మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIPs) పట్ల పెట్టుబడిదారులలో రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది.

రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్ లో ఒక షేర్ విలువ తగ్గిపోయినా, ఇతర షేర్లు, రుణపత్రాల ద్వారా సరాసరి చేసుకుని ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం వుంటోంది. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టడానికి అర్హత కలిగిన కొన్ని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ SIPs గురించి తెలుసుకుందాం. మేమిక్కడ అత్యుత్తమమైన రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ SIPs గురించి మాత్రమే చెప్పదలచుకున్నాం.

పెట్టుబడులు
ఇది ముఖ్యంగా 5-10 సంవత్సరాల పరిమితి కలిగిన దీర్ఘకాలిక పెట్టుబడులు మరియు పోర్ట్ ఫోలియోలో ఉన్న స్టాక్స్ పై రాబడిని సూచిస్తుంది.

1.రిలయన్స్ ఈక్విటీ ఆపర్చూనిటి ఫండ్:
ఇది 2005లో ఆరంభమైనప్పటి నుండి సుమారుగా 18.58% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ మంచి ప్రాధాన్యత కలిగిన ఎస్.బి.ఐ, ఇండియన్ హోటల్స్, దివిస్ లాబ్స్, హెచ్.డి.ఎఫ్. సి బ్యాంక్ మరియు ఈ ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్ తో అవగాహన కలిగి ఉంది. ప్రాధమికంగా 5000 రూపాయల పెట్టుబడి అవసరం
అవుతుంది. తదనంతరం మీరు 500 రూపాయల చిన్న మొత్తాన్ని కూడా పెట్టుబడిగా పెట్టవచ్చు. వృద్ధి ప్రణాళిక ప్రకారం ఈ ఫండ్ నికర ఆస్తి విలువ (NAV) 92.43 రూపాయలు మరియు డివిడెండ్ ప్రణాళిక ప్రకారం ఈ ఫండ్ 29.41 రూపాయల వద్ద లభిస్తుంది. ఈ పోర్ట్ ఫోలియోలో ఉన్న ఇండియన్ హోటల్స్ మరియు దివిస్ లాబ్స్ వంటి స్టాక్స్ సెన్సెక్స్ లోనివి కాదు పైగా అస్థిరమైనవి.
కనుక ఆ మేరకు రాబడి అస్థిరంగా ఉంటుంది. ఈ ఫండ్ ద్వారా ఐదేళ్లలో 15 శాతం రాబడి వచ్చింది. మీరు ఆన్లైన్లో కూడా రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ SIP ను ఆపేయవచ్చు.

2. రిలయన్స్ టాప్ 200 ఫండ్:
ఇది కూడా రిలయన్స్ ఈక్విటీ ఆపర్చూనిటి ఫండ్ వలే ఈక్విటీ ఆధిపత్యం కలిగిన పథకం. కనుక మార్కెట్లు పనితీరు బాగుంటేనే దీనిపై రాబడి కూడా బాగుంటుంది. ఏదేమైనప్పటికి, దీని గత చరిత్ర గమనిస్తే కనుక రిలయన్స్ టాప్ 200 ఫండ్ పెట్టుబడిదారులు మంచి రాబడి పొందినట్లు తెలుస్తుంది. ఈ ఫండ్ పై ఐదేళ్ల రాబడి 19.12%గా ఉంది. ఐదవ సంవత్సర రాబడి 12% నమోదు అయింది.

ఎస్.బి.ఐ
ఈ కంపెనీ యొక్క అతిపెద్ద హోల్డింగ్స్ ఎస్.బి.ఐ, ఐ.టి.సి, ఇన్ఫోసిస్, హెచ్.డి.ఎఫ్. సి బ్యాంక్ మరియు లార్సెన్ ఎండ్ టర్బో వద్ద ఉన్నాయి. వృద్ధి ప్రణాళిక ప్రకారం ఈ ఫండ్ నికర ఆస్తి విలువ (NAV) 92.43 రూపాయలు మరియు డివిడెండ్ ప్రణాళిక ప్రకారం ఈ ఫండ్ 29.14 రూపాయల వద్ద లభిస్తుంది. మీరు ఆన్లైన్లో కూడా మీ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ SIP ను రద్దుచేసుకోవచ్చు.

3. రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ :
రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఈ స్కీం అత్యుత్తమ ప్రదర్శన కనపరిచింది. కానీ ఇక్కడ మేము చెప్పదలచుకున్నది ఏమిటంటే, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు అత్యధిక రిస్కుతో ముడిపడి ఉంటాయి. మీరు అస్థిరమైన రాబడికి సంసిద్ధులైతే కనుక, మీకు రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ సరైనదే!

తొలిసారిగా 5000 రూపాయల మదుపు పెట్టిన
అనంతరం 100 రూపాయల చిన్న మొత్తాన్ని కూడా మదుపుగా పెట్టవచ్చు. గడచిన ఐదేళ్లుగా, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ పై రాబడి సరాసరిన ఏడాదికి 37%గా ఉంది. మూడేళ్ళ రాబడి యొక్క సరాసరి 21.47%. వృద్ధి ప్రణాళిక ప్రకారం ఈ ఫండ్ నికర ఆస్తి విలువ (NAV) 45.45 రూపాయలు మరియు డివిడెండ్ ప్రణాళిక ప్రకారం ఈ ఫండ్ విలువ 32.43 రూపాయలు. మీరు కనుక రిస్క్ తీసుకోదలచుకుంటే ఈ ఫండ్ పై మదుపు పెట్టండి.

4. రిలయన్స్ లిక్విడిటి ఫండ్:
ఇది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకుండా, స్థిరమైన మరియు ఖచ్చితమైన రాబడి పొందాలనుకునేవారికి నప్పుతాయి. ఈ పధకంలో రుణము మరియు ధన మార్కెట్ సాధనాలలో మదుపు పెడతారు. ఈ ఫండ్ ద్వారా గడచిన ఐదేళ్లలో 8.06% రాబడి వచ్చింది. ఈ పధకంలో SIP సదుపాయం లేనందున ఒక్కసారి పెద్ద పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.
ఎవరికైతే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఈక్విటీ
మ్యూచువల్ ఫండ్ స్కీములో మదుపు పెట్టాలనిలేదో, వారికి ఈ ప్లాన్ సిఫార్స్ చేస్తున్నాం.

ముగింపు:
మొదటి మూడు పథకాలలో రిస్కుతో కూడుకుని ఉన్నప్పటికి, నాల్గవ పధకం రిస్క్ ఇష్టపడని వారి కోసం ఉద్దేశించినది. మీరు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ యొక్క SIP ను ఆన్లైన్లో ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు.ఆన్లైన్లో ఫండ్ స్టేట్మెంట్ పొందవచ్చు. ఇంతేకాక ఆన్లైన్లో SIP క్యాలికులేటర్ కూడా లభ్యమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు మార్కెట్ రిస్కుకు లోబడి ఉంటాయని మాత్రం మర్చిపోకండి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications