అమెజాన్ లో బిజినెస్ చేయడం ఎలాగో తెలుసా? మీరు ఒక్కసారి ట్రై చేయండి.
భారత్‌లో ఈకామర్స్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఈ కామర్స్ మార్కెట్ విలువ లక్షా 9వేల 96 కోట్ల. 2021 నాటికి అది 4 లక్షల 18వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.

ఈ కామర్స్
అంటే వచ్చే మూడేళ్లలో నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. దీన్ని బట్టి.ఈ కామర్స్‌లో డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయన్నమాట.

అమెజాన్
ఈ లెక్కన మనం ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో కలసి ఇంటి దగ్గరి నుంచే వ్యాపారం చేసుకోవచ్చు. అయితే, అమెజాన్ బిజినెస్ పార్టనర్‌గా మారి వ్యాపారం ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు దీనికి ఎలా చేయాలి ఏమి చేయాలో తెలుసుకుందాం
- మొదట services.amazon.inలోకి వెళ్లాలి
- అక్కడ సర్వీస్ ట్యాబ్‌ని క్లిక్ చేస్తే, sell-on-amazon అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి
- రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి మీ పేరు, ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ అప్ డేట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాలి.
- ఆ ప్రాసెస్ పూర్తయ్యాక మీకో కొత్త పేజీ కనిపిస్తుంది. అందులో మీ కంపెనీ వివరాలు, అకౌంట్ వివరాలు పొందుపరచాలి.
- వివరాలన్నీ ఇచ్చాక, అమెజాన్.. మిమ్నల్ని ఓ చిన్న ఇంటర్వ్యూ చేస్తుంది. అది పూర్తయ్యాక మీకు డ్యాష్ బోర్డు ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు అమ్మాలనుకుంటున్న వస్తువుల వివరాలను పోస్టు చేయాలి.
- amazon.in లోకి వెళ్లి మొదట ఓ లిస్టు తయారు చేయండి. మీరు అమ్మే వస్తువుల్లో ఒక్కొక్కటి అప్‌లోడ్ చేస్తారా? మొత్తం అన్నీ కలిపి ఒకేసారి అప్‌లోడ్ చేస్తారా మీ ఇష్టం.
- ఒక్కసారి మీ ప్రొడక్ట్స్ అన్నీ అప్‌లోడ్ చేయడం పూర్తయ్యాక.. లక్షలాది మంది అమెజాన్ కస్టమర్లకు కనిపిస్తుంటుంది.
- ఎవరైనా కస్టమర్ మీ ప్రొడక్ట్‌ని కొనుగోలు చేస్తే. కంపెనీ ఆ వివరాలను మీ ఈమెయిల్‌కు తెలియజేస్తుంది.
- మీ ప్రొడక్ట్‌ను ప్యాక్ చేసి కస్టమర్లకు అందించొచ్చు. అవసరం అయితే మీరు అమెజాన్ సఫలీకృత సర్వీస్ లేదా అమెజాన్ ఈజీ షిప్, ఎఫ్‌బీఏ సేవలను పొందొచ్చు



Click it and Unblock the Notifications