For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువల్ ఫండ్ నుంచి ఎప్పుడు సొమ్ము వెన‌క్కు తీసుకోవాలి?

అవ‌స‌ర‌మైన‌ప్పుడల్లా వెన‌క్కి తీసుకుంటూ పోతే అనుకున్న ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోలేరు. ఈ నేప‌థ్యంలో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కు తీసుకోవాలి అనే విష‌యాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

|

ఈ మ‌ధ్య మార్కెట్ల‌పై అవ‌గాహ‌న పెరుగుతుండ‌టంతో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల వైపు మ‌ళ్లుతున్నారు. డిపాజిట్ల‌పై ఆస‌క్తిక‌ర రాబ‌డులు రాక‌పోవ‌డం ఇందుకు ఒక కార‌ణం. అయితే ఎక్కువ రిస్క్ తీసుకోలేనివారు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడుతున్నారు. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలం దృష్టితోనే ఉండాలి. అంతే కానీ అవ‌స‌ర‌మైన‌ప్పుడల్లా వెన‌క్కి తీసుకుంటూ పోతే అనుకున్న ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోలేరు. ఈ నేప‌థ్యంలో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కు తీసుకోవాలి అనే విష‌యాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

1. దీర్ఘ‌కాలం కొన‌సాగించాలి

1. దీర్ఘ‌కాలం కొన‌సాగించాలి

ఒక మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను దీర్ఘకాలం కొనసాగిస్తే, సంపద అదే పెరిగిపోతుందని చాలా మంది ఇన్వెస్టర్లు అనుకుంటారు. అయితే ఇది అన్ని ఫండ్స్‌కు వర్తించదు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఆ ఫండ్స్‌ పనితీరును తప్పనిసరిగా మదింపు చేయాలి. మంచి రాబడులు ఇస్తుందా లేక ప్రతికూలంగా ఉందా గమనించాలి.

2. ఫండ్ ప‌నితీరును బ‌ట్టి నిర్ణ‌యం

2. ఫండ్ ప‌నితీరును బ‌ట్టి నిర్ణ‌యం

ఫండ్‌ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేకపోయినా, ఈ కేటగిరిలోని ఇతర ఫండ్స్‌ కన్నా అధ్వానంగా ఉన్నా ఈ ఫండ్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి బదిలీ చేయాలి. దశాబ్దాలుగా మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్‌ పనితీరు అధ్వానంగా ఉంటే పనితీరు మెరుగుపడేదాకా వెయిట్‌ చేయడం ఉత్తమం.

3. ఫండ్ మేనేజ‌ర్ ముఖ్య‌మే

3. ఫండ్ మేనేజ‌ర్ ముఖ్య‌మే

ఫండ్‌ మేనేజర్‌ మార్పు కూడా పరిగణనలోకి తీసుకోదగిన విషయమే. మీ ఫండ్‌ మేనేజర్‌ను సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ తొలగించి వేరే ఫండ్‌ మేనేజర్‌ను నియమించిందనుకుందాం. వెంటనే మీ ఇన్వెస్ట్‌మెం‍ట్స్‌ను మార్చేయాల్సిన పనిలేదు. కొత్త ఫండ్‌ మేనేజర్‌​ట్రాక్‌ రికార్డ్‌ను పరిశీలించండి. కొత్త ఫండ్‌ మేనజర్‌ నేతృత్వంలో మీ ఫండ్‌ పనితీరును కనీసం ఆరు నెలల పాటు అయినా మదింపు చేయండి. ఆ ఫండ్‌ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు ఆ ఫండ్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి మార్చుకోవచ్చు.

4. తక్కువ రాబ‌డులొస్తుంటే వైదొల‌గండి

4. తక్కువ రాబ‌డులొస్తుంటే వైదొల‌గండి

మీరు రెండు, అంతకంటే ఎక్కువ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుందాం. ఒకటికి మించిన ఫండ్‌ పోర్ట్‌ఫోలియో స్టాక్‌ హోల్డింగ్స్‌ దాదాపు ఒకే విధంగా ఉంటే, ఏదో ఒక ఫండ్‌ నుంచి వైదొలగడమే ఉత్తమం. ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలు ఒకే విధంగా ఉంటే, డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు మీకు లభించవు. మీ పోర్ట్‌ఫోలియోలో అధిక సంఖ్యలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉంటే, తక్కువ రాబడులు వచ్చే, పనితీరు బాగా లేని ఫండ్స్‌ నుంచి ఇన్వె‍స్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు.

5. మ‌రీ ఎక్కువ ఫండ్స్ లేక‌పోవ‌డ‌మే మేలు

5. మ‌రీ ఎక్కువ ఫండ్స్ లేక‌పోవ‌డ‌మే మేలు

మీ పోర్ట్‌ఫోలియోలో ఐదు కంటే ఎక్కువ ఫండ్స్‌ ఉండకపోవడమే మంచిది. ఇక మీ అంచనాలకు అనుగుణంగా లేని ఫండ్స్‌ను కూడా విక్రయించవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే.. సొంత ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు తదితర ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులు వస్తాయి. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Read more about: mutual funds investments
English summary

మ్యూచువల్ ఫండ్ నుంచి ఎప్పుడు సొమ్ము వెన‌క్కు తీసుకోవాలి? | Selling Your Mutual Fund Investments- Note These Important Points

Obviously the investment goal with which you have made your money parked in mutual fund kitty will push you to pull out the funds from these investments. Nonetheless you should note these important points before redeeming mutual fund units or following criteria should decided your exit decision:
Story first published: Wednesday, January 17, 2018, 14:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X