For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్ లోకి వెళ్లే వారి కోసం ఒక కోతి కథ !

By Sabari
|

వ్యాపారం చేయాలి అంటే తపన ఉండాలి ,కసి ఉండాలి, అది అంత ఆషామాషీ కాదు అని మన పెద్దవాళ్లు చెబుతుంటారు.
కానీ వాటితో పాటు తెలివి ,లౌక్యం, ఎదుటి వారి బలహీనతను మన బలంగా ఎలా మార్చుకోవాలో కూడా తెలిసిండాలి.
స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టాలి అనుకొనే వారికీ ఆ వ్యాపారం ఎలా ఉంటుందో సరదాగా ఒక కథ ద్వారా తెలుసుకుందాం.

 వ్యాపారి :

వ్యాపారి :

అది ఒక పల్లెటూరు అక్కడ చాల కోతులు ఉండేవి. ఒక రోజు అక్కడికి ఒక వ్యాపారి వచ్చాడు.ఏదన్నా వ్యాపార కోణం లో చూసే ఆ వ్యాపారి అక్కడ కోతులని చూడగానే ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది.

కోతులు :

కోతులు :

తనకి కోతులు అంటే ఇష్టం అని ఎవరయితే తనకి కోతులని తీసుకొచ్చి ఇస్తారో వాళ్లకి కోతికి రూ.100 చప్పున ఇస్తాను అని ప్రకటించాడు. ఇది విన్న గ్రామా ప్రజలలో కొంత మంది వ్యాపారిని పిచ్చోడు అనుకున్నారు.ఇంకొందమంది పోయేది ఏముంది అని కోతులని తీసుకెళ్లారు.వ్యాపారి నిజంగానే కోతికి రూ.100 చప్పున ఇచ్చాడు

వార్త:

వార్త:

ఈ వార్త ఊరు అంత పాకింది.అంతే అందరు కోతుల వెనకాల పడ్డారు.కాళీ లేకుండా కోతులని పట్టి డబ్బులు సంపాదించారు.

కోతికి రూ.200:

కోతికి రూ.200:

కొన్ని రోజులకి కోతికి రూ.200 అని ప్రకటించాడు ఆ వ్యాపారి.దింతో ప్రజలు ఇంకా అదే పని మీద ఉంటూ కోతులని పట్టుకున్నారు. దింతో ఆ ఊరిలో కోతులు అన్నిటిని అమ్మేసారు.

కోతికి రూ.500:

కోతికి రూ.500:

తర్వాత ఆ వ్యాపారి కోతికి రూ.500 అని ప్రకటించాడు. అప్పటి నుంచి ప్రజలు నిద్ర హారాలు మానేసి మరి కోతుల వేట ప్రారంభించి ఎలాగోలా కొన్ని కోతులని పట్టి వ్యాపారికి ఇచ్చారు.ఇక ఆ ఊరి చుట్టూ పక్కల ఒక కోతి కూడా లేదు

కోతికి రూ.1000 :

కోతికి రూ.1000 :

అప్పుడు ఆ వ్యాపారి కోతికి రూ.1000 అని ప్రకటించి అర్జంట్ పని మీద ఉరికి వెళ్తున్న అని అసిస్టెంట్ ను గ్రామా ప్రజలకి పరిచయం చేసి వెళ్ళాడు.

ఊరిలో జనం అంత వ్యాపారి వచ్చేటప్పటికి ఎలాగా ఐనా కోతులని పట్టుకోవాలి అనుకున్నారు.ఎంత వ్యతికిన వాళ్లకి ఒక కోతి కూడా కనపడలేదు.దీని అవకాశంగా తీసుకున్న అసిస్టెంట్ వాళ్లకి ఒక ఉపాయం చెప్పాడు.

అసిస్టెంట్ ఉపాయం:

అసిస్టెంట్ ఉపాయం:

నా దగ్గర ఉన్న కోతులని రూ.700 చప్పున అమ్ముతా మా ఓనర్ రాగానే అవి ఆయనికి ఇచ్చేసి రూ.1000 తీసుకోండి.మీకు కోతికి రూ.300 లాభం అని చెప్పాడు.అది నచ్చిన గ్రామస్థులు అలాగే అని చెప్పి డబ్బు ఉన్న వారు అందరు తమ దగ్గర ఉన్న డబ్బు తో కోతులని కొనేశారు.లేని వారు అప్పు చేసి మరి కొన్నారు

వ్యాపారి కోసం :

వ్యాపారి కోసం :

కోతులని అమ్మేశాక అసిస్టెంట్ ఊరు వదిలి వెళ్ళిపోయాడు.కోతులని తమ వద్దే ఉంచ్చుకొని వ్యాపారి కోసం వేచి చూసారు ఆ జనం .వ్యాపారి ఊరు నుంచి పోయి చాల రోజులు ఐనా రాలేదు. తిరిగి ఇచ్చేద్దాం అంటే అసిస్టెంట్ కూడా లేడు.

నమ్మకం పోయింది:

నమ్మకం పోయింది:

కొన్ని నెలల తర్వాత ఆ వ్యాపారి వస్తాడు అని నమ్మకం పోయింది. ఆలా అని ఆశ చావక రూ.700 పెట్టి కొన్న కోతులని వదలలేక వాటికీ కాపలా కాయలేక వారి బాధ ఎవరికీ చెప్పుకోలేక వాళ్లలో వాళ్లే సతమతం అయ్యారు.

 స్టాక్ మార్కెట్:

స్టాక్ మార్కెట్:

ఇదే నండి వ్యాపారం దీన్ని మనం స్టాక్ మార్కెట్ అంటున్నాము .ఈ వ్యాపారం ఎంతోమందిని అప్పుల పాలు చేసింది మరి ఎంతోమందిని కోటీశ్వరులని చేసింది.

Read more about: stock market nifty sensex
English summary

స్టాక్ మార్కెట్ లోకి వెళ్లే వారి కోసం ఒక కోతి కథ ! | True Fact Story About Stock Market

A stock market, equity market or share market is the aggregation of buyers and sellers of stocks, which represent ownership claims on businesses.
Story first published: Wednesday, March 7, 2018, 12:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X