నిత్యం పని మీదే ఆలోచిస్తున్న మనకి ఒక చిన్న ఆలోచన వచ్చిన అది మన జీవితం లో పెను మార్పును తెస్తుంది,అంతేకాక ఆ ఆలోచన ద్వారా అనేక మందికి ఉపాధి కూడా కలుగుతుంది.
ఒక్క ఆలోచనతో 600 కోట్లు
మనం చేసే పని ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అన్ని సుసాధ్యాలే,మనం ఈ ప్రపంచానికి తెలియాలంటే మనం సాధించిన గొప్ప విజయాలే ఇందుకు దోహద పడతాయి.ఏదైనా సాధించాలని పట్టుదలతో కసిగా అడుగులు వేస్తుంటే మనకు ప్రోత్సహించే వాళ్ళకంటే అడ్డుపడేవాళ్లు చాలామందే ఎదురవుతుంటారు.నిత్యం పని మీదే ఆలోచిస్తున్న మనకి ఒక చిన్న ఆలోచన వచ్చిన అది మన జీవితం లో పెను మార్పును తెస్తుంది,అంతేకాక ఆ ఆలోచన ద్వారా అనేక మందికి ఉపాధి కూడా కలుగుతుంది.ఇంతకీ ఆ ఆలోచన ఏంటి ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా అతడే Mr .vss .Mani(వెంకటాచలం స్థాను సుబ్రమణి మని)ఇతడు స్థాపించిన సంస్థ పేరు Justdial.

Mr .vss .Mani(వెంకటాచలం స్థాను సుబ్రమణి మని):
Mr .vss .Mani(వెంకటాచలం స్థాను సుబ్రమణి మని):
Justdial అనేది వెంకటాచలం స్థాను సుబ్రమణి మణి (V.S.S. మణి) స్థాపించిన భారతీయ ఆధారిత సంస్థ. ఇది శోధన సేవలను అందిస్తుంది,ఇది వెబ్సైట్ మరియు మొబైల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రధాన కార్యాలయం భారతదేశంలో మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. అహ్మదాబాద్, బెంగుళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్కతా మరియు పూణేలలో కార్యాలయాలు ఉన్నాయి.

సంస్థ మొదట్లో:
vss .mani గురించి ఎంత చెప్పిన తక్కువే ఇతను మొదట్లో ఒక చిన్న గ్యారేజీని అద్దెకు తీసుకోని కొన్ని కంప్యూటర్లు అమర్చి కేవలం ఆరు మంది సిబ్బందితో మొదలుపెట్టాడు.ఇంతటి మొహూతరమైన ఆలోచన రావడానికి కారణం మని పనిచేసిన పూర్వ కంపెనీ.1987 లో ఇతను యునైటెడ్ డేటా బేస్ ఇండియా కంపెనీ లో పని చేసాడు ఏది ఎల్లో పేజెస్ సంస్థకి చెందినది అప్పట్లో 888 88 88 అనే నంబరు ముంబై లోని కాండీవాలి ఎక్స్చేంజి కు సంబంధించింది.కాలక్రమేణా మని ఈ నంబర్ను సొంతం చేసుకున్నారు కేవలం ఆరు మంది సిబ్బంది తో మొదలుపెట్టి ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద సంస్థ గా ప్రఖ్యాతి పొందింది.

Justdial యొక్క ఉపయోగాలు:
వినియోగదారులు ఒక హాట్ లైన్ నంబర్కు కాల్ చేసి, వారు ఏమి సేవను (ఉదా: రెస్టారెంట్లు, ఆసుపత్రులు, బ్యాంకులు మొదలైనవాటిని) వెతుకుతున్నారని ఆపేటర్లను అడిగి మరియు అది ఏ ప్రాతంలో ఉందొ తెలుస్కోవచ్చు .దీనితో ఆపరేటర్ ఫోనుకు సమాచారం గురించి ఒక ఇమెయిల్ మరియు ఒక SMS పంపబడుతుంది. అంతే కాకుండా, వినియోగదారులు వెబ్సైట్ మరియు మొబైల్ అప్లికేషన్లలో ఏదైనా నిర్దిష్ట వ్యాపారం యొక్క సమాచారాన్ని వెతకవచ్చు.

2007 లో ఆన్ లైన్ వెబ్ సైట్లు:
జస్ట్ డైల్ సమాచారం తెలుసుకోడానికి పూరహిగా ల్యాండ్ లైన్ మీద ఆధారపడి పనిచేసేది ఊహించని విదంగా వినియోగదారులు పెరిగారు కాల్స్ కూడా పెరిగాని కానీ ఇందుకు గాను టెలిఫోన్ బిల్లు విపరీతంగా పెరిగిపోయాయి వినియోగ దారులు అడిగే సమాచారం వేగంగా అందించేందుకు ఇంటర్నెట్ స్పీడును పెంచేందుకు గాను అదనంగా యాబై వేలు వెచ్చించారు ఐతే రాబడి కన్నా పేట్టే ఖర్చు ఎక్కువా కావడంతో మని 2007 ఒక సరి కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు అదే ఆన్ లైన్(online) అప్పటినుండి www.justdail.com అనేది విశిష్ట ఆదరణ పొందింది,భాష మరియు ప్రాంతంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఎవరైనా ఏ ప్రాంతం నుండైనా వారికీ కావాల్సిన సమాచారం కోసం జస్ట్ డైల్ ని సోదించి చిటికెలో తెలుసుకుంటున్నారు.

ప్రస్తుత కంపెనీ ఆదాయం అంచనా:
కాలక్రమేణా సంస్థ పెరుగుతూ వచ్చింది అంతే కాకుండా ఆదాయం కూడా పెరిగింది ప్రస్తుతం కంపెనీ నికర ఆదాయం సుమారు 110 US డాలర్లు అంటే అక్షరాలా 690.83 కోట్లకు పైబడే అన్నమాట.

సంస్థ ఉద్యోగస్తులు:
సంస్థ మొదట్లో కేవలం ఆరు మంది సిబ్బందితో మొదలై ప్రస్తుతం జస్ట్ డైల్ కంపెనీ లో సుమారు11,000 పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అని అంచనా.
చూసారా వి ఎస్ మని తనకు వచ్చిన చిన్న ఆలోచనతో ఎంతమందికి ఉపాధి కలిగించి అన్నం పెడుతోందో ఎంత సంపదను తెస్తోందో ఇంకో అద్భుతమైన విశమేంటంటే ఈ సంస్థ ప్రారంభించే సమయానికి మని వయసు కేవలం 21 సంవత్సరాలు,మన దేశంలో ఈ వయసు కలిగిన యువత కొన్ని లక్షల మంది ఉన్నారు ఒకరికి వచ్చిన ఆలోచనే ఇంత అద్భుతంగా ఉంటే అదే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనలు వస్తే ప్రపంచంలోనే మన దేశం అగ్రస్థానంలో నిలవడం కాయం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications