచేసుకోవాలో తెలుసా?

|

పాన్ కార్డులో చిన్నచిన్న తప్పుల్ని పెద్దగా పట్టించుకోరు. ఏం కాదులే అనుకుంటారు. చివరకు బ్యాంకులో లోన్ కోసమో, అకౌంట్ కోసమో అప్లై చేసినప్పుడు పాన్ కార్డులో తప్పులే తిప్పలు పెడతాయి. అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేలా చేస్తాయి. అప్పుడుగానీ పాన్ కార్డులో తప్పుల్ని సరి చేసుకోవాలన్న ఆలోచన రాదు చాలామందికి. మరి మీ పాన్ కార్డులో కూడా తప్పులున్నాయా? వాటిని సరిచేసుకోవడం ఎలాగో తెలుసా?

పాన్ కార్డులో

పాన్ కార్డులో

పాన్ కరెక్షన్ ఫామ్‌ను అనేక అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. పాన్ కార్డులో కరెక్షన్ కోసమో, లేక మళ్లీ కొత్త కార్డు తీసుకోవడానికో, అదనంగా ఉన్న పాన్ కార్డును సరెండర్ చేయడం కోసమో పాన్ కరెక్షన్ ఫామ్‌ ఉపయోగపడుతుంది. అయితే కార్డులో తప్పుల్ని ఎలా సరిచేసుకోవాలో చూడండి.

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

1. మొదట అధికారిక వెబ్‌సైట్‌‌లోకి వెళ్లండి. అందులో 'అప్లికేషన్ టైప్'పై క్లిక్ చేయండి.

2. డ్రాప్ డౌన్ మెనూలో 'ఛేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్'పై క్లిక్ చేయండి.

3. వివరాలు నమోదు చేసిన తర్వాత మరో పేజీలోకి వెళ్తారు.

4. మీ కరెక్షన్ రిక్వెస్ట్‌కు టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ మీ ఇమెయిల్‌కు వస్తుంది.

5. పేజీ టాప్‌లో 'సబ్మిట్ స్కాన్డ్ ఇమేజెస్ థ్రూ ఇ-సైన్' ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సరిచేయాలనుకున్న వివరాలన్నీ నమోదు చేయండి.

6. ఫామ్‌లో మీ వివరాలన్నీ సరిగ్గా చూసుకొని మరీ ఫిల్ చేయండి.

7. ఫామ్ పూర్తి చేసిన తర్వాత మీ ఐడీ, ఏజ్, రెసిడెన్స్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

8. వివరాలన్నీ సేవ్ చేసుకునే ముందు తప్పులు లేకుండా మళ్లీ సరిచూసుకోవాలి.

9. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత పేమెంట్ చేయల్సి ఉంటుంది. భారతదేశంలో నివసించేవారైతే రూ.110, విదేశాల్లో నివసించేవారు రూ.1020 చెల్లించాల్సి ఉంటుంది. డీడీని 'ఎన్‌ఎస్‌డీఎల్-పీఏఎన్', ముంబై పేరుపై తీయాలి.

ఆఫ్‌లైన్‌లో కరెక్షన్స్ కోసం:

ఆఫ్‌లైన్‌లో కరెక్షన్స్ కోసం:

1. వెబ్‌సైట్ నుంచి ఫామ్ డౌన్‌లోడ్ చేసి వివరాలు పూర్తి చేయాలి.

2. ఆ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. పూర్తి చేసిన ఫామ్‌ను లెటర్‌తో సహా దగ్గర్లోని ఎన్‌ఎస్‌డీఎల్ సెంటర్‌లో అందజేయాలి.

 గుర్తుంచుకోండి:

గుర్తుంచుకోండి:

ఆన్‌లైన్‌లో ఫామ్ సబ్మిట్ చేసిన 15 రోజుల్లో కావాల్సిన డాక్యుమెంట్లు, సైన్ చేసిన అక్నాలెడ్జ్‌మెంట్ ఎన్‌ఎస్‌డీఎల్‌కు చేరుకోవాలి.

Read more about: pan card
English summary

పాన్ కార్డులో ఉన్న తప్పులు ఎలా సరిచేసుకోవాలో తెలుసా? | How to Rectify Mistakes in Pan Card

PAN card does not care for the smallest mistakes. What do you think? Finally, when you apply for loan or bank account in the bank, you will be redirected to the PAN card.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X