మొత్తం తిరిగిచ్చేసిన సచిన్?అందుకేనేమో క్రికెట్ గాడ్ అంటారు?
క్రికెట్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చేపేరు సచిన్ ఇందులో ఏమాత్రం సందేహం లేదు.తన చిన్ననాటి నుండి కష్టాలు ఒడిదుడుకులు ఎన్నో ఎదురైనా అవన్నీ లెక్కచేయకుండా తాను అనుకున్నది సాధించాలని పట్టుదలతో శ్రమించి
క్రికెట్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చేపేరు సచిన్ ఇందులో ఏమాత్రం సందేహం లేదు.తన చిన్ననాటి నుండి కష్టాలు ఒడిదుడుకులు ఎన్నో ఎదురైనా అవన్నీ లెక్కచేయకుండా తాను అనుకున్నది సాధించాలని పట్టుదలతో శ్రమించి శిఖరాగ్రికి చేరి ఎంతోమందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన మహానుభావుడు సచిన్ టెండూల్కర్.

రాజ్యసభ సభ్యుడు:
ఎన్నో విజయాలు మరెన్నో సంచలనాలు సృష్టించిన సచిన్ టెండూల్కర్ కృషి ని గౌరవించి కేంద్ర ప్రభత్వం తనను రాజ్యసభ సభ్యుడుగా నియమించిన విషయం విదితమే.ఇప్పటికి తనకు పదవి కాలం ఆరు ఏళ్ళు గడిచింది.

సచిన్ పై అనుచిత వ్యాఖ్యలు:
ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు సచిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.తన పదవి కాలంలో అసలు సభలకు హాజరు అవలేదు కానీ నెలవారీ జీతం మాత్రం తీసుకోని సభా కార్యకలాపాలను ఉల్లాంగిస్తున్నారని వ్యాఖ్యలు చేసారు.

సంచలన నిర్ణయం:
ఈ నేపథ్యం లో సచిన్ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు ఇదేమిటంటే తన ఆరేళ్ల పదవీకాలంలో మొత్తం జీతం 90 లక్షలు తీసుకోగా అది మొత్తం PM రిలీఫ్ ఫండ్ కు అందజేసినట్టు ఆయన తెలిపారు.

టెండూల్కర్ కార్యాలయం:
అంతేకాకుండా టెండూల్కర్ కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 185 ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు ఇందుకు గాను రూ. 7.4 కోట్లు కేటాయించారు. విద్య, సంబంధిత నిర్మాణాల అభివృద్ధికి, తరగతిగదులు పునర్నిర్మించడానికి రూ.30 కోట్లు కేటాయించారన్నారు.

గ్రామ యోజన పథకం:
టెండూల్కర్ పార్లమెంటు గ్రామ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని పుతుమ్ రాజు కందిరీగ అనే గ్రామాన్ని మరియు మహారాష్ట్రలోని డొంజా అనే గ్రామాన్ని దత్తకు తీసుకోని అధివృధి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications